*1961*
*కం*
నేతృత్వంబొకమోహము
నేతగమారిన తదుపరి నెయ్యములరుగున్.
భాతృత్వానందములును
నేతృత్వపు మాయచేత నీల్గును సుజనా.
*భావం*:-- ఓ సుజనా! నేతృత్వమనేది ఒక మోహము,నేతగా మారితే స్నేహాలు కూడా చెడిపోవును. సోదరసమ్మోదనులు కూడా నేతృత్వపు మాయచేత నశమగును.
*సందేశం*:-- నాయకత్వం అనే మాయాపదవి దక్కితే మిత్రహితబంధువులంతా శత్రువులుగా మారిపోతారు.
*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి