👆శ్లోకం
స్వయంభూః శంభురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః | అనాదినిధనో ధాతా
విధాతా ధాతురుత్తమః ||
ప్రతిపదార్ధ:
స్వయంభూ : - తనంతట తానే ఉద్భవించిన వాడు.
శంభు: - సర్వశ్రేయములకు మూలపురుషుడు.
ఆదిత్య: - సూర్యుని యందు స్వర్ణకాంతితో ప్రకాశించువాడు. పుష్కరాక్ష: - పద్మముల వంటి కన్నులు గలవాడు.
మహాస్వన: - గొప్పదియగు వేదరూప నాదము గలవాడు.
అనాదినిధన: - ఆద్యంతములు లేని వాడు.
ధాతా - నామరూపాత్మకమైన ఈ జగత్తునకు అద్వితీయుడై ఆధారమై యున్నవాడు.
విధాతా - కర్మఫలముల నందించువాడు.
ధాతురుత్తమ: - సర్వ ధాతువులలో ఉత్తమమైన చిద్రూప ధాతువు తానైనవాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి