😄😃😄😃😄
*టీచర్*: ఇండియా గేట్ అంటే ఏమిటి ?
*స్టూడెంట్*: బస్మతీ బియ్యం.
*టీచర్*: చార్మినార్ అంటే ?
*స్టూడెంట్*: సిగరెట్లు.
*టీచర్*: తాజ్ మహల్ అంటే ?
*స్టూడెంట్*: "' టీ "' , సర్.
*టీచర్* (కోపంగా): అజ్ఞానపు శుంఠ ! మన జాతీయ కట్టడాలను అపహాస్యం చేశావు. నువ్వు టెస్ట్ ఫెయిల్ అయ్యావు. వెళ్ళి మీడాడీది సిగ్నేచర్ తీసుకురా.
స్టూడెంట్ మరుసటి రోజే టీచర్ చేతికి ఓమంచి ఆకర్షణీయమైన పార్సిల్ స్టూడెంట్ వినమ్రతతో అందించాడు.
*టీచర్*: ఏమిటిది ?
*స్టూడెంట్*: సిగ్నేచర్ సర్ ! మీరు మా డాడీది సిగ్నేచర్ తీసుకుని రమ్మన్నారు. ఫుల్ బాటిల్ నే పట్టుకొచ్చాను. 🍾
టీచర్ చెమ్మగిల్లిన కళ్ళతో స్టూడెంట్ తలను ఆప్యాయంగా నిమురుతూ అన్నాడు *" నేనంటే నీకు ఇంత అభిమానం ఉందేమిట్రా, పిచ్చిసన్నాసీ ? నా హృదయాన్ని ద్రవింపచేశావు. టెస్ట్ పాస్ అయ్యావు, ఫో !!! "*
😅😂😆
సేకరణ:- శ్రీ S.T.G. శ్రీనివాస ఆచార్యుల వాట్సాప్ పోస్ట్.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి