10, ఏప్రిల్ 2023, సోమవారం

మూర్ఛవ్యాధి హరించుటకు

 మూర్ఛవ్యాధి హరించుటకు రహస్య యోగాలు  - 


 * రేగుగింజలలోని పప్పు , మిరియాలు , వట్టి వేళ్ళు , నాగకేసరములు ఈ వస్తువులను సమానంగా తీసుకుని చూర్ణం చేసి పూటకు రెండున్నర గ్రాములు చూర్ణం చొప్పున తేనెతో కలిపి ఇచ్చుచుండిన యెడల మూర్ఛలు హరించును . 


 * ఒక జాజికాయకి రంధ్రం చేసి పట్టుదారంతో గ్రుచ్చి కంఠము నందు కట్టుకొని తీయకుండా ధరించుచుండిన స్త్రీల మూర్చవ్యాధి , హిస్టీరియా వ్యాధి నశించును.


 * ఇనుప గంటె లో పొంగించిన అల్లపురసం గిద్దెడు తీసుకుని ముప్పై గ్రాములు పటికబెల్లం పొడి కలుపుకుని ప్రాతఃకాలం నందు నిత్యం సేవించుచున్న యెడల మూర్చవ్యాధి హరించును . 


 గమనిక - ఇనుప గంటె తీసుకుని దానిలో అల్లంరసం పోసి వేడి చేసిన వేడికి గంటె లోని అల్లం రసం పొంగును.


 *  జటామాంసి చూర్ణం 60 గ్రాములు , హారతి కర్పూరం రెండున్నర గ్రాములు , దాల్చిన చెక్క చూర్ణం 5 గ్రాములు మూడింటిని తీసుకుని కలిపి మెత్తగా నూరి ఒక గాజు సీసాలో పోసుకొని ప్రతినిత్యం భోజనమును ముందు 3 గ్రాముల చొప్పున తింటూ ఉన్న యెడల అపస్మారం హరించివేయును . దీనిని మించిన ఔషధం లేదు . 


 *  ఆవు యొక్క ఎడమ కొమ్ముని ఉంగరంలా చేసుకుని ఎడమ చేతికి ధరించిన అది చేతికి ఉన్నంతవరకు మూర్ఛ రాదు .


 గమనిక - 


 మూర్చ వచ్చి కొట్టుకుంటున్న వ్యక్తి కి సీతాఫలం చెట్టు ఆకు నలిపి ముక్కుదగ్గర పెట్టి వాసన చూపించిన వెంటనే మూర్చ తగ్గి తెలివి వచ్చును.


     రావిచెట్టు పాలు 4 చుక్కలు ముక్కులో వేసినను మూర్చ తగ్గి వెంటనే తెలివి వచ్చును. రెండు ముక్కులలో అటు 2 ఇటు 2 వేయవలెను . 


     ఇవి నా అనుభవ యోగాలు ..


          


          

కామెంట్‌లు లేవు: