**అద్వైత వేదాంత పరిచయం**
5.1.1.4 మనుష్య యజ్ఞ్ణ: :` నాలుగో యజ్ఞం మనుష్య యజ్ఞం.
అన్ని రకాల సంఘసేవలు దీంట్లోకి వస్తాయి. అనాధశరణాలయాలకి, వృద్ధాశ్రమాలకి, స్కూళ్ళకి, ఆసుపత్రులకి సహాయం చేయటం వగైరా. కాని ఆ సహాయం ఎలా చేయాలో కూడా శాస్త్రం ఉపదేశిస్తుంది.
శ్రద్ధయా దేయమ్.
అశ్రద్ధయా అదేయమ్.
శ్రియా దేయమ్.
హ్రియా దేయమ్.
భియా దేయమ్.
సంవిదా దేయమ్. తైత్తిరీయం 1`11`6
వచ్చిన చిక్కేమిటంటే, ఇప్పుడు తక్కిన నాలుగు యజ్ఞాలు పక్కన పెట్టేసి, ఇదొక్కటీ చేస్తే చాలనుకుంటున్నారు. ఇది సరియైన అవగాహన లేక వచ్చిన సమస్య. మనుష్యులకి కేవలం కార్బోహైడ్రేట్సే చాలు అన్నట్టుంది. అందుకని మనుష్య యజ్ఞంతో పాటు, తక్కిన యజ్ఞాలు కూడాచేయాలి.
5.1.1.5 భూత యజ్ఞ: :` ఐదో యజ్ఞం, భూత యజ్ఞం. మనిషితో కూడా
ఉన్న తక్కిన జీవరాశులన్నిటికీ చేసే సేవ. మన జీవితం సుగమంగా సాగటానికి తక్కిన జీవరాశులు కూడా తోడ్పడుతాయన్న విషయాన్ని మరవకూడదెన్నడూ. చెట్లూ, జంతువులూ, నదులూ మనకి తోడ్పడుతున్నాయి.
అశ్వత్థో వటవృక్ష చందన తరుర్ మందార కల్పదృమౌ।
జంబూ నింబ కదంబ చూత సరళ వృక్షశ్చ ఏ క్షీరిన:।
సర్వే తే ఫల సంయుతా ప్రతిదినం విభ్రజనమ్ రాజతే।
రమ్యం చైత్ర రథం చ నందనవనం కుర్వంతు నో మంగళం॥
అశ్వత్థ, కదంబ, మందార, సరుగుడు చెట్లనీ, పండ్లిచ్చే జామ, మామిడి లాంటి చెట్లనీ, చైత్రవనాన్నీ, తోటనీ అవి చేసే సహాయాన్నీ నేను గుర్తుంచుకుని అవి మానవాళికి మంగళం చేకూర్చేలాగా పెంచి పోషించాలి.
గంగ సింధు సరస్వతి చ యమున గోదావరి నర్మద।
కావేరీ సరయు మహేంద్ర తనయ చర్మన్‌వతి వేదిక।
క్షిప్ర వేత్రవతి మహా సుర నది ఖ్యాతీ చ య గండకీ।
పూర్ణా పూర్ణ జలైహి సముద్ర సహిత: కుర్వంతు నో మంగళం॥
ఇదే విధంగా గంగ, యమన, గోదావరి, నర్మద లాంటి ప్రవహించే నదులు చేసే సహాయాన్ని గుర్తుంచుకుంటాను. వాటికి నేను తిరిగి సహాయం చేయలేకపోయినా కనీసం వాటిని కలుషితం చేయను, నాశనం చేయను. భారీ ఎత్తున చేయలేకపోయినా, ఇంట్లో తులసిచెట్టు పెట్టుకోవాలి మనం. దానికి భక్తిగా నీళ్ళు పోయాలి. అలాగే జంతువులన్నింటికీ మేలు చేయలేకపోవచ్చు, కాని తినేముందు కొంచెం అన్నం ముద్ద బయటపెడితే
కాకులో, ఆవులో తింటాయి దాన్ని.
ఇది సంపూర్ణమైన అవగాహన. వైదికుడు అంటే విశ్వానికి చెందిన పౌరుడు. ఎందుకంటే అతను ప్రపంచం గురించి, నక్షత్రాల గురించి తెలిసినవాడు. సంధ్యావందనం చేసేటప్పుడు అన్ని ప్లానెట్లకీ ఆవాహన చెప్తాడు.
ఆదిత్యం తర్పయామి॥
సోమం తర్పయామి॥
అంగారకం తర్పయామి॥
మొత్తం సౌరమండలాన్ని గుర్తుకు తెచ్చుకుంటాడు.
ఈ పంచమహాయజ్ఞం చేయటాన్నే నిష్కామ కర్మాణి, సాత్విక కర్మాణి, ఉత్తమ కర్మాణి,పరఉపకారకర్మాణి అంటారని చూసాం. ఇది ఆధ్యాత్మిక ఎదుగుదలకి తోడ్పడుతుంది ప్రాధమికంగా.
అద్వైత వేదాంత పరిచయం
5.1.2 మధ్యమ కర్మాణి:` ఈ రకం కర్మలు సకామ కర్మలు (కోరికతో చేసేవి). వీటిని రాజస కర్మాణి, పర ఉదాసీన కర్మాణి అని కూడా అంటారు. పర ఉదాసీన కర్మాణి అంటే ఎవరెలా పోతే నాకేం అని యితరులనిపట్టించుకోకపోవటం. వాళ్ళ సమస్యలని, వాళ్ళ ఉనికినే ఖాతరు చేయము. మన కోరిక తీరితే చాలు, అంతే. ఇలాంటి కర్మలు ప్రాపంచిక సౌఖ్యం తెచ్చిపెడతాయి కాని ఆధ్యాత్మిక ఎదుగుదలకిఏమాత్రం తోడ్పడవు.
అద్వైత వేదాంత పరిచయం
5.1.3 అధమ కర్మాణి :వీటిని తామస కర్మాణి, నిషిద్ధ కర్మాణి, పర అపకార కర్మాణి అని కూడా అంటారు. వీటి కింద చేయకూడని కర్మలు లేదా వినాశనకారి కర్మలు వస్తాయి. మనకి లాభం కలుగుతుంది కాని ఎదుటి వారికి హానికరమైన ఈ కర్మలు మనకి ఆధ్యాత్మికంగా ఎదుగుదల చేకూర్చకపోగా, ఇంకాకిందకి జారుస్తాయి.
ఆ విధంగా మొదటిది ఆధ్యాత్మిక పురోగతి కలగజేస్తే, రెండోది ఆధ్యాత్మిక స్థబ్ధత కలగజేస్తే, మూడోది ఆధ్యాత్మిక తిరోగతిని కలుగజేస్తుంది. కర్మయోగి తను చేసే కర్మలలో ఉత్తమ కర్మలు ఎక్కువగానూ, మధ్యమ కర్మలు తక్కువగానూ, అధమ కర్మలు శూన్యంగానూ ఉండేటట్టు మలచుకోవాలి. అధమ కర్మలు తప్పనిసరి పరిస్థితుల్లో చేసినా అంటే పర అపకార కర్మలు చేసినా, వాటిని ఉత్తమ కర్మలతో తుడిచివేయాలి. ఆ విధంగా ఉత్తమ కర్మలు రెండు విధాలుగా పనిచేస్తాయి. ఆధ్యాత్మిక పురోగతికి తోడ్పడుతాయి, తప్పనిసరి కర్మల నుంచి పుట్టిన పాపాన్ని తుడిచివేస్తాయి.
🙏🙏🙏
సేకరణ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి