1. మానవ ప్రయాణం:
మన వేదాలు, వేదాల తరువాత ఉపనిషత్తులు. పురాణ ఇతిహాసాలు ఒక్కొక్క హిందూ గ్రంధం మనిషిని ఆధ్యాతిమిక వైపు దృష్టిని మళ్లించటానికి మాత్రమే. కానీ చివరి లక్ష్యం మాత్రం మోక్షం మాత్రమే. వేరే ఏ ఇతర మతాలలో కనీసం మాట వరుసకు కూడా లేని విచారణ మన హిందూ ధర్మంలోని వున్నా అతి ఉన్నతమైన, పవిత్రమైన భావన ఈ మోక్షం.
వేదాల తరువాత వచ్చినవి వేదాల చివరలో వున్నవి ఉపనిషత్తులు, అందుకే వేదాంతం అని అన్నారు. నిజానికి ఉపనిషత్తులు వేదాల కన్నా భిన్నమైనవి, ఎందుకంటె వేదాలు కర్మ కాండని తెలుపుతే ఉపనిషత్తులు జ్ఞానాన్ని అంటే జ్ఞాన కాండని తెలుపుతాయి. కర్మలు చేయటం వాటి ఫలితాలు ఎలా ఉంటాయి అనేవి వేదాలు ఉపదేశిస్తే, ఉపనిషత్తులు యెట్లా తెలుసుకోవాలి, మనిషి తానె యెట్లా భగవంతుడు గా కావలి అని చెప్పేవి ఇవి.
ఉపనిషత్తులు చాలా వున్నాయ్ అని అన్నారు, కానీ అందులో 108 ప్రముఖంగా అంతకన్నా ప్రముఖంగా 10 ఉపనిషత్తులు అని పండితులు ప్రస్తావిస్తున్నారు. అన్ని ఉపనిషత్తులు మహా ఋషుల తో జరిగిన సంవాదాలే. అంటే మహర్షులు వారి శిస్యులకు ఇచ్చిన జ్ఞాన సంపద మాత్రమే.
మనం ఒక విషయం ఇక్కడ ప్రస్తావించాలి. ఏ ఒక్క మహర్షి కూడా యెంత జ్ఞానాన్ని ప్రసాదించిన దానికి తానూ కర్తనని ఎక్కడ పేర్కొనలేదు. తానూ మహాపురుషుల వద్ద నుండి విన్నది, తెలుసుకున్నది మీకు తెలియ చేస్తున్నాను అని నుదువుతారు. దీనిని బట్టి మన మహర్షులు యెంత నిస్వార్ధంగా ఇతరులకు జ్ఞాన బోధ చేసారో తెలుస్తున్నది. ఏ వక్కటి తన గొప్పతనం కాదని వారు నిరాడంబరులుగా వున్నారు. వారి ధ్యేయం కేవలం జ్ఞాన విస్తరణే కానీ తమకు ఖ్యాతి రావాలని ఏ మహర్షి కోరుకోలేదు.
ఈ రోజుల్లో ఏదో చిన్న విషయం తెలిసినా అది తన ప్రతిభ అని తనకన్నా గొప్పవాళ్ళు లేరనే విధంగా మనుషులు ప్రవర్తిస్తున్నట్లు మనం చుస్తువున్నాం.
ఉపనిషత్తులలో ఉన్న గొప్ప గొప్ప విషయాలను సూక్షంగా చెప్పే వాక్యాలను మహావాక్యాలు అన్నారు. ఈ వాక్యాలు రెండు లేక మూడు పదాలతో ఉండి భగవత్ శక్తిని తెలియ చేస్తుంటాయి.
ఉదా : 1) అహం బ్రహ్మస్మి: రెండు పదాలతో వున్నా ఈ మహా వాక్యం నేను బ్రహ్మను ఐ వున్నాను అని తెలుపుతుంది.
2) తత్ త్వమసి : ఈ మహావాక్యం కూడా చాల ప్రముఖంగా వినబడేది. దీని భావం నీవు వెతికే బ్రహ్మ పదార్ధం నీవే అయి వున్నావు అని చెపుతున్నది. ఈ విధంగా అనేక మహా వాక్యాలు చోటుచేసుకున్నాయి.
ఉపనిషత్తులు అన్ని కూడా అద్వయిత జ్ఞానాన్ని మనకు తెలియ చేస్తున్నాయ్. అంటే దేముడు జీవుడు వేరు కాదు ఒకటే వివరంగా చెప్పాలంటే ఈ చరా చార సృష్టిని నియంత్రించే శక్తీ ఆయన భగవంతుడు జ్ఞానీ ఒకటే కానీ వేరు కాదు అనే మహోన్నత జ్ఞానం మనకు తెలుపు తున్నాయి.
ఆది శంకరా చర్య ఈ అద్వియేత జ్ఞానాన్ని విస్తృతంగా ప్రచారం చేసి అప్పటి బౌద్ధ వాదాన్ని నివారించి భారతావనిలో
హిందువాన్ని పునరుద్దించారు. బౌద్ధ వాదం నుండి చార్వాక వాదం వెలువడింది ఒక రకంగా చెప్పాలంటే ఇది నాస్తిక వాదం లాంటిదే.
తరువాత కాలంలో మనకు విశిష్ట అద్విఏతము, ద్వయితం లాంటివి వచ్చినట్లు మనకు చరిత్ర చెప్పుతున్నది. తరువాత తరువాత ఇప్పుడు నాస్తిక వాదం కూడా వ్యాప్తి చెందుతున్నది.
కాల గమనంలో ఆధ్యాత్మిక ప్రవాహాన్ని గనుక మనం పరిశీలిస్తే 1) నేను, దేముడు వేరు కాదు నేనే దేముడిని అనే అద్విఏత వాదం 2) నేను దేవుడితో సన్నిహితంగా వుంటాను అనే విశిష్ట అద్వియతః జ్ఞానం, 3) దేముడు వీరు నేను వేరు అనే ద్విఏత జ్ఞానం 4) నాకు దేముడితో పని లేదు నేను చూసే, నేను చేసే దానికి నేనే కర్తను అనే నాస్తిక వాదం. ఇది చార్వాకుడి సిధాంతానికి దగ్గరలో ఉంటుంది.
ఇవ్వన్నీ పరిశీలిస్తే మనకు ఒక విషయం బోధ పడుతుంది.
మనిషి పరిణామం ఏ దిశలో వున్నది అన్నది ప్రశ్నర్ధకంగా వున్నది.
రాను రాను దైవత్వం సన్నగిల్లి మూఢ భక్తి ప్రబలుతున్నది. దేముడి గుడికి వెళితే చాలు నా జన్మ ధన్యమైనది, నేను తిరుపతి దేముడిని దగ్గర నుండి రెకమండేషన్తో చూసాను చాలా ఆనందంగా వుంది, నాకు జన్మ సార్ధకం అయంది. ఫలానా బాబా నాతొ మాట్లాడాడు, అయన కళ్ళకు నేను మొక్కాను నా తలమీద చేయి వేసి నన్ను నిమిరాడు, దీవించాడు, ఫలానా స్వామి నాకు ఉపదేశం చేసాడు ( డబ్బులు తీసుకొని) నేను ధన్యుడిని అయ్యాను. నా కోరికలు తప్పకుండా తీరుతాయి. ఫలానా ఆయనకు, ఆమెకు దేముడు వంటిమీదికి వస్తాడు తాను అడిగినది (డబ్బులు, ఇతరములు) ఇస్తే మన కస్టాలు తీరుతాయి. ఫలానా సమాధి వద్దకు వెళ్లి మొక్కుతె నా కోరికలు తీరుతాయి. ఫలానా బాబా గుడికి వెళ్లి మొక్కితే నాకు మంచి జరుగుతుంది. ఇటువంటి మూఢ భక్తి రోజు రోజుకి పెరుగుతున్నది. దీనికి ఆనకట్ట వేయవలసిన అవసరం వున్నది.
మనం మన భారత చరిత్రలో ఎంతో శక్తీ గలిగిన మహర్షులని, దేవర్షులని చూసాము. వారు చూపిన అద్భుత శక్తులు మనకు పురాణ ఇతిహాసాలలో కనపడుతున్నాయి.
సృష్టికి ప్రతి సృష్టి చేసిన బొందితో త్రిశంకుని స్వర్గానికి పంప ప్రయత్నించిన విశ్వామిత్రుడు, చనిపోయిన భార్యను తన కుమారుడైన పరశురాముని కోరికతో బతికించిన జమదగ్ని, కుశుడిని సృష్టించిన వాల్మీకి మహర్షి, తన భార్యను రాయిని చేసిన గౌతమ మహర్షి ఇలా చెప్పుకుంటూ పొతే అనేక మహర్షులు మన భారతావనిలో కనపడతారు.
నిజానికి అంత గొప్ప గొప్ప కార్యాలు చేసిన వారిని ఎవ్వరిని కూడా దేముడు అని కొలవ లేదు. అది మన సాంప్రదాయం ఎందుకంటె అప్పుడు భూమిమీద వున్న జనులు అందరు గొప్ప వాళ్ళు శాపాలు ఇవ్వ గలవారు. ఎంతో కొంత తప్పశెక్తి వున్నవాళ్లు. అంతే కాదు ఇప్పటికి కూడా మనం ఆ మహర్షులను దేముళ్ళగా చూడటం లేదు. వాళ్ళకి ఆలా చూడాలి అనే కోరిక కూడా లేదు.
నేనే దేముడిని:
నేనే దేముడిని అనే వాదం మొదటి సారిగా మనం హిరణ్యకశ్యపుని చూస్తాము. తాను నేనే దేముడిని అని అనటంలో నిజానికి అర్ధం వుంది కూడా యందు కంటే హిరణ్యకశ్యపుడు మహా బలవంతుడు, మహా తపోశక్తి వంతుడు. ఇంద్రాది దేవతలని, నవగ్రహాలని తన స్వాధీనంలో తెచ్చుకున్న ధీశాలి. అంత శక్తీ వంతుడు తన శక్తీ వల్ల వచ్చిన గర్వంతో తానూ దేముడిని అని అనుకున్న కొంత అర్ధం వుంది.
మరి ఇప్పుడు ఎలాంటి శక్తి లేని సామాన్యు మానవులు తాము బాబా లమని సాక్షాతూ ఫలానా దేముడి అవతారలమని, మేము ఆ మాయలు చేస్తాము ఈ మాయలు చేస్తాము అని సామాన్యు ప్రజలని మభ్య పెట్టి అనేక విధాలుగా వ్యాపారాలు చేస్తూ ఉంటే. అమాయక ప్రజలు వారి మాటలు నమ్మి వారి పూజలు, వ్రతాలు, వారికి అస్ట్తోతరాలు, సహస్ర నామ పూజలు, భజనలు, హారతులు ఇచ్చి తమ మూఢ భక్తిని చాటుకుంటున్నారు. అంతే కాదు ఎవరైనా పండితులు, జ్ఞానులు మీరు చేసేది పొరపాటు అట్లా మన హిందూ ధర్మాన్ని, సంప్రదాయాలని పాడు చేయవద్దని అంటే వారిని ఇష్టమొచ్చినట్లు విమర్శించటం చేస్తున్నారు.
మన సమాజంలో సరైన మార్గ నిర్దేశం చేసే వారు లేక పోవటమే దీనికి కారణం. మనం దేముడిని తాత్కాలికమైన ఐహిక మైన తుచ్చమైన వాంచితాలని కొరకుడదని అది అసురత్వం అవుతుందని మనలో చాలా మందికి తెలియదు. దానికి కూడా కరణం లేక పోలేదు. మనలో చాలా మంది శ్రీమత్ భగవత్ గీత జీవితంలో ఒక్క సారి కూడా చదవక పోవటమే.
శ్రీమత్ భగవత్ గీత లో కృష్ణ భగవానుడు 16 అధ్యాయంలో దివాత్వాన్ని గూర్చి అసురత్వాన్ని గూర్చి నిశితంగా విశదీకరించారు. ఏ మానవుడు శ్రీమత్ భగవత్ గీత చదువుతాడో అతను తప్పక జీవితంలో ఒక క్రమశిక్షణా పరుడు దేముడి మీద ఒక స్థిర భావం కలిగిన వాడు అవుతాడు. అతను తప్పక మన ముందు కనిపించే ఇతర మనుషులను దేముడిగా అంగీకరించాడు. గీతా జ్ఞానం సంపూర్ణంగా అలవవరచుకున్న మానవుడు సాక్షాత్తు తానే భగవంతుడు అవుతాడు అందుకు సందేహం లేశమంతయినా లేదు.
ఇప్పటి కాల పరిస్థితుల్లో ప్రతి మనిషికి శ్రీమత్ భగవత్ గీత చదివే ఒక మంచి అలవాటుని చేయాలి. ఏ ఆహరం భుజించే వాడు ఎలా ఉంటాడు, ఎలా ప్రవర్తిస్తాడు, త్రిగుణాలు ఏమిటి అందులో సత్వ గుణం ఎలా గొప్పది, సత్వ గుణ వంతుడు యెట్లా ప్రవర్తిస్తాడు, రోజా గుణవంతుడు యెట్లా ప్రవర్తిస్తాడు, తమోగుణవంతుడి నడవడి యెట్లా ఉంటుంది లాంటి అనేక విషయాలు ప్రతి మనిషి శ్రీమత్ భగవత్ గీత వల్ల మాత్రమే తెలుసుకోగలరు.
ఒక్క మాటలో చెప్పాలంటే శ్రీమత్ భగవత్ గీత మానవాళికి అందించిన ఒక మహా వరం
మీరు, రామాయణ, మహా భారతాదులు వేదాలు, అష్టా దశ పురాణాలు చదవక పోయిన ఏమి నష్టం లేదు వాటి వల్ల మనకు జ్ఞానం వస్తే రావచ్చు కానీ ఒక్క శ్రీమత్ భగవత్ గీత చదివితే మీకు మంచి నడవడిక వస్తుంది. ఇప్పుడు సమాజంలో లోపిస్తుంది వినయము విధేయత, గౌరవము, మర్యాద. అదే గీత చదివి ఆకళింపు చేసుకునే వాడి వల్ల ఈ సమాజం ఉద్దరించ బడుతుంది. ఏది సత్యం ఏది అసత్యం అనే జ్ఞానం కలుగుతుంది. కాబట్టి మిత్రులారా మీరంతా తప్పక గీతను ముందుగా చదవండి, చదివించండి. మారె ఇతర హిందూ గ్రంధాన్ని ఆయన గీత చదివిన తరువాత చదవండి. మన హిందూ వాగ్మయం చాలా ప్రశస్తమైనది ప్రతి గ్రంధం అపార జ్ఞానాన్ని మనకు ఇస్తుంది. మన వాగ్ముయం చదవటం కాదు దానిని గూర్చి తెలుసుకోవటానికి ఒక జీవిత కాలం సరిపోదు. అటువండి ఈ మహా వట వృక్షన్ని గడ్డి పరకకన్నా చిన్న గున్న మతాల వాళ్ళు విమర్శిస్తూ ఉంటే మనం చూస్తూ వున్నాము. యెందుకు మనకు మన ధర్మం మీద అవగాహన లేకపోవటం వల్ల శ్రీమత్ భగవత్ గీత గూర్చి ఏమాత్రం తెలియని మూర్ఖులు శ్రీకృష్ణ భగవానుని నీచంగా విమర్శిస్తూ ఉంటే మనం ఏమి చేయటంలేదు. ఎందుకు మనకు శ్రీమత్ భగవత్ గీత గూర్చి తెలియక పోవటం వల్ల. ఇలా వ్రాసుకుంటూ పోతే ఏమైనా వ్రాయవచ్చు. ఎంతయినా వ్రాయవచ్చు. మన ధర్మం అపారం, ఇది నిరంతరంగా సాగే ఒక ఝరి. అనంతమైనది.
ఓం తత్సత్
ఓం శాంతి శాంతి శాంతిః
సర్వే జన సుఖినో భవంతు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి