28, సెప్టెంబర్ 2024, శనివారం

సంస్కృత వాక్యాలు*

 🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*వాడుకలోని సంస్కృత వాక్యాలు*

      *వాటి పూర్తి శ్లోకాలు*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐              

  *విద్వాన్ సర్వత్ర పూజ్యతే*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*పూర్తి శ్లోకం :~*


*స్వగృహే పూజ్యతే మూర్ఖ*

*స్వగ్రామే పూజ్యతే ప్రభుః|*


*స్వదేశే పూజ్యతే రాజా*

*విద్వాన్ సర్వత్ర పూజ్యతే||*


*తాత్పర్యము:~*


*స్వగృహములోనే గౌరవమును పొందుతాడు మూర్ఖుడు. స్వగ్రామములోనే గౌరవింపబడతాడు గ్రామాధికారి. రాజు స్వదేశములోనే గౌరవింపబడుతాడు. విద్వాంసుడు సర్వత్రా గౌరవింపబడుతాడు.*


*మరో శ్లోకం :~*


*విద్వత్వం చ నృపత్వం చ*

*నైవ తుల్యం కదాచన|*


*స్వదేశే పూజ్యతే రాజా*

*విద్వాన్ సర్వత్ర పూజ్యతే||*


*భావము :~*


*విద్వత్తును అధికారమును పోల్చి చూడలేము. రాజు స్వదేశములోనే పూజింపబడుతాడు. విద్వాంసుడు అన్నిచోట్ల పూజింపబడుతాడు.*


*వ్యాఖ్య:~*


*విద్యావంతుడు కానప్పటికీ, తెలివితేటలు తక్కువ ఉన్నప్పటికీ తన స్వంత ఇంటిలో వ్యక్తి గౌరవింప బడతాడు, గత్యంతరము ఉండదు కావున. తన స్వగ్రామములో ఉండే అధికారిని కూడా అదే విధంగా గౌరవింపక తప్పదు ఎందుచేతనంటే అతనికి ఉన్న అధికారము చేత. అదే విధంగా రాజు గారిని, అనగా వర్తమాన ప్రపంచములో ఒక MLA ని, ఒక MP ని, ఒక మంత్రిని అతడు విద్యాధికుడు కానప్పటికీ, చాలా సందర్భాలలో కడు దుర్మార్గుడైనప్పటికీ అతనికి ఉన్న అసాధారణమైన పలుకుబడి, అధికార దర్పముచేత గౌరవింప బడతాడు, గత్యంతరము లేదు. అతడు మంచి వాడైనచో ప్రజలు అదృష్టవంతులౌతారు.*


*కానీ, విద్యాధికుడైన వ్యక్తిని, విద్వాంసుడైన వ్యక్తిని మాత్రం సమాజము ఎక్కడికి వెళ్ళిననూ గౌరవిస్తుంది, ఏ రకమైన అధికార డాంబికాలు లేనప్పటికీ. అది విద్య యొక్క ప్రాసస్థ్యము. ప్రజలలో విద్వాంసుని పట్ల ఉన్న గౌరవాదరణలు.*


*ప్రజలందరికీ మంచి సామాజిక విలువలనీ, కుటుంబ విలువలనీ, విద్యా విలువలనీ, సంస్కృతీ సాంప్రదాయాలనీ తెలియ పరుచుతూ మార్గదర్శకుడై, జన బాహుళ్యానికి దిశా నిర్దేశము చేసిన స్వామి వివేకానంద, స్వామి చిన్మయానంద , చేస్తున్న బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు, సామవేదం షణ్ముఖ శర్మ గారు, గరికపాటి నరసింహా రావు గారు, జగ్గి వాసుదేవ గారు వంటి వారు ఈ కోవకి చెందిన మంచి విద్వాంసులు గా ఉదాహరణగా చెప్పుకోవచ్చు.*


*శ్రీ గురుభ్యో నమః।*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*ఓం శాంతిః శాంతిః శాంతిః!*

*సర్వేజనా సుఖినోభవంతు!!*

*ఓం తత్సత్!!*


*సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు!!*

*ఓం నమః శివాయ!!!*

🛐🛐🛐🛐🛐🕉️🛐🛐🛐

*(సంకలనం భగవంతుని కృపతో మీ ఆత్రేయపురపు వెంకట రమణమూర్తి)*

🛐🛐🛐🛐🛐🛐🕉️🕉️🛐

కామెంట్‌లు లేవు: