శ్రీ.చిల్లర కృష్ణమూర్తి గారు వ్రాసిన
#శివామృతలహరి శతకంలోని ఒక పద్యం;
మ||
తురగం బెక్కినగాని భద్రగజ సందోహంబుపై నిచ్చలున్
ధరనూరేగినగాని రా
జసభలన్ దర్పాన సమ్మానముల్
వరుసం గాంచినగాని తావక పదాబ్జాతద్వయీ నిత్య సు
స్థిరసేవన్ ఘటియిల్లు తృప్తిగలదే శ్రీ సిద్ధలింగేశ్వరా!
భావం;
గుర్రాన్ని అధిరోహించినా గానీ, పట్టపు టేనుగుల సమూహంపై నిత్యమూ ప్రపంచమంతా ఊరేగుతున్నా గానీ, రాజ సభలలో దర్పంతో వరుసగా
ఘనమైన సన్మానాలు పొందుతున్నా గానీ,
నీయొక్క రెండు పాద పద్మముల వద్ద నిత్యము స్థిరముగా సేవచేసు కొనుట వల్ల లభించే సంతృప్తి దొరుకుతుందా స్వామీ! శ్రీ సిద్ధ లింగేశ్వరా!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి