1) *మాతృదేవోభవ , పితృదేవోభవ*
*అని చెప్పిన దేశం భారత దేశం.*
కానీ దానిని ఆచరించేది ఆస్ట్రేలియా.
( పిల్లలు తల్లిదండ్రులను గౌరవించడంలో మొదటి స్థానం అస్ట్రేలియాది)
2) *గురుదేవోభవ అని చెప్పినదేశం భారతదేశం.* కానీ దానిని ఆచరించేది చైనా. ( గురువులను గౌరవించడంలో చైనా మొదటి స్థానంలో ఉంది.)
3) *యత్ర నార్యంతు పూజ్యతే .... అని చెప్పిన దేశం భారతదేశం*. కానీ ఆచరించేది నార్వే. ( మహిళలకు భద్రత మరియు గౌరవం ఇవ్వడంలో నార్వేది మొదటిస్థానం)
4) *పెద్దలను, వృద్ధులను గౌరవించమని చెప్పిన దేశం భారత దేశం.* కానీ ఆచరించేది ఐస్ ల్యాండ్.
(మొదటి స్థానం ఐస్ ల్యాండ్ దే.)
5) *సత్యమేవజయతే అని చెప్పిన దేశం భారత్ దేశం.* కానీ దానిని ఆచరిస్తున్నది యూకే. (నిజాయితీ మొదటి స్థానం యునైటెడ్ కింగ్ డం దే.)
6) *కష్టేఫలి, కృషితో నాస్తి దుర్భిక్షం.. అని చెప్పిన దేశం భారత దేశం.* కానీ ఆచరిస్తున్నది దక్షిణ కొరియా.
( హార్డ్ వర్క్లో మొదటి స్థానం సౌత్ కొరియాదే)
7) *ప్రపంచానికి శాంతి సందేశం అందించిన దేశం భారతదేశం*. కానీ ఆచరిస్తున్నది నార్వే.( ప్రశాంతత లో మొదటి స్థానం నార్వే దే.)
8) *భగవద్గీత బోధించిన దేశం భారత దేశం*. కానీ ఆచరిస్తున్నది జపాన్ .
( కర్తవ్య నిర్వహణలో అంకితభావంలో మొదటి స్థానం జపాన్ దే)
9) *ఎన్నో నీతి నియమాలను నిర్దేశించిన దేశం భారత దేశం.* కానీ ఆచరిస్తున్నది సింగపూర్.( క్రమ శిక్షణలో మొదటి స్థానం సింగపూర్ దే)
10) *విద్యను, జ్ఞానాన్ని ప్రవచించిన దేశం భారత దేశం.* కానీ నిలబెట్టుకున్నది ఫిన్లాండ్. ( విద్య , విలువలు లో మొదటి స్థానం ఫిన్ ల్యాండ్ దే)
*చెప్పడం కాదు చేసి చూపిస్తేనే విలువుంటుందని లేకపోతె చెప్పేవి *శ్రీరంగనీతులు అవుతాయి*. పై విషయాలన్నింటిలో భారతదేశం యొక్క స్థానం అట్టడుగున ఉంది.
*మనదేశం మొదటి స్థానం లోకి వచ్ఛేరోజు వస్తుందని ఆశిద్దాం*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి