*దశిక రాము**
*దేవీ నవరాత్రులు ప్రారంభం*
ఈ అనంత ప్రకృతిని దానిలోని కోటాను కోట్ల జీవరాసులను శాంతి సౌభాగ్యాలతో భాసించటానికి కావాల్సిన శక్తి యుక్తులను దేవీ ఉపాసనద్వారా లభిస్తాయన్నసత్యం మనభారతీయ సంప్రదాయంలో విశ్లేషించబడెను. శరత్కాలంలో జరుగును కాన (శారదానవరాత్రులని) శరన్నవరాత్రులని దశ విధములైన పాపములను పోగొట్టు శక్తిగలవి, సాధకునకు దశ దిక్కుల యందు విజయమును చేకూర్చే దశ దినాత్మకముగా శక్తి పూజలు జరిగే పదిరోజుల పండుగను దసరాగా మన భారతావనిలో ప్రజల విశేష ఆదరాభిమానాలను చూరగున్న అతిపెద్దపండుగయే శ్రీదేవీశరన్నవరాత్రులు.
భక్తుల దుర్ "దశ" "దిశ" ను మార్చే శక్తిగల ఆదిశక్తి పూజలు జరిగే ఈ అత్యంతపవిత్రమైన దసరా పర్వదినముల వొచ్చే మందరే అమ్మవారిని ఎలా ఆరాధించి సేవించి తరించాలో మన మహర్షులు శృతి,స్మృతేతిహాస,పురాణాలలో ఏమి వివరించారో? వాటిని ఎలా అర్థం చేసుకొని మనపెద్దలు అనుష్ఠించారో? కొంచెం కొంచెంగానైనా తెల్సుకొని ఆచరించి "సంసారసముద్ధరణపండితయైన" శ్రీజగదంబ సంపూర్ణఅనుగ్రహం పొంది తరించటానికి ప్రయత్నిద్దామా?
**దేవీ నవరాత్రుల ప్రాశస్త్యం ఏమిటి** ?
అమ్మవారికి తొమ్మిది రోజులు తొమ్మిది రూపాలలో ఎందుకు కొలుస్తారు. నవరాత్రుల వెనుక అసలు చరిత్ర ఏంటి ?
దేవీ నవరాత్రులుప్రతీ సంవత్సరం ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి మొదలు నవమి వరకు దేవీ నవరాత్రులు లేదా శరన్నవరాత్రులని అంటారు. శరన్నవరాత్రులు అని ఎందుకన్నారంటే ఆశ్వీయుజ మాసం నుండి వర్ష ఋతువు వెళ్ళి, శరత్ ఋతువు ప్రారంభం అవుతుంది. ఈ ఋతువులో వర్షాకాలం ముగిసి చలికాలం మొదలవుతుంది. ఈ సమయంలో వాతావరణంలో కలిగే మార్పులు అనేక రోగాలకు కారణమవుతాయి. అందుకే ఈ అశ్వయుజ శుద్ధ పాడ్యమినుండి నవమి వరకు శక్తి ఆరాధన పేరుతో ప్రజలంతా శుచిగా, శుభ్రంగా ఉండి ఎలాంటి రోగాల దరిజేరవన్నది ఈ నవరాత్రి వేడుకల వెనుక ఉన్న చరిత్ర. మార్కండేయ మహర్షి అమ్మవారిని ఎలా ఆరాధించాలి అని అడగడంతో బ్రహ్మ ఇలా వివరించాడట.
ప్రధమంశైలపుత్రిణి, ద్వితీయం బ్రహ్మచారిణి
తృతీయం చంద్రఘంటేతి, కూష్మాంతేతి చతుర్ధామ్||
పంచమం స్కంధమాతేతి షష్ఠమం కాత్యాయనీ తిచ
సప్తమం కాళరాత్రంచ, మహాగౌరేతి చాష్టమం
నవమం సిద్ధితి ప్రోక్త, నవదుర్గ ప్రకీర్తిత||
1 శైలపుత్రి : దుర్గాశరన్నవరాత్రుల్లో పాడ్యమి నాడు ప్రారంభమయ్యే అవతారం శైలపుత్రి. దక్షుని ప్రథమ పుత్రిక. శిరస్సున అలంకారంగా బాల చంద్రరేఖను ధరించి ప్రతిశూలాన్నీ చేత బట్టి ఎద్దు వాహనంపై కూర్చునే అవతారమే శైలపుత్రి. పరమేశ్వరుడే తనకు పతికావాలని కోరుతుంది. ఆమె కోరిక ప్రకారం హిమవంతునికి పుత్రికగా జన్మిం చింది. ఆమె వాహనం ఎద్దు. ఎద్దులా మొద్దు స్వరూపాలై పోకుండా మానవుల్లో చురుకుదనాన్ని కల్గించడానికి సంకేతం శైలపుత్రి. ఈ రోజు అమ్మవారికి పొంగలి నైవేద్యం పెట్టి అర్చిస్తే అభీష్ట సిద్ధి కలుగుతుంది.
2. బ్రహ్మచారిణి : దుర్గామాత రెండవ అవతారం బ్రహ్మచారిణి. పరమేశ్వరుని భర్తగా పొందడానికి నారదుడి ఉపదేశానుసారం ఘోరతపస్సు చేస్తుంది. ఆకులు కూడా తినకుండా ఉన్నందున అపర్ణగా ప్రసిద్ధి. పరమేశ్వరుని భర్తగా పొందే వరకు ఈమె బ్రహ్మచారిణి. ఆమెకే కన్యాకుమారి అనే మరోపేరుంది. ఈ మాతను ఉపాసించే వారికి సర్వత్రాసిద్ధి విజయాలు ప్రాప్తిస్తాయి.
3. చంద్రఘంట : అమ్మవారి మూడవ అవతారం చంద్రఘంట ఈ రూపం మిక్కిలి కళ్యాణ కారకం. శిరస్సుపై ధరించిన అర్థచంద్రుడు అర్ధాకృతలో ఉండటం వల్ల ఆమెకు చంద్రఘంట అని పేరు వచ్చింది. ఈ తల్లిని శరణుజొచ్చినవారికి ఎల్లప్పుడూ అభయఘంట మోగుతూ ఉంటుంది.
4. కూష్మాండ: నాలుగవ స్వరూప నామం కూష్మాండ. అంటే బూడిద గుమ్మడికాయ ఈమె తేజోమయి. ఎనిమిది భుజాలతో విరాజిల్లుతుండటం వల్ల ఈమెను ‘అష్టభుజదేవి’ అని కూడా అంటారు.
5. స్కందమాత : అయిదో అవతారం స్కందమాత స్కంధుడు అనగా కుమార స్వామి. స్కందుని తల్లి అయినందున ఈమెను స్కందమాత అని పిలుస్తారు. ఈ తల్లి వాహనం కమలాసనంపై పద్మాసనంగా శ్వేతపద్మంతో శోభిల్లుతుంది. తనను నమ్మిన భక్తులకు పతనం లేకుండా ఆ అమ్మ ఉద్ధరిస్తుందునటానికి సంకేతమే ఇది.
6. కాత్యాయని : దుర్గామాత ఆరో రూపం కాత్యాయని. ‘కొత్స’ అనే రుషి తనకు పార్వతీమాత కుమర్తెగా జన్మించాలని తపస్సు చేశాడు. అతనికి కూతురుగా జన్మించింది. కనుకనే కాత్యాయని అనే పేరు వచ్చింది. మహిషాసురుణ్ని వధించడానికి బ్రహ్మవిష్ణు మహేశ్వరులు తమ తేజస్సుల అశంతో ఒక దేవిని సృష్టిస్తారు. మొట్టమొదట ఈ కాత్యాయనిని మహర్షి పూజిస్తారు. ఈమె ఆశ్వయుజ శుక్లసప్తమి, అష్టమి, నవమి తిథుల్లో పూజలందుకుని విజయదశమినాడు మహిషాసురుణ్ని వధిస్తుంది.
7. కాళరాత్రి : దుర్గామాత ఏడో రూపం కాళరాత్రి. ఈమె శరీరం ఛాయ చీకటివలె నల్లగా ఉంటుంది. ఇందుకే ఈదేవికి కాళరాత్రి అని పేరు. ఈమె వాహనం గాడిద. ఈ తల్లి ఎప్పుడూ శుభ ఫలితాలను ఇస్తుంది. అందువలన ఈమెను శుభంకరి అని కూడా పిలుస్తారు.
8. మహాగౌరి : ఈమె పరమేశ్వరుడిని భర్తగా పొందటానికి కఠోర తపస్సు చేస్తుంది. దీని కారణంగా ఈమె దేహం నల్లబడుతుంది. ఆమె తపస్సుకుమెచ్చి ఆమె శరీరాన్ని గంగాజలంతో ప్రక్షాళనం చేస్తారు. దాని వలన ఆమె శరీరం గౌరవర్ణతో విద్యుత్తు కాంతులను వెదజల్లుతూ ఉంటుంది. అప్పటి నుంచి ఆమె మహాగౌరిగా ప్రసిద్ధి కెక్కింది.
9. సిద్ధిధాత్రి : దుర్గామాత తొమ్మిదవ శక్తి రూపం సిద్ధిధాత్రి. ఈమె అన్ని సిద్ధులనూ ప్రసాది స్తుంది. పరమేశ్వరుడు సర్వ సిద్ధులను ఈదేవీ కృపతో పొందాడని దేవీ పురాణాలు చెబుతున్నాయి.
నవరాత్రులు
1వ రోజు -ఆశ్వయుజ పాడ్యమి - శ్రీ స్వర్ణ కవచాలంక్రుత దుర్గా దేవి
2వ రోజు - ఆశ్వయుజ విదియ - శ్రీ బాలా త్రిపురసుందరీదేవి
3వ రోజు - ఆశ్వయుజ తదియ - శ్రీ గాయత్రి దేవి
4వ రోజు - ఆశ్వయుజ చవితి - శ్రీ అన్నపూర్ణా దేవి
5వ రోజు - ఆశ్వయుజ పంచమి - శ్రీ లలితా త్రిపురసుందరీ దేవి - లలిత పంచమి
6వ రోజు - ఆశ్వయుజ షష్టి - శ్రీ మహా లక్ష్మీ దేవి - మహాషష్టి
7వ రోజు - ఆశ్వయుజ సప్తమి - శ్రీ మహా సరస్వతీ దేవి - మహా సప్తమి
8వ రోజు - ఆశ్వయుజ అష్టమి - శ్రీ దుర్గా దేవి - దుర్గాష్టమి
9వ రోజు - ఆశ్వయుజ మహానవమి - శ్రీ మహిషాసురమర్దిని - మహార్ణవమి
10వ రోజు - ఆశ్వయుజ దశమి
- శ్రీ రాజరాజేశ్వరి - విజయదశమి
ఆశ్వయుజ మాసంలో శుద్ధ పాడ్యమిలో నవరాత్రుల కలశ స్థాపన చేయాలి. ఇది తొమ్మిది రోజులు చేసే పూజా కార్యక్రమం. అందుకనే 'దేవీనవరాత్రులు ' అని పిలవ బడుచున్నవి. పూజా మందిరంలో కలశ స్థాపన చేయుటకు వేదికను తయారు చేసుకోవాలి. గోమయంతో(ఆవు పేడతో) నలుచదరంలా అలికి, పసుపు కుంకుమలతో అలంకరించాలి. పూజాసామాగ్రితో పాటు పంచపల్లవాలు అనగా (ఐదు రకాల లేత చిగుళ్ళు కల్గిన చెట్టుకొమ్మలు) దూర్వాంకురములు (గరిక పోచలు) తయారుగా ఉంచుకోవాలి.
పూజా విధానము: ఆ తరువాత తెల్లవారుఝామునే లేచి అభ్యంగన స్నానం (తలస్నానం) చేసి, నామం ధరించి, పట్టు వస్త్రములు కట్టుకొని, చేతికి పవిత్రం ధరించి పూజకు ఏర్పాటు చేసిన వేదిక వద్ద ఆసనంపై జింక చర్మం లేదా వ్యాఘ్రచర్మము లేదా తెల్లని పట్టుబట్ట గాని ఎర్రని పట్టు పంచ గాని, ఆసనం పైన వేసి, లేని వారు (పీట మీద) తూర్పు ముఖంగాని, ఉత్తర ముఖం గాని కూర్చుండ వలెను.
ముమ్మారు ఆచమనం చేసి ఓంకారంతో గురువునూ, పరమాత్మను ప్రార్థించి, పది నిమషములు ధ్యానించి, గాయత్రి మంత్రం జపించిన తరువాత మహా సంకల్పం చెప్పవలెను. గృహస్తులైనవారు సతీ సమేతంగా సంకల్పము చేయవలెను.
ముందుగా విఘ్నేశ్వర పూజ జరిపి స్వస్తిపుణ్యాహమలు చెప్పవలెను. ఆతరువాత బ్రాహ్మణులకు వరణనిచ్చి తొమ్మిది రోజులు (నవ రాత్రి) గాని లేదా ఏడు రోజులు గాని హీన పక్షం మూడు రోజులు కాని లేదా ఒక్క రాత్రి దీక్షగాని శ్క్యానుసారము దీక్ష చేయవలెను. పూజాకాలములో రోజుకొకసారి భుజించి ఏకభుక్త వ్రతము చేయవలెను. తొమ్మిది రోజుల పూజ అయ్యేవరకూ, అఖండ దీపారాదన రాత్రింబగళ్ళు వెలుగవలెను.
ఆయుధ పూజ: పూర్వము పాండవులు సమి వృక్షమి పైన తమ ఆయుధములను దాచి, అగ్నాతవాసము చేసినారు. వర్రి అజ్ఞాతవాసము అర్జునుడు సమి వృక్షము పైనుండు తన గాండీవమును దించి కౌరవులతో యుధము చేయటముతో ముగిసినది.విజయదశమి నాడు వారి అజ్ఞాత వాసము యొక్క గడువుముగిసినది. కనుక ఆయుధ పూజ రోజున శమీ వృక్షానికి ఒక ప్రత్యేకత ఏర్పడింది.రాజులకు ఈ నవమి నాడు తమ ఆయుధములను పూజించు పద్ధతియే నేటికీ ఆయుధ పూజగా చేయబడుతున్నది. ఆ ఆయుధములతో పాటు ఛత్రచామరములు రాజలాంఛనములు తానెక్కిన వాహనములు గజము, అశ్వము వాహనములను లేదా తాను పని చేయు యంత్రములను పూజించవలెను.
అపరాజితా శమీపూజ: శమీ శమతే పాపం శమీ శతృ వినాశనం
అని మంత్రంతో శమీ(జమ్మి) వృక్షమును పూజించ వలెను. అపరాజితాదేవిని పూజించి ఊరుపొలిమేరను దాటి సీమోంల్లంఘనము చేయవలెను. గ్రామమునకు ఈశాన్యంగా చేసి, అపరాజితా దేవిని ఈ విధముగ పూజించాలి
దుర్గా శరన్నవరాత్రి పూజా విధానం పది రోజులు చెయ్యవలసిన పూజ.
ప్రతి రోజు అలంకారములను బట్టి ఆ దేవికి ప్రత్యేకముగా ఆష్ట్తోరము చదివి పూజ చేయవలెను.
దుర్గాదేవీ పూజా విధానం:
శుక్లామ్బరధరమ్ విష్ణుమ్ శశి వర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయెత్ సర్వ విఘ్నోప శాంతాయే
దీపత్వమ్ బ్రహ్మ రూపేసి జ్యోతిషాం ప్రభురవనయహ్
సౌభాగ్యం దేహి పుత్రాన్స్‌చ సర్వాన్ కామాన్‌శ్చ దేహిమ్
దీపమును వెలిగించి దీపపు కున్దిని కుంకుమ అక్షంతాలతో అలంకరీంపవలెను
శ్లో : అగమార్ధం తు దేవానాం గమనార్ధం తు రక్షసాం
కురుఘంటారవం తత్ర దేవతాహ్వాన లాంఛనమ్
(గంటను మ్రోగించవలెను)
ఆచమనం
ఓం కేశవాయ స్వాహా, ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా
(అని మూడుసార్లు ఆచమనం చేయాలి)
ఓం గోవిందాయ నమః,విష్ణవే నమః,
మధుసూదనాయ నమః,త్రివిక్రమాయ నమః,
వామనాయ నమః,శ్రీధరాయ నమః,
ఋషీకేశాయ నమః, పద్మనాభాయ నమః,
దామోదరాయ నమః, సంకర్షణాయ నమః,
వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః,
అనిరుద్దాయ నమః, పురుషోత్తమాయ నమః,
అధోక్షజాయ నమః, నారసింహాయ నమః,
అచ్యుతాయ నమః, జనార్ధనాయ నమః,
ఉపేంద్రాయ నమః, హరయే నమః,
శ్రీ కృష్ణాయ నమః
ఉత్తిష్ఠంతు భూతపిశాచా ఏతే భూమిభారకాః
ఏతేషా మవిరోధేనా బ్రహ్మకర్మ సమారభే ||
(ప్రాణాయామం చేసి అక్షతలు వెనుకకు వేసుకొనవలెను.)
ప్రాణాయామము
(కుడిచేతితో ముక్కుపట్టుకొని యీ మంత్రమును ముమ్మారు చెప్పవలెను)
ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ ఓం అపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్బువస్సువరోమ్
సంకల్పం:
ఓం మమోపాత్త దురితక్షయద్వారా శ్రీ దుర్గాంభికాదేవి ప్రీత్యర్ధం శుభే శోభ్నే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞాయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే, భరతఖండే మేరోర్ధక్షిణదిగ్భాగే, శ్రీశైలశ్య ఈశాన్య (మీరు ఉన్న దిక్కును చెప్పండి) ప్రదేశే కృష్ణ/గంగా/గోదావర్యోర్మద్యదేశే (మీరు ఉన్న ఊరికి ఉత్తర దక్షినములలొ ఉన్న నదుల పేర్లు చెప్పండి) అస్మిన్ వర్తమాన వ్యావహారిక చంద్రమాన (ప్రస్తుత సంవత్సరం) సంవత్సరే (ఉత్తర/దక్షిన) ఆయనే (ప్రస్తుత ఋతువు) ఋతౌ (ప్రస్తుత మాసము) మాసే (ప్రస్తుత పక్షము) పక్షే (ఈరోజు తిథి) తిథౌ (ఈరోజు వారము) వాసరే (ఈరోజు నక్షత్రము) శుభనక్షత్రే (ప్రస్తుత యోగము) శుభయోగే, శుభకరణే. ఏవంగుణ విశేషణ విషిష్ఠాయాం, శుభతిథౌ,శ్రీమాన్ (మీ గొత్రము) గోత్రస్య (మీ పూర్తి పేరు) నామధేయస్య ధర్మపత్నీ సమేతస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య దైర్య విజయ అభయ,ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్యర్థం ధర్మార్దకామమోక్ష చతుర్విధ ఫలపురుషార్ధ సిద్ద్యర్థం ధన,కనక,వస్తు వాహనాది సమృద్ద్యర్థం పుత్రపౌత్రాభి వృద్ద్యర్ధం,సర్వాపదా నివారణార్ధం,సకలకార్యవిఘ్ననివారణార్ధం,సత్సంతాన సిద్యర్ధం,పుత్రపుత్రికా నాంసర్వతో ముఖాభివృద్యర్దం,ఇష్టకామ్యార్ధ సిద్ధ్యర్ధం,సర్వదేవతా స్వరూపిణీ శ్రీ దుర్గాంబికా ప్రీత్యర్ధం యావద్బక్తి ద్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే.
(అక్షతలు నీళ్ళతో పళ్ళెములో వదలవలెను.)
తదంగత్వేన కలశారాధనం కరిష్యే
కలశారాధనం:
శ్లో : కలశస్యముఖే విష్ణుః కంఠేరుద్ర స్సమాశ్రితః
మూలే తత్రోస్థితోబ్రహ్మా మధ్యేమాతృగణా స్మృతాః
కుక్షౌ తు సాగరా స్సర్వే సప్తద్వీపా వసుందరా
ఋగ్వేదోథ యజుర్వేద స్సామవేదోహ్యథర్వణః
అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః
(కలశపాత్రకు గంధము,కుంకుమబొట్లు పెట్టి పుష్పాక్షతలతో అలంకరింపవలెను.కలశపాత్రపై కుడిఅరచేయినుంచి ఈ క్రిందిమంత్రము చదువవలెను.)
శ్లో : గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు
ఆయాంతు దేవపూజార్థం – మమ దురితక్షయకారకాః
కలశోదకేన పూజాద్రవ్యాణి దైవమాత్మానంచ సంప్రోక్ష్య
(కలశములోని జలమును పుష్పముతో దేవునిపైనా పూజాద్రవ్యములపైన,తమపైన జల్లుకొనవలెను.తదుపరి పసుపు వినాయకునిపై జలము జల్లుచు ఈ క్రింది మంత్రము చదువవలెను.)
మం : ఓం గణానాంత్వ గణపతిగ్ హవామహే కవింకవీనాముపమశ్రస్తవం
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత అనశ్శృణ్వన్నూతిభి స్సీదసాదనమ్
శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి,ఆవాహయామి,నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతి మీద అక్షతలు, గంధం పువ్వులు వేయవలెను .
ఓం సుముఖాయ నమః,ఏకదంతాయ నమః,కపిలాయ నమః,గజకర్ణికాయ నమః,లంబోదరాయ నమః,వికటాయ నమః,విఘ్నరాజాయ నమః,గణాదిపాయ నమః,ధూమకేతవే నమః,గణాధ్యక్షాయ నమః,ఫాలచంద్రాయ నమః,గజాననాయ నమః,వక్రతుండాయనమః,శూర్పకర్ణాయ నమః,హేరంబాయ నమః,స్కందపూర్వజాయ నమః,ఒం సర్వసిద్ది ప్రదాయకాయ నమః,మహాగణాదిపతియే నమః నానావిధ పరిమళ పత్ర పుష్పపూజాంసమ్ర్పయామి. మహాగణాదిపత్యేనమః ధూపమాఘ్రాపయామి.
ఓం భూర్బువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్
సత్యంత్వర్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి శ్రీ మహాగణాధిపతయే నమః గుడోపహారం నివేదయామి.
శ్రీ మహాగణాధిపతి బెల్లము లేదా పండ్లు గానీ ప్రసాదముగ నివేదించాలి. కర్పూర నీరాజనం దర్శయామి. (కర్పూరమును వెలిగించి చూపవలెను).
శ్రీ దుర్గా దేవియే నమః ధ్యాయామి,ఆవాహయామి,నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి.
శ్రీ దుర్గా దేవి యే నమః పాదయోః పాద్యం సమర్పయామి (నీళ్ళు చల్లవలెను)
శ్రీ దుర్గా దేవి యే నమః హస్తయోః ఆర్ఘ్యం సమర్పయామి (నీళ్ళు చల్లవలెను)
ముఖే శుద్దాచమనీయం సమర్పయామి శుద్దోదకస్నానం సమర్పయామి (నీళ్ళు చల్లవలెను)
శ్రీ దుర్గా దేవియే నమః వస్త్రయుగ్మం సమర్పయామి (అక్షతలు చల్లవలెను)
శ్రీ దుర్గా దేవి యే నమః దివ్య శ్రీ చందనం సమర్పయామి (గంధం చల్లవలెను)
శ్రీ దుర్గా దేవియే నమః అక్షతాన్ సమర్పయామి (అక్షతలు చల్లవలెను)
అధాంగ పూజ :
ఓం దుర్గాయై నమః పాదౌ పూజయామి
ఓం గిరిజాయై నమః గుల్ఫౌ పూజయామి
ఓం అపర్ణాయై నమః జానునీ పూజయామి
ఓం హరిప్రియాయై నమః ఊరూ పూజయామి
ఓం పార్వత్యై నమః కటిం పూజయామి
ఓం ఆర్యాయై నమః నాభిం పూజయామి
ఓం జగన్మాత్రే నమః ఉదరం పూజయామి
ఓం మంగళాయై నమః కుక్షిం పూజయామి
ఓం శివాయై నమః హృదయం పూజయామి
ఓం మహేశ్వర్యై నమః కంఠం పూజయామి
ఓం విశ్వవంద్యాయై నమః స్కంధౌ పూజయామి
ఓం కాళ్యై నమః బాహూ పూజయామి
ఓం ఆద్యాయై నమః హస్తౌ పూజయామి
ఓం వరదాయై నమః ముఖం పూజయామి
ఓం సువణ్యై నమః నాసికం పూజయామి
ఓం కమలాక్ష్యై నమః నేత్రే పూజయామి
ఓం అంబికాయై నమః శిరః పూజయామి
ఓం దేవ్యై నమః సర్వాణ్యం పూజయామి
శ్రీ దుర్గాష్టోత్తర శతనామ పూజ:
అక్షతలు ,పుష్పములతో పూజ చెయ్యండి
ఓం దుర్గాయై నమ:
ఓం శివాయై నమ:
ఓం మహాలక్ష్మ్యై నమ:
ఓం మహా గౌర్యై నమ:
ఓం చండికాయై నమ:
ఓం సర్వజ్జాయై నమ:
ఓం సర్వలోకోశ్యై నమ:
ఓం సర్వ కర్మ ఫల ప్రదాయై నమ:
ఓం సర్వ తీర్థమయాయై నమ:
ఓం పుణ్యాయైనమ:
ఓం దేవయోనయే నమ:
ఓం అయోనిజాయై నమ:
ఓం భూమిజాయై నమ:
ఓం నిర్గుణాయై నమ:
ఓం ఆధార శక్త్యై నమ:
ఓం అనీశ్వర్యై నమ:
ఓం నిర్గుణాయై నమ:
ఓం నిరహంకారాయై నమ:
ఓం సర్వ గర్వ విమర్దిన్యై నమ:
ఓం సర్వలోక ప్రియాయై నమ:
ఓం వాణ్యై నమ:
ఓం సర్వ విద్యాధిదేవతాయై నమ:
ఓం పార్వత్యై నమ:
ఓం దేవమాత్రే నమ:
ఓం వనీశ్యై నమ:
ఓం వింద్య వాసిన్యై నమ:
ఓం తేజోవత్యై నమ:
ఓం మాహా మాత్రే నమ:
ఓం కోటి సూర్య సమ ప్రభాయై నమ:
ఓం దేవతాయై నమ:
ఓం వహ్ని రూపాయై నమ:
ఓం సతేజసే నమ:
ఓం వర్ణ రూపిణ్యై నమ:
ఓం గణాశ్రయాయై నమ:
ఓం గుణమద్యాయై నమ:
ఓం గుణ త్రయ వివర్జితాయై నమ:
ఓం కర్మజ్జాన ప్రదాయై నమ:
ఓం కాంతాయై నమ:
ఓం సర్వ సంహార కారిణ్యై నమ:
ఓం ధర్మజ్జానాయై నమ:
ఓం ధర్మ నిష్ఠాయై నమ:
ఓం సర్వ కర్మ వివర్జితాయై నమ:
ఓం కామాక్ష్యై నమ:
ఓం కామ సంహత్ర్యై నమ:
ఓం కామ క్రోధ వివర్జితాయై నమ:
ఓం శాంకర్యై నమ:
ఓం శాంభవ్యై నమ:
ఓం శాంతాయై నమ:
ఓం చంద్ర సూర్య లోచనాయై నమ:
ఓం సుజయాయై నమ:
ఓం జయాయై నమ:
ఓం భూమిష్థాయై నమ:
ఓం జాహ్నవ్యై నమ:
ఓం జన పూజితాయై నమ:
ఓం శాస్త్ర్ర్రాయై నమ:
ఓం శాస్త్ర మయాయై నమ:
ఓం నిత్యాయై నమ:
ఓం శుభాయై నమ:
ఓం శుభ ప్రధాయై
ఓం చంద్రార్ధ మస్తకాయై నమ:
ఓం భారత్యై నమ:
ఓం భ్రామర్యై నమ:
ఓం కల్పాయై నమ:
ఓం కరాళ్యై నమ:
ఓం కృష్ఠ పింగళాయై నమ:
ఓం బ్రాహ్మే నమ:
ఓం నారాయణ్యై నమ:
ఓం రౌద్ర్ర్యై నమ:
ఓం చంద్రామృత పరివృతాయై నమ:
ఓం జేష్ఠాయై నమ:
ఓం ఇందిరాయై నమ:
ఓం మహా మాయాయై నమ:
ఓం జగత్వృష్థాధి కారిణ్యై నమ:
ఓం బ్రహ్మాండ కోటి సంస్థానాయై నమ:
ఓం కామిన్యై నమ:
ఓం కమలాయై నమ:
ఓం కాత్యాయన్యై నమ:
ఓం కలాతీతాయై నమ:
ఓం కాల సంహార కారిణ్యై నమ:
ఓం యోగ నిష్ఠాయై నమ:
ఓం యోగి గమ్యాయై నమ:
ఓం తపస్విన్యై నమ:
ఓం జ్జాన రూపాయై నమ:
ఓం నిరాకారాయై నమ:
ఓం భక్తాభీష్ఠ ఫల ప్రదాయై నమ:
ఓం భూతాత్మికాయై నమ:
ఓం భూత మాత్రే నమ:
ఓం భూతేశాయై నమ:
ఓం భూత ధారిణ్యై నమ:
ఓం స్వదానారీ మద్యగతాయై నమ:
ఓం షడాధారాది వర్ధిన్యై నమ:
ఓం మోహితాయై నమ:
ఓం శుభ్రాయై నమ:
ఓం సూక్ష్మాయై నమ:
ఓం మాత్రాయై నమ:
ఓం నిరాలసాయై నమ:
ఓం నిమగ్నాయై నమ:
ఓం నీల సంకాశాయై నమ:
ఓం నిత్యానందాయై నమ:
ఓం హరాయై నమ:
ఓం పరాయై నమ:
ఓం సర్వ జ్జాన ప్రదాయై నమ:
ఓం ఆనందాయై నమ:
ఓం సత్యాయై నమ:
ఓం దుర్లభ రూపిణ్యై నమ:
ఓం సరస్వత్యై నమ:
ఓం సర్వ గతాయై నమ:
ఓం సర్వాభీష్ఠ ప్రదాయిన్యై నమ:
గమనిక: తదుపరి ఇక్కడ ఏ రోజు ఏ దేవి అలంకారిన్ని, అవతారాన్ని పూజిస్తారో ఆరోజు ఆ దేవి అష్టోత్తరము చదువవలెను.
బెజవాడ కనక దుర్గ అలంకారములు:
మొదటి రోజు: శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గా దేవి
- రెండొవ రోజు: శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి
- మూడొవ రోజు: శ్రీ గాయత్రీ దేవి
- నాల్గొవ రోజు: శ్రీ అన్నపూర్ణా దేవి
- ఐదొవ రోజు: శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి
- ఆరొవ రోజు: శ్రీ మహాలక్ష్మీ దేవి
- ఏడొవ రోజు: శ్రీ సరస్వతీ దేవి
- ఎనిమిదొవ రోజు: శ్రీ దుర్గా దేవి ( దుర్గాష్టమి )
- తొమ్మిదొవ రోజు: శ్రీ మహిషాసుర మర్దినీ దేవి ( మహర్నవమి )
- పదొవ రోజు: శ్రీ రాజ రాజేశ్వరీ దేవి ( విజయదశమి )
తిథి నక్షత్రములను బట్టి అలంకారములు మారవచ్చును
ఓం భూర్బువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్
సత్యంత్వర్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి శ్రీ దుర్గా దేవి యే నమః (ప్రసాదం నివేదయామి).
ఓం ప్రాణాయస్వాహా, ఓమ్ అపానాయస్వాహా, ఓంవ్యానాయ స్వాహా
ఓమ్ ఉదానాయ స్వాహా ఓం సమానాయ స్వాహా మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. (నీరు వదలాలి.)
తాంబూలం సమర్పయామి నీరాజనం దర్శయామి. (తాంబూలము నిచ్చి కర్పూరమును వెలిగించి చూపవలెను)
శ్రీ దుర్గా దేవి యే నమః సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి
ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి
అనయా మయా కృత యధాశక్తి పూజాయచ శ్రీ దుర్గా దేవి సుప్రీతః సుప్రసన్నో వరదో భవతు
(అనుకొని నమస్కరించుకొనిదేవుని వద్దగల అక్షతలు ,పుష్పములు శిరస్సున ధరించవలసినది.)
శ్రీ దుర్గా దేవి పూజ సమాప్తం.
🌹శ్రీ మాత్రే నమః🌹
🙏**
*దేవీ నవరాత్రులు**
1వ రోజు :
స్వర్ణ కవచాలంకృత శ్రీ కనకదుర్గాదేవి.
శరన్నవరాత్రులలోని మొదటి రోజు దేవిని పసుపు రంగు దుస్తులతో అలంకరిస్తారు. నవరాత్రి అలంకారాలలో తొలి రోజునే కనకదుర్గా దేవిని దర్శించుకున్నవారికి దారిద్ర్య బాధలు మటుమాయము అవుతాయని భక్తుల నమ్మకము.
అమ్మలఁ గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పె
ద్దమ్మ సురారులమ్మ కడు పాఱడిపుచ్చి నయమ్మ తన్ను లో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గ మా
యమ్మ కృపాబ్ధి యీపుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్.
అశ్వనీ నక్షత్రంతో కూడిన పౌర్ణమి కల మాసం ఆశ్వీయుజ మాసం, శరదృతువు ఈ నెలతో ప్రారంభం అవుతుంది. ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి మొదలు దశమి వరకు ఈ దసరా ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలు దేశమంతటా భిన్నభిన్న పద్ధతుల్లో జరుగుతాయి. తొమ్మిది రోజులు తొమ్మిది అలంకారాలలో దేవిని పూజిస్తారు. అందువల్ల ఇది దేవీ నవరాత్రులుగా వ్యవహారంలోకి వచ్చింది. అలాగే శరదృతువులో జరుపుకుంటారు కనుక శరన్నవరాత్రులని కూడా అంటారు. ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి శరన్నవరాత్రి ఉత్సవాలలో మొదటి రోజు దుర్గమ్మ స్వర్ణ కవచలంకృత దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. శరన్నవరాత్రి ఉత్సవాలలో మొదటి రోజు అమ్మవారికి కేసరి నైవేద్యం చెయ్యాలి.
విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగలలో దేవీ నవరాత్రులు అత్యంత ప్రధానమైనవి. శరదృతువులో ఆశ్వియుజ శుధ్ధ పాడ్యమి నుండి నవమి వరకు ఈ వేడుకలు జరుగుతాయి. దేవి అంటే త్రిమూర్తుల తేజం కలగలిసిన మహాశక్తి. విజయవాడ కనకదుర్గ అలంకారాలే రాష్ట్రములోని మిగతా ప్రాంతాలలో కూడా అనుసరిస్తారు.
ఎన్ని కథలున్నా కనకదుర్గగా ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దేవికి శరన్నవరాత్రుల పేరిట దసరా తొమ్మిది రోజులు ఉత్సవములు నిర్వహించడము అనాదిగా వస్తున్న ఆచారము. ఈ తొమ్మిది రోజులు దేవి ఒక్కో అలంకారముతో భక్తులకు దర్శనమిస్తింది.
శ్రీ దుర్గాష్టోత్తర శతనామ పూజ
ఓం దుర్గాయై నమ:
ఓం శివాయై నమ:
ఓం మహాలక్ష్మ్యై నమ:
ఓం మహా గౌర్యై నమ:
ఓం చండికాయై నమ:
ఓం సర్వజ్జాయై నమ:
ఓం సర్వలోకోశ్యై నమ:
ఓం సర్వ కర్మ ఫల ప్రదాయై నమ:
ఓం సర్వ తీర్థమయాయై నమ:
ఓం పుణ్యాయైనమ:
ఓం దేవయోనయే నమ:
ఓం అయోనిజాయై నమ:
ఓం భూమిజాయై నమ:
ఓం నిర్గుణాయై నమ:
ఓం ఆధార శక్త్యై నమ:
ఓం అనీశ్వర్యై నమ:
ఓం నిర్గుణాయై నమ:
ఓం నిరహంకారాయై నమ:
ఓం సర్వ గర్వ విమర్దిన్యై నమ:
ఓం సర్వలోక ప్రియాయై నమ:
ఓం వాణ్యై నమ:
ఓం సర్వ విద్యాధిదేవతాయై నమ:
ఓం పార్వత్యై నమ:
ఓం దేవమాత్రే నమ:
ఓం వనీశ్యై నమ:
ఓం వింద్య వాసిన్యై నమ:
ఓం తేజోవత్యై నమ:
ఓం మాహా మాత్రే నమ:
ఓం కోటి సూర్య సమ ప్రభాయై నమ:
ఓం దేవతాయై నమ:
ఓం వహ్ని రూపాయై నమ:
ఓం సతేజసే నమ:
ఓం వర్ణ రూపిణ్యై నమ:
ఓం గణాశ్రయాయై నమ:
ఓం గుణమద్యాయై నమ:
ఓం గుణ త్రయ వివర్జితాయై నమ:
ఓం కర్మజ్జాన ప్రదాయై నమ:
ఓం కాంతాయై నమ:
ఓం సర్వ సంహార కారిణ్యై నమ:
ఓం ధర్మజ్జానాయై నమ:
ఓం ధర్మ నిష్ఠాయై నమ:
ఓం సర్వ కర్మ వివర్జితాయై నమ:
ఓం కామాక్ష్యై నమ:
ఓం కామ సంహత్ర్యై నమ:
ఓం కామ క్రోధ వివర్జితాయై నమ:
ఓం శాంకర్యై నమ:
ఓం శాంభవ్యై నమ:
ఓం శాంతాయై నమ:
ఓం చంద్ర సూర్య లోచనాయై నమ:
ఓం సుజయాయై నమ:
ఓం జయాయై నమ:
ఓం భూమిష్థాయై నమ:
ఓం జాహ్నవ్యై నమ:
ఓం జన పూజితాయై నమ:
ఓం శాస్త్ర్ర్రాయై నమ:
ఓం శాస్త్ర మయాయై నమ:
ఓం నిత్యాయై నమ:
ఓం శుభాయై నమ:
ఓం శుభ ప్రధాయై
ఓం చంద్రార్ధ మస్తకాయై నమ:
ఓం భారత్యై నమ:
ఓం భ్రామర్యై నమ:
ఓం కల్పాయై నమ:
ఓం కరాళ్యై నమ:
ఓం కృష్ఠ పింగళాయై నమ:
ఓం బ్రాహ్మే నమ:
ఓం నారాయణ్యై నమ:
ఓం రౌద్ర్ర్యై నమ:
ఓం చంద్రామృత పరివృతాయై నమ:
ఓం జేష్ఠాయై నమ:
ఓం ఇందిరాయై నమ:
ఓం మహా మాయాయై నమ:
ఓం జగత్వృష్థాధి కారిణ్యై నమ:
ఓం బ్రహ్మాండ కోటి సంస్థానాయై నమ:
ఓం కామిన్యై నమ:
ఓం కమలాయై నమ:
ఓం కాత్యాయన్యై నమ:
ఓం కలాతీతాయై నమ:
ఓం కాల సంహార కారిణ్యై నమ:
ఓం యోగ నిష్ఠాయై నమ:
ఓం యోగి గమ్యాయై నమ:
ఓం తపస్విన్యై నమ:
ఓం జ్జాన రూపాయై నమ:
ఓం నిరాకారాయై నమ:
ఓం భక్తాభీష్ఠ ఫల ప్రదాయై నమ:
ఓం భూతాత్మికాయై నమ:
ఓం భూత మాత్రే నమ:
ఓం భూతేశాయై నమ:
ఓం భూత ధారిణ్యై నమ:
ఓం స్వదానారీ మద్యగతాయై నమ:
ఓం షడాధారాది వర్ధిన్యై నమ:
ఓం మోహితాయై నమ:
ఓం శుభ్రాయై నమ:
ఓం సూక్ష్మాయై నమ:
ఓం మాత్రాయై నమ:
ఓం నిరాలసాయై నమ:
ఓం నిమగ్నాయై నమ:
ఓం నీల సంకాశాయై నమ:
ఓం నిత్యానందాయై నమ:
ఓం హరాయై నమ:
ఓం పరాయై నమ:
ఓం సర్వ జ్జాన ప్రదాయై నమ:
ఓం ఆనందాయై నమ:
ఓం సత్యాయై నమ:
ఓం దుర్లభ రూపిణ్యై నమ:
ఓం సరస్వత్యై నమ:
ఓం సర్వ గతాయై నమ:
ఓం సర్వాభీష్ఠ ప్రదాయిన్యై నమ:
🌹శ్రీ మాత్రే నమః🌹
🙏🙏🙏
**దేవీ నవరాత్రులు*
నవ దుర్గలు - 1.
*శైలపుత్రి**
ప్రార్ధనా శ్లోకము :
**వందే వాంఛితలాభాయ చంద్రార్ధకృతశేఖరామ్** ।
**వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వినీమ్** ॥
🌷. అలంకారము : బాలా త్రిపుర సుందరి - నీలి రంగు
🌷 నివేదనం : ఉప్పు పొంగల్
🌷. మహిమ :
కుడిచేతిలో త్రిశూలాన్ని, వామహస్తంలో పద్మాన్ని, వృషభవాహినిగా అవతరించిన శైలపుత్రిని స్మరించినంతనే, శ్రవణం చేసినంత మాత్రాన విజయోత్సాహం కలుగుతుంది.
దుర్గామాత మొదటి స్వరూపము ‘శైలపుత్రి’ నామముతో ప్రసిద్ధికెక్కినది. పర్వత రాజైన హిమవంతుని ఇంట పుత్రికయై అవతరించినందున ఆమెకు ‘శైలపుత్రి’ అనే నామము ఏర్పడినది.
వృషభవాహననారూఢయైన ఈ మాత కుడి చేతిలో త్రిశూలమూ, ఎడమచేతిలో కమలమూ విరాజిల్లుతుంటాయి. ఈ అవతారమే నవదుర్గలలో మొదటిది.
నవదుర్గలలో మొదటి అవతారమైన ‘శైలపుత్రి’ యొక్క మహిమలూ, శక్తులూ అనంతములు. మొదటి రోజున యోగులు ఉపాసన ద్వారా తమ మనస్సులను మూలాధార చక్రంలో స్థిరపరుచుకుంటారు. దీనితోనే వారి యోగ సాధనలు ఆరంభమవుతాయి.
🌷. చరిత్ర :
పూర్వజన్మలో ఈమె దక్ష ప్రజాపతికి పుత్రిక – దాక్షాయని. అ జన్మలో ఈమె పేరు సతీదేవి. ఈమె పరమేశ్వరుని పరిణయమాడినది. ఒకసారి దక్షుడొక మహాయజ్ఞమును ఆచరిస్తాడు. దేవతలు తమతమ యజ్ఞభాగములను స్వీకరించటానికై దక్షుడు వారిని ఆహ్వానిస్తాడు. కానీ పరమశివుని మాత్రము ఆ యజ్ఞానికి పిలువడు. తన తండ్రి ఒక మహాయజ్ఞమును సంకల్పించిన విషయం ఆమెకు తెలుస్తుంది. ఆ యజ్ఞాన్ని వీక్షించటానికై ఆమె మసస్సు ఉబలాటపడుతుంది. అప్పుడు ఆమె పరమేశ్వరునికి తన కోరికను తెలియజేస్తుంది. బాగా ఆలోచించి పరమేశ్వరుడు “కారణము ఏమోగానీ, దక్షుడు మనపై కినుకుబూనినాడు. అతడు తన యజ్ఞమునకు దేవతలందరినీ ఆహ్వానించినాడు. యజ్ఞభాగములనుగూడ వారికి సమర్పించుచున్నాడు. కానీ ఉద్దేశ్యపూర్వకముగానే మనలను పిలువలేదు. కనీసము సమాచారమునైననూ తెలుపలేదు. ఇట్టి పరిస్థితిలో నీవు అచటికి వెళ్ళుట ఏ విధముగను మంచిదిగాదు” అని హితవు బోధించారు. శంకరుని ఈ హితవచనము ఆమె చెవికెక్కలేదు. ఈ యజ్ఞమిషతోనైనా అక్కడికి వెళ్ళి తన తల్లినీ, తోబుట్టువులనూ చూడవచ్చునన్న కోరిక ప్రబలంగా ఉండటంతో అనుమతికై ఆమె పట్టుబడుతుంది. ఆమె పట్టుదలను చూసి, చివరకు శంకరుడు అనుమతిస్తారు.
సతీదేవి తన తండ్రియింటికి చేరినప్పుడు అక్కడివారెవ్వరూ ఆమెతో మాట్లాడరు, ఆదరించరు. అందరూ ముఖాలను పక్కకు తిప్పుకొంటారు. తల్లి మాత్రము ఆమెను ప్రేమతో కౌగిలించుకొంటుంది. తోబుట్టువుల పలుకులలో వ్యంగ్యం, పరిహాసమూ నిండి ఉంటాయి. తనవారి ప్రవర్తనకు ఆమె మనస్సు కలత చెందుతుంది. అందరిలోనూ శంకరుని పట్ల నిరాదరణభావమే ఉండటం ఆమె గమనిస్తుంది. తండ్రియైన దక్షుడు ఆమెతో అవమానకరంగా మాట్లాడతాడు. ఇదంతా అనుభవించిన పిమ్మట, సతీదేవి హృదయము క్షోభతో, గ్లానితో, క్రోధముతో ఉడికిపోతుంది. ‘పరమేశ్వరుని మాటను పాటింపక నేను ఇచ్చటికివచ్చి పెద్ద పొరబాటే చేసితిని‘ అని ఆమె భావిస్తుంది.
తన పతియైన పరమేశ్వరునికి జరిగిన ఈ అవమానమును ఆమె సహించలేక పోతుంది. వెంటనే ఆమె తన రూపమును అక్కడికక్కడే యోగాగ్నిలో భస్మము గావిస్తుంది. భరింపలేని ఈ దారుణదుఃఖకరమైన సంఘటనను గురించి విని, పరమశివుడు మిక్కిలి క్రోధితుడవుతాడు. ఆయన తన ప్రమథగణాలను పంపి దక్షుని యజ్ఞాన్ని పూర్తిగా ద్వంసం చేయిస్తారు.
సతీదేవి యోగాగ్నిలో తన తనువును చాలించి, మరుజన్మలో శైలరాజైన హిమవంతునికి పుత్రికగా అవతరిస్తుంది. అప్పుడామె ‘శైలపుత్రి’గా ప్రసిద్ధికెక్కుతుంది. పార్వతి, హైమవతి అన్నవి కూడా ఆమె పేర్లే. ఉపనిషత్తులోని ఒక కథను అనుసరించి, ఆమె హైమవతీ రూపంలో దేవతల గర్వాన్ని ఆణచివేస్తుంది.
‘శైలపుత్రి’ అవతారములో ఆమె పరమేశ్వరుణ్ణే పరిణయమాడుతుంది. పూర్వజన్మలో లాగానే ఈ అవతారంలో కూడా శంకరునికి ‘అర్ధాంగి’ అవుతుంది.
నవరాత్రి ఉత్సవములలో మొదటిరోజున ఈ దేవికై పూజలూ, ఉపవాసాలూ జరుపబడుతాయి.
🌹 🌹 🌹 🌹
🙏🙏🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి