శా.మత్తుల్ కొందరు స్వార్థపూరిత మతిన్ మాత్సర్య హీనాత్మ దు
ర్వృత్తుల్ జూపి చరింప నెంచెద రిలన్ వేధించుచున్,శిష్ట ధ
ర్మోత్తంస ప్రతి నిర్ణయాత్మక విధిన్ మోదమ్ము చేకూర్చు ధీ
వృత్త జ్ఞాన వదాన్య నిత్య హితులన్ విద్వాంసులన్ సర్వదా౹౹ 47
ఉ.విత్తుకు నాశన మ్మొదవ వృక్షము లెట్లు జనించు భూమిపై
నెత్తరి కర్షకోత్తముల కెప్పుడ నర్థము లెంచి చేయగా
నత్తరి భూమిపై జనుల ఆకలి దప్పులు తీరగల్గు నా
ఉత్తమ ధార్మికోన్నతుల కూరట గల్గ జగమ్ము వర్ధిలున్౹౹ 48
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి