11, ఆగస్టు 2024, ఆదివారం

దేవాలయాలు - పూజలు 7*

 *దేవాలయాలు - పూజలు 7*




దేవాలయాలు - పూజలు అను శీర్షికన వ్యాస పరంపర కొనసాగుతున్నప్పుడు...

ఇందులోభాగంగా...


దేవాలయాలు, పూజలు మరియు అర్చకులు అను అంశాల ప్రస్తావన వస్తున్నది. *అనాదిగా* అర్చకులు అంటే తొంబది తొమ్మిది శాతము బ్రాహ్మణ వంశీయులు మరియు వారి కుటుంబాలే దేవాలయ అర్చకులుగా, పూజారులుగా స్థిరపడ్డారు. 


శాస్త్ర నియమము ప్రకారము సంస్కారము, పూజాదుల పట్ల శ్రద్ధ, దైవ కార్యములలో నిమగ్నత, విశిష్టతలతో బాటు తప్పనిసరిగా మంత్ర పఠనము, వేద మంత్రార్థములలో నిష్ణాతులైన ఉండవలసి ఉన్నది, ఉంటుంది కూడా. *ఈ వ్యాసాంశము పరిపూర్ణంగా ఉండాలంటే ఇందుకు సంబంధించిన తాజా సమాచారమును కూడా పొందుపరచవలసి ఉంటుంది*.


2018 వ సంవత్సరంలో వెలువడిన సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో *అర్చకులు కావడానికి అన్ని కులాల వారు అర్హులే, అవుతే వారు ఆలయ ఆగమ శాస్త్రాల ప్రకారం అర్హత పొందిన వారై ఉండాలి*. 


ఇందుకు పూర్వ భూమిక... మద్రాసు హై కోర్టు ఇచ్చిన తీర్పు. హై కోర్టు తీర్పు ప్రకారం *ఆలయ నిగమ నిబంధనలు, పూజా విధానాలలో ఉత్తీర్ణత పొందిన వారెవరైనా దేవాలయాలలో అర్చకులు కావచ్చును*. 


మద్రాస్ హై కోర్టు తీర్పునకు పూర్వ పీఠిక...తమిళనాడు ప్రభుత్వము హిందూ ధార్మిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహింప బడుతున్న పలు దేవాలయాలలో దళితులతో పాటు అన్ని కులాలకు చెందిన 28 మందిని పూజారులుగా నియమించుటయే. 


*మాన్యులు విజ్ఞప్తి*.

*దేవాలయము - పూజలు* అను విషయమై ధారావాహిక రచనా నిర్మాణము బహు సున్నితము మరియు విస్తృతమే గాకుండా క్రమానుసారమైన, ప్రామాణిక, సుస్థాపిత, విశేష్యము గల అంశము గనుక ఈ గ్రూప్ లోని మాన్యులు... 

ఈ రచనలలో అన్యమైన, అసంగత, అసంబద్ధ, అప్రస్తుత, అనంగీకార ప్రస్తావనలు ఉంటే తెలుపగలరు, సరిదిద్దగలరు. ప్రమాణములు జతపర్చిన చదువరులకు మరింత జ్ఞానదాయకంగా ఉంటుంది.


ధన్యవాదములు.

*(సశేషం)*

కామెంట్‌లు లేవు: