13, ఏప్రిల్ 2021, మంగళవారం

అమృత రసాన్ని

 సకల విశ్వ శ్రేయస్కరమై, చరాచర జీవజాలపు నిత్య సుచైతన్య సంక్షేమార్ధమై, పవిత్ర ప్రకృతి ఒసగే స్నేహ హస్తం ! కాలానుగుణంగా తరలివచ్చే వివిధ సదావకాశాల సమ్మేళనంగా, విశ్వ మానవాళి పుణికిపుచ్చుకోవాల్సిన సన్మార్గ, సుహృద్భావ, సహృదయ, సువ్యక్తిత్వ వికాస సద్భావనాత్మక జీవన శైలి ! యావత్ విశ్వానికే మణిహారమై, అమృతతుల్యమై దేదీప్యమానమై అనునిత్యం ఈ భువిన ప్రకాశించే, దివ్య భవ్య  సమైక్యతను ప్రస్ఫుటించే విభిన్న భావనలకు ఆలవాలమైన అద్భుత భాషా వికసన స్ఫూర్తి ! ప్రకృతి, సకల జీవుల పట్ల అభిమానంతో, స్నేహమయిగా కురిపించే అమృత ధార, వివిధ నదీనదాలుగా ప్రవహిస్తూ, ఈ అవనిపై అనుక్షణం అమృత రసాన్ని యావత్ చరాచర జీవజగతికి అందచేస్తున్న వైనం ! ఏ భాషైనా, ఏ మతమైనా, వివిధ వర్గ లేక తెగలకు చెందిన మానవాళి ఈ పవిత్ర పృధ్విపై మరువరాని ముఖ్యాంశం, " సమున్నతమై, సమైక్య భావనతో, సయోధ్యతో, కలసిమెలసి నడుస్తూ సకల విశ్వ జీవరాశి సంరక్షణకై నిత్య చైతన్య స్ఫూర్తిమంతమైన సుమైత్రీ బాటలో పయనించే విషయం " ! " ప్లవ నామ వత్సరపు ముఖ్య ధ్యేయం, యావత్ విశ్వ జీవరాశి ప్రశాంత జీవనానికై అనాదిగా ఈ ఇలపై నిర్దేశించబడిన ప్రాచీన వైదిక, ధార్మిక సనాతన స్ఫూర్తి ఆధారితమైన, ప్రత్యేకమైన, అత్యంత ప్రధానమైన సువిశాల సుహృద్భావ సయోధ్య ! ప్లవ నామ వత్సర శుభ ఫలాల లభ్యత, సకల విశ్వ మానవాళి నిత్య సుచైతన్య సయోధ్యపై ఆధారితమన్నదే, ఈ క్రమంలో సత్య చైతన్య దార్శనికతగా నిలుస్తున్నదే ఇక్కడ గమనించాల్సిన విషయం ! " స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాభినందనలతో.... సకల విశ్వ జీవరాశి సంరక్షణకై అనునిత్యం, అన్నికోణాల్లో యావత్ విశ్వ వ్యాప్తమైన కృషి జరగాలని మనసారా అభిలషిస్తూ.......                    ✍️గుళ్లపల్లి ఆంజనేయులు

కామెంట్‌లు లేవు: