4, సెప్టెంబర్ 2020, శుక్రవారం

అంతఃకరణ



మనం బాహ్య కర్మలు చేయడానికి కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఉన్నాయి.

వీటిని బాహ్య కరణాలు అంటారు.

ఈ రెంటినీ కలిపి దశేన్ద్రియాలు అంటారు.

రాత్రి నిద్రలో ఉన్నప్పుడు ఈ పది ఇంద్రియాల ద్వారా జరిగే కర్మలు అనుభవాలు వస్తాయి. అంటే కలలో చూడటము, నడవడం మాట్లాడటము లాంటివి. వీటిని అంతః దశేన్ద్రియాలు అంటాం.

శరీరం తో ఉన్న దశేన్ద్రియాలు మనము బాహ్య జగత్తులో ఉన్నప్పుడు పని చేస్తాయి.

నిద్ర పోయినప్పుడు ఈ అంతః దశేన్ద్రియాలు పని చేస్తాయి.

అయితే ఈ రెంటినీ పని చేయంచడానికి లోపల ఉండి పనిచేయడానికి నాలుగు పరికరాలు ఉన్నాయి. పరికరం అంటే కరణం. నాలుగు పరెకరాలు లోపల ఉండడం వల్ల వీటిని అంతఃకరణ చతుష్టయం అంటారు.

అంతఃకరణ చతుష్టయం లో మనస్సు, బుద్ది, చిత్తము, అహంకారము ఉంటాయి.

మనస్సు అంటే అలోచనల సమూహము. చంచలం దీని స్వభావము. ఎప్పుడు ధ్వందం లో ఉంటుంది, ఆదా, ఇదా అన్నది తెల్చుకొకపోవడము దీని నైజము. ఆవేశము దీని స్వభావము. ఏది కావాలి ఏది అక్కరలేదో దీనికి తెలియదు.

బుద్ధి అనేది ఒక నిర్ణయాత్మక శక్తి, జ్ఞానవంతంగా ఉండడం దీని లక్షణం. యుక్తాయుక్త విచక్షణ దీని స్వభావం. ఆస్తిక బుద్ది, నాస్తిక బుద్ది, సరళ బుద్ది, వక్ర బుద్ది, స్థిర బుద్ది అని బుద్ది పది రకాలుగా ఉంది.
అనుభవాల సారంని జ్ఞానం గా మార్చుకొంటుంది ఈ బుద్ది.

చిత్తం అన్నది ఒక జ్ఞాపకాల మూట. ఇందులో ఎన్నో రకాల జ్ఞాపకాలు ఉంటాయి. అవి కొని చెత్త జ్ఞాపకాలు, కొన్ని అనిత్య జ్ఞాపకాలు, కొన్ని శాశ్వత సత్యాలు.

అహంకారము అన్నది ఒక వేర్పాటు ధోరణి.
"నేను ~ నాది",
"నీది ~ నాది",
 "నువ్వు వేరు ~ నేను వేరు " ,

ఇలా ఉంటుంది అహంకారం..
ఇదండి అంతఃకరణ గురించి

కామెంట్‌లు లేవు: