4, సెప్టెంబర్ 2020, శుక్రవారం

శివామృతలహరి శతకం

.శ్రీ.చిల్లర కృష్ణమూర్తి గారు వ్రాసిన

 #శివామృతలహరి శతకంలోని ఒక పద్యం;


మ||

గుడిగంటై తెగమ్రోగనిమ్ము రసనన్ కొండాడుచున్ నిన్ను; సం

దడిసేయంగ ననుజ్ఞనిమ్ము భజనన్ తాళములై హస్తముల్

కొడులం గట్టక నాదు మానసము నీకుం దీపమై వెల్దనీ ;

సిడమై శీర్షము దేహమాలయముగా శ్రీ సిద్ధలింగేశ్వరా !


నిత్యం శివ నామస్మరణతో గడిపిన నాన్నగారు ఈ పద్యాన్ని ఇలా వ్రాశారు.

భావం;

నిత్యం నీ నామస్మరణతో నా నాలుకని గుడిగంటలా మ్రోగుతూ ఉండనివ్వు,

నీ యొక్క భజన కీర్తనలు చేస్తూ ఎల్లప్పుడూ తాళం వెయ్యటానికి నా చేతులకు అనుజ్ఞనివ్వు,

నా హృదయమనే దీపం కొడగట్టకుండా నిత్యము నీ దీపారాధన కోసం వెలుగుతూ ఉండేట్లు చూడు.

నా శిరస్సుని నీ గుడిలో ధ్వజ స్తంభం లాగా, నా దేహమే నీకు ఆలయం లాగా ఉండేట్లు నాకు అనుమతి ప్రసాదించు స్వామీ! శ్రీ సిద్ధ లింగేశ్వరా!

అని ప్రార్థించారు. 

ఓం నమః శివాయ!

కామెంట్‌లు లేవు: