11, నవంబర్ 2020, బుధవారం

హిందూ ధర్మం** 82

 **దశిక రాము**


**హిందూ ధర్మం** 82


 (బ్రహ్మర్షి విశ్వామిత్రుడు)


ఇప్పుడు విశ్వామిత్రుడు అన్ని విధాలుగా కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను జయించించాడు. అతనిలో ఇప్పుడు ఏ దుర్గుణము లేదు. కానీ ఆయన అనుకుంటే , ఆయన శక్తి చేత మూడు లోకాలను నశింపజేయగలడు. అతని తపస్సు వలన అన్ని దిక్కులు వ్యాకులత చెందుతున్నాయి, సముద్రాలు ప్రచండంగా ఉన్నాయి, పర్వతాలు బద్దలవుతాయా అన్నట్టు అనిపిస్తోంది, లోకంలో ఏవీ కూడా ప్రకాశించడంలేదు. ఓ బ్రహ్మదేవా! భూమి కంపిస్తోంది, ప్రచండమైన గాలులు వీస్తున్నాయి, జనం ఆస్తికత్వాన్ని విడిచిపెడతారనే భయం వేస్తోంది. మాకు ఏం చేయాలో తోచడం లేదు. మూడులోకాల్లో ఉన్న జీవులు మనసులో కలవరపడుతున్నాయి, మూఢంగా ప్రవర్తిస్తున్నాయి. అతని తేజస్సు ముందు సూర్యుడు కూడా వెలగలేకపోతున్నాడు. విశ్వామిత్రుడు సాక్షత్తు అగ్నిదేవుడిని తపలిస్తున్నాడు. అతను మూడు లోకాలు నాశనమవ్వాలని కోరుకోకముందే అతని కోరికను తీర్చడం మంచిది. పూర్వం కాలాగ్ని చేత ఏ విధంగానైతే మూడులోకాలు మండుతున్నాయో, అదే విధంగా ఇప్పుడు కూడా మండుతున్నాయి. కనుక మేము చెప్పదల్చుకుంది ఒక్కటే. అతను ఏం కోరితే అది ప్రసాదించండి. ఒకవేళ అతను దేవతలు రాజు అవుతానంటే అది కూడా ఇవ్వండి అని దేవతలు బ్రహ్మదేవునితో మొరపెట్టుకున్నారు.


దేవతలందరు బ్రహ్మదేవునితో పాటు విశ్వామిత్రుని ముందు ప్రత్యక్షమై 'ఓ బ్రహ్మర్షి! మీకు స్వాగతం. మీ తపస్సు చేత మేము సంతృప్తి చెందాము. ఘోరమైన తపస్సు కారణంగా మీరు బ్రాహ్మణ్యాన్ని పొందారు' అని మధురమైన వార్త చెప్పారు. 'వరణు, వాయు మొదలైన దేవతల సమూహం వలే మీకు కూడా ధీర్ఘాయువును ప్రసాదిస్తున్నాను. మీకు స్వసి కలుగుగాకా. మీకు రక్షణ ఉంటుంది. మీరు ఇక తపస్సును ఆపవచ్చు' అన్నారు బ్రహ్మ. నేనే కనుక బ్రహ్మత్వాన్ని, ధీర్ఘాయువును పొందిఉంటే నాకు ఓంకారం, వషట్‌కారం, వేదాలు అన్ని అర్దమవ్వాలి. సకల క్షాత్ర విద్యల మీద మంచి పాండిత్యం, పరబ్రహ్మ తత్వం పూర్తిగా ఎరిగిన మహామేధావి, తేజోవంతుడు, బ్రహ్మమానసపుత్రుడైన వశిష్టమహర్షి నన్ను బ్రహ్మర్షి అని పిలవాలి. అప్పుడే నేను నా తపస్సును విరమిస్తాను. మీరు నా ఈ కోరిక తీర్చండి' అన్నారు విశ్వామిత్రుడు. దేవతలందరు వశిష్టమహర్షి దగ్గరకు వెళ్ళి, పరిస్థితి వివరించి ఆయన్ను తీసుకువచ్చారు. మీరు విశ్వామిత్రుని బ్రహ్మర్షి ని పిలిచి, బ్రహ్మర్షిగా అంగీకరించాలి అన్నారు. నాకు అందులో ఇబ్బందేమి లేదు అన్నాడు వశిష్టమహర్షి.


విశ్వామిత్రుని వద్దకు వెళ్ళి స్నేహపూర్వకంగా ఇక నుంచి మీరు కుడా బ్రహ్మర్షే, అందులో సందేహం లేదు, మీకు ఇక నుంచి సర్వం తెలుస్తుంది అన్నారు వశిష్టులవారు. దేవతలందరూ తమ తమ లోకాలకు వెళ్ళిపోయారు. ఇంత తపస్సు విశ్వామిత్రునిలో సకల దుర్గుణాలను తొలగించింది. అందువల్ల ఆయనకు వశిష్టమహర్షి మీదనున్న కోపం తొలగిపోయింది. బ్రహ్మర్షి విశ్వామిత్రుడు బ్రహ్మర్షి వశిష్టులవారికి గొప్ప స్థానం ఇచ్చి, పూజించారు.


తరువాయి భాగం రేపు.....

🙏🙏🙏

సేకరణ

కామెంట్‌లు లేవు: