11, నవంబర్ 2020, బుధవారం

08. భక్తియోగం

 **అద్వైత వేదాంత పరిచయం**


08. భక్తియోగం

  సందర్భాన్ని బట్టి ఇవాళ భక్తికి శాస్త్రంలో చాలా ప్రాముఖ్యత 

ఉంది, వివిధ సందర్భాలలో దీని అర్థంలో చిన్న తేడాలుంటాయి.అందుకని యిది మనని కొంతమేరకు అయోమయంలో పడవేస్తుంది కూడాను. అందుకని మనం భక్తి అంటే ఏమిటో 

స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ‘భక్తి’ అన్న పదాన్ని శాస్త్రం రెండు అర్థాలలో వాడుతుంది.

8.1  భక్తి మొదటి అర్థం :

  భక్తి అంటే దేవుని మీద ఆరాధన. గౌరవంతో కూడిన ప్రేమని ఆరాధనగా అభివర్ణించ వచ్చు. అది ఉన్నతమైన వ్యక్తుల మీద ఏర్పడుతుంది మాతృభక్తి, పితృభక్తి 

అంటాం, వాళ్ళని పూజనీయ వ్యక్తులుగా పరిగణిస్తాము కాబట్టి. అలాగే గురుభక్తి, దేశభక్తి, ఈశ్వరభక్తి, అంటే, భక్తి అంటే ఉన్నతమైన వ్యక్తిమీద ప్రేమ, ముఖ్యంగా దేవుని మీద భక్తి

8.2  ప్రేమకి మూడు దిశలు :

     ప్రేమని మన శాస్త్రం చక్కగా విశ్లేషించింది.మామూలు వ్యక్తుల మీద ప్రేమ అవనీ, అలాగే దేవుని మీద ఉన్న ప్రత్యేకమైన ప్రేమ అవనీ, మనిషి ఎవరి మీద ఏ విధమైన ప్రేమ 

చూపించినా, అది కేవలం మూడు దశల్లో ఉన్నాయని శాస్త్రం చెప్తోంది

అద్వైత వేదాంత పరిచయం

8.2.1  గమ్యం - ప్రేమ : మొదటిది లక్ష్యం మీద ప్రేమ. మనం జీవితంలో సాధించాలనుకున్న అంతిమ లక్ష్యాన్ని ప్రేమిస్తాము. వాటిని ప్రేమిస్తున్నాము కాబట్టే, వాటిని 

సాధిద్దామనుకుంటున్నాము. అందుకని దీనిని ‘గమ్యం ప్రేమ’ అనచ్చు.

8.2.2  మార్గం ప్రేమ : తర్వాత ఈ గమ్యం చేరుకోవటానికి మనం అనేక మార్గాలని ఉపయోగించాలి. ఏదో ఒకమార్గం ద్వారా వెళితే గాని గమ్యం చేరుకోలేము. మార్గం వల్లే మన 

గమ్యం చేరుకోగలము కాబట్టి మార్గాన్ని కూడా ప్రేమిస్తాము. అందువల్ల దీన్ని ‘మార్గం ప్రేమ’ అనచ్చు.

8.2.3  స్వయం ప్రేమ : మూడోది మనమీద మనకి ఉన్న ప్రేమ. అందుకని దాన్ని ‘స్వయం ప్రేమ’ అందాము. 

అందువల్ల ప్రేమలన్నింటినీ మూడు తెగలుగా వర్ణించవచ్చు, గమ్యం ప్రేమ, మార్గం ప్రేమ, స్వయం ప్రేమ. ఇది ఎటువంటి ప్రేమకైనా వర్తిస్తుంది.


అద్వైత వేదాంత పరిచయం

8.3 ప్రేమలో స్థాయీబేధాలు :

  మూడు తెగల ప్రేమ ఉన్నప్పుడు వాటిమీద ఉన్న తీవ్రతలో స్థాయీ బేధం ఉంటుందని శాస్త్రం చెపుతోంది. మార్గం మీద ప్రేమ స్థాయి చాలా తక్కువ, గమ్యం మీద 

మధ్యస్థం, స్వయంమీద హెచ్చుస్థాయి ఉంటుంది. ఎందుకు? కారణం చాలా తేలిక. మార్గాన్ని మార్గం కోసం ప్రేమించటం లేదు. దాని ద్వారా గమ్యం చేరుకోవటానికి ప్రయత్నిస్తున్నాము. 

గమ్యం చేరుకున్నాక మార్గాన్ని మర్చిపోతాము. ధనవంతుల చుట్టూ భజన చేస్తూ మనుష్యులు ఎందుకు తిరుగుతారు? వాళ్ళు ఐశ్వర్యమనే గమ్యం చేరుకోవటానికి మార్గం అంతే. వాళ్ళ 

దగ్గర డబ్బు ఉన్నంత కాలమే వాళ్ళ దగ్గర జేరతారు. ఎప్పుడైతే వాళ్ళ ఐశ్వర్యం మటుమాయమవుతుందో, అప్పుడే భజనగాళ్ళూ కనుమరుగవుతారు. ఇంట్లో వృద్ధులని ఆపేక్షగా 

చూస్తారు, ఎందుకు? ఆస్తి రాసిస్తారన్న ఆశతో. ఖర్మగాలి ఆ వృద్ధుడు తన ఆస్తిని ముందే రాసిచ్చాడా, అతని పాట్లు పగవాడికి కూడా వద్దనిపిస్తుంది. అతను తన తోటివారికి సలహాలిస్తాడు 

తనలాగా ముందే ఆస్తిని యివ్వద్దని.    యావత్‌ విత్తో పార్జనసక్త:।

  తావన్నిజ పరివారో రక్త:।

  పశ్చాత్‌ జీవతి జర్జర దేహే।

  వార్తామ్‌ కోపి న పృచ్ఛతి గేహే!॥

  అధికశాతం తోటివారి మీద ప్రేమ, గమ్యమనే డబ్బుని చేరుకోవటానికి మార్గం. అందుకని గమ్యం మీద ప్రేమ ఎక్కువ, మార్గం కన్నా. మార్గం యిష్టమైతే, గమ్యం మరీ 

యిష్టతరం. మరి ఇప్పుడు, గమ్యం మీద ప్రేమ, ఎక్కువా, స్వయం మీద ప్రేమ ఎక్కువా? తార్కికంగా ఆలోచిస్తే మనం అనేక గమ్యాలను ఎన్నుకోవటానికి కారణం, అవి మనకు భద్రతనో, 

సుఖాన్నో, ఆనందాన్నో యిస్తాయి కాబట్టి. ఎప్పుడైతే ఒక గమ్యం మనకు సుఖాన్నివ్వదు అని మనకు అనిపిస్తుందో అప్పుడు మనం దాన్ని వదులుకుంటా ము

  అందువల్ల గమ్యాన్ని గమ్యం కోసం ప్రేమించరు. అంతా మనచుట్టూనే తిరుగుతుంది. అందువల్ల ప్రేమలో స్థాయీబేధం చూడాలంటే  మార్గం ప్రేమ, మంద ప్రేమ, గమ్యం 

ప్రేమ, మధ్యమ ప్రేమ, స్వయం ప్రేమ, ఉత్తమ ప్రేమ. ఇది మానవ ప్రేమ గురించి సాధారణ సూత్రం.

అద్వైత వేదాంత పరిచయం

8.4  మూడు స్థాయిల భక్తి :

.ఎవరైనా దేవుని ప్రేమిస్తే, ఆ ప్రేమ స్థాయి ఎంతలో ఉంది? శాస్త్రం చెపుతుంది, ఆ స్థాయి వాళ్ళు దేవుని ఆరాధిధించే పద్ధతిని 

బట్టి ఉంటుందని. మనుష్యులు రకరకాల అనగా నవ విధభ క్తులతో చూస్తారు దేవుణ్ణి. దాన్ని బట్టే స్థాయీ

భేదం కూడా ఉంటుంది.ఏదైనాహృదయ పుష్పాన్ని దేవుడికి అర్పించే స్థాయి రావాలి అదేగొప్పస్ధాయి

🙏🙏🙏

సేకరణ

కామెంట్‌లు లేవు: