🙏శివానందలహారీ 🙏
ఫలద్వా పుణ్యానాం మయి కరుణాయా నా త్వయి విభో !
ప్రసన్నే2పి స్వామిన్ ! భవ దమల పాదాబ్జయుగళమ్
కథం ? పశ్యేయం మాం స్థగయతి నమస్సం భ్రమజుషా మ్
నిలింపానాం శ్రేణి ర్నిజ కనక మాణిక్య మకుటై :
నాపుణ్య ఫలమోకో ! నాపైని కరుణయో !
మన్నించితివి నన్ను నిన్నుజూడ
పరమేశ ! భవదీయ పాదపద్మంబులన్
దర్శింతు నేరీతి దరికి జేరి ?
వరుసగా నచ్చోట వసియింతు రమరులున్
భవదీయ పదసుమ స్పర్శ కొఱకు
మహనీయు లగువారి మకుటంబు లందున
వెల్గెడి మాణిక్య విమల కాంతి
సురుల మకుటపు మణిమయ శోభ లెల్ల
విభవ మొప్పగ దిశలను వెల్గు చుండ
నడ్డుగా నుండ మన్నయనాబ్జములకు ,
నెట్లు నిను గాంతు నీశ్వరా ! యేమి సేతు ? 17 #
త్వ మేకో లోకానాం పరమఫలదో , దివ్యపదవీమ్
వహంత స్త్వన్మూలాం పున రపి భజంతే హరిముఖా:
కీయద్వా ? దాక్షిణ్యం తవ ,శివ ! మాదాశా చ కియ తీసి
కదా వా మద్రక్షా0 వహతి కరుణా పూరిత దృశా
పరమ ఫలములిచ్చు భగవాను డరయంగ
నీ వొక్కరుండవే నిఖిలమందు
పరమేశ ! నీవిచ్చు పదవులు పొందియు
విష్ణు డాదిగనున్న విమలబుద్ధు
లత్యున్నతి పదవు లాశించు చుందురు
నిరతంబు యీశ్వరా ! నిన్ను నమ్మి
నీ దయ నెంచంగ నిక్క మెవ్వరి కైన
చర్చించి చూడగా సాధ్య మౌనె
యైన నా యాశ కేమాత్ర మంతులేదు
విమలపూరిత కారుణ్య వీక్షణమున
నన్ను రక్షింప వేడుదు సన్నుతించి
దివ్యమానస సంస్థితా ! దేవ ! దేవ ! 18 #
✍️ గోపాలుని మధుసూదన రావు🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి