11, నవంబర్ 2020, బుధవారం

ఓం శ్రీం కమల వాసిన్యై నమః*

 *ఓం శ్రీం కమల వాసిన్యై నమః*


మహాలక్ష్మీ అనుగ్రహానికి, సర్వ సంపదల సిద్ధికి.. 


*పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి*

*విష్ణుప్రియే విష్ణు మనోనుకూలే త్వత్పాద పద్మమయి సన్నిధత్స్వ.*


 *పద్మం* వికాసానికి సంకేతం. *సూర్యుడు* ఆకాశంలో ఉదయించగానే పద్మం వికసిస్తుంది. 


అదే విధంగా సృష్టి చైతన్యమైన *కమలవాసిని* ప్రభావం వల్ల సంపదలు, ఆనందం, సంతృప్తి అనే కమలాలు వికసిస్తాయి. 


అందుకే, *వికాసానికి ప్రతీకగా అమ్మవారి ఆసనంగానూ, ఆమె చేతిలో అలంకారాలుగానూ, ఆమె గృహంగానూ, తన కన్నుల రూపంగానూ పద్మాలను సూచిస్తుండటం పురాణ* సంప్రదాయం.


 మన *సంపదలన్నీ వికాసానికి* సంకేతాలు. *కనిపించే సంపదరూపం ధనం.  కనిపించని సంపదలెన్నో* మన చుట్టూ చాలా ఉన్నాయి. 


 *ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం* అన్నీ సంపదలే. *నిరంతరం సంతృప్తిగా ఉండటం గొప్ప సంపద. ధైర్యం వంటి గుణాలన్నీ సంపదలే* . 


ఇటువంటి *సంపదలన్నీ మనకు పరిపూర్ణమైన అనుగ్రహాన్ని అందించాలంటే ఈ సంపదలకు కారకమైన మూలశక్తి మహాలక్ష్మీదేవి* అనుగ్రహాన్ని పొందాల్సిందే. 


ఈ *అమ్మవారిని ప్రార్థన చేస్తుంటే కేవలం సంపదలు కలగడమే కాదు, వాటి విస్తరణ కూడా బాగా* జరుగుతుంది. *తరువాతి తరాలకు కూడా అది అందుతుంది* .


 *లక్ష్మీదేవి అనుగ్రహానికి ప్రతీక. సర్వ సంపదలకు నిలయం. మన చుట్టూ, మనలోని రూపసహిత, రూపరహిత వ్యవహారాలకు మూలం.* 


అందుకే, *కమలంలో కొలువై వుండే మహాలక్ష్మీ దేవిని ఆరాధిస్తే అందరికీ సంపదలు సమూలకంగా* లభిస్తాయి. *భావాలకు వికాసం కలుగుతుంది. విజ్ఞానం వృద్ధి చెందుతుంది. వ్యవహారాల్లో విజయం* కలుగుతుంది.


 *దీపావళి వేళ ఇటువంటి జపాలకు విశేషమైన గుర్తింపు* ఉంటుంది. *నిరంతరం ఈ జపాలను చేయడం వల్ల భౌతిక, దైవిక, ఆత్మిక సంపదలన్నీ ఇంటిముందు కొలువు* తీరుతాయి.


 అందుకే ‘ *ఓం శ్రీ కమల వాసిన్యై నమః* ’ జపాన్ని ప్రతి రోజూ కనీసం ఒక గంటసేపు చేయండి.


 *కమలంలో కొలువైన మహాలక్ష్మీదేవి పటం ఎదురుగా పెట్టుకుని, దీపాన్ని వెలిగించి ఆరాధనలో నిమగ్నం* అవాలి.


 అప్పుడు *సర్వ సంపదలతో హాయిగా ఆనందంగా గడిపే భాగ్యం* లభిస్తుంది.


*✍ సాగి కమలాకర శర్మ*

కామెంట్‌లు లేవు: