**దశిక రాము**
*శ్రీ విఘ్నేశ్వర విశిష్టత*
( 12 వ భాగం)
గజాసురుడు కూడా తన్మయుడై వారితో కలసి శివభజన సాగించాడు. శివలింగం ఉబ్బి అలాఅలా పెరిగిపోతూ గజాసురుడిని చీల్చి వేసింది. శివుడు ఇవతల పడ్డాడు. గజాసురుడు కన్నుమూస్తూ, "నిన్ను నమ్ముకుంటే ఇలా చేశావేమిటి!" అని శివుణ్ణి నిందించగా." గజా! శివభక్తికి తార్కాణంగా కలకాలం నీ పేరు నిలిచేలాగా ఏనుగు తల నాకు సన్నిహితంగా ఉంటుంది. గజచర్మాన్ని కట్టుకుంటాను," అని శివుడు చెబుతూ గజాసురుడిని తనలోకి తీసుకుని కైవల్యాన్ని ప్రసాదించాడు
శివుడు భూమిని రధంగా, సూర్యచుండ్రుల్ని రధచక్రాలుగా, వేదాలు గుర్రాలుగా, బ్రహ్మసారధిగా, మేరుపర్వతాన్ని ధనుస్సుగా, విష్ణువును బాణంగా సమకూర్చుకొని, తన అనుచరులైన నండీ,శృంగీ,భృంగి మొదలైన ప్రమథగణాలను వెంట వేసుకొని, ముక్కోటి దేవతలు వారివారి దేవేరులతో సహా వెనుకరాగా,భయంకరులైన త్రిపురాసులపై యూద్ధానికి వెళ్ళాడు.
ఇంట్లో ఒంటరి పార్వతికి కాలం బరువుగా గడుస్తున్నడి, శివుడు నిన్ను పెళ్లాడినప్పట్నుంచీ తారకాసురుడు తల్లడిల్లిపోతూ పిడకలలుకంటున్నాడు. నీకు ఎలాంటి హాని తలపడతాడో ఏమో, వాడికి వజ్రదంతుడు తోడై ఉన్నాడు.వజ్రదంతుడు బహుమాయావి! అందువల్ల నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా!" అని హెచ్చరించి వెళ్ళాడు.
పార్వతికి మరింత చిరాకు, దిగులు కూడా కలిగాయి. చక్కగా తలంటుస్నానం చేస్తే చిరాకు తగ్గి బాగుంటుందనిపించింది.
పార్వతి నలుగుపెట్టుకుని, ఆ నలుగు ముద్ద కూడదీసి, ఆ ముద్దతో ఒక బొమ్మవేసి ముచ్చటగా చూసుకుని అలా కిందపెట్టి అటు తిరిగి ఇటు చూసేసరికి బొమ్మకు మారుగా ముద్దులుమూటగట్టే బాలుడు కనిపించాడు. "ఎవరబ్బా, నీవు?" అని పార్వతి అడిగింది ఆశ్చర్యంగా.
"నీ కాంతిని పుణికి పుచ్చుకుని రాలిన నలుగుముద్దనే కడుతమ్మా! నీ పుత్రుణ్ణి, పుత్రగణపతిని!" అన్నాడు బాలుడు అందంగా నవ్వుతు.
పార్వతి బాలుణ్ణి అక్కున చేర్చుకుని ముద్దాడి, ఒక అంకుశం,గదాదండాన్ని అతని చేతికిచ్చి, " నాయనా! ఎవ్వరినీ, పురుగునైనా లోపలికి రానీయకు," అని చెప్పి సింహద్వారం దగ్గిర కాపలా ఉంచింది.
" అమ్మా! తినడానికేమైనా పెట్టవూ" అని అడిగాడు కుర్రవాడు.
అప్పటికప్పుడు పిండి కలపి చలిమిడి ముద్దనూ, కుడుములూ, ఉండ్రాళ్ళూనూ చేసిఇచ్చి పార్వతి స్నానానికి భవనం లోపలకి వెళ్ళింది.
🙏🙏🙏
సేకరణ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి