కవితాకన్యక వరించేదెవరిని?
" నైనం వ్యాకరణజ్ఙమేతి పితరమ్ !
నభ్రాతరం ఛాందసమ్/
మీమాంసానిపుణం నపుంసక ఇతి,జ్ఙాత్వా నిరస్తాదరాత్/
"కావ్యాలంకరణజ్ఙమేవ, కవితాకన్యా వృణీతే స్వయమ్ "//
ఒక కవిగారు కష్టపడి ఒకకావ్యంవ్రాశారు.ఆకావ్యకన్యకు (కావ్యాన్ని కన్యగా పోల్చుట కవిసమయం) తగిన వరుని నిర్ణయించగోరి నలుగురు వరులను రప్పించారు. వారు వరుసగా-
1 వ్యాకరణవేత్త.
2వేదవేత్త.
3 తర్కశాస్త్ర పండితుడు
4కావ్య,అలంకారాదులపరిచయముగలవాడు.
ఈనలుగురిలో నొకనివరింపుమని కవితాకన్యనుగోర ఆమె మొదటి ముగ్గురను కాదని నాల్గవవానినే వరించినది.కారణమేమో? చూతము.
1"నైనం వ్యాకరణజ్ఙమేతిపితరమ్."-వ్యాకరణవేత్తను తండ్రివరుసయగుననితిరస్కరించినదట.!
2 వేదవేత్తసోదరుడగునని వలదన్నదట!
3తర్కశాస్త్రప్రవీణునిజూచి వీడా! తృతీయప్రకృతి(నపుంసకుడు)వలదన్నదట! వ్యర్ధవాగ్వాదమేగాని పనిశూన్యమని యామెయాంతర్యము.
4 ఇకమిగిలిన వాడు వివిధకావ్యములనెరింగినవాడు.అలంకారశాస్త్రవేత్త,రసజ్ఙుడు కావున అతనిని స్వయముగా వరించినదట!
ఈవిషయాన్నే తిరుపతివేంకట కవులు చమత్కారంగా-
"ఎందరిజూపెనేని వరియింపదు 'మాకవితాకుమారి' క /
న్నందుకుదేశముల్ తిరుగుటబ్బెను సౌఖ్యములేకపోయె,నా /
నందనృపాల! నీదుసుగుణంబులనేగనిదెల్పినంత, వెం /
టందలయూచె;ఁగావున దటాలునదీనిపరిగ్రహింపుమా!
(నానారాజ సందర్శనం-తిరుపతికవులు) అన్నారట!
చూచితిరా కావ్యకన్యనిర్ణయము."చదువుతోబాటురసజ్ఙత అత్యవసరము.అప్పుడే చదివినదానికి సార్ధకత!సౌందర్యమునారాధించుటకు కళాహృదయముండవలెను.అట్లే సాహిత్యము నారాధించుటకు సరసుడై యుండవలెను.లేకున్నకావ్యరసాస్వాదనము.గగన కుసుమమే!!
స్వస్తి!💐🌷🌷🌷🙏🙏💄🌷👍💐🌷🌷🌷🌷🌷🌷💐🌷🌷🌷
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి