28, జనవరి 2026, బుధవారం

భోజన పధ్ధతి:*

  281f8;

🍀🌺🍀🌺🍀🩺🍀🌺🍀🌺🍀🍇M.A.165.

*మన ఆరోగ్యం…!


*వాగ్బాటాచార్యుల వారు వివరించిన భోజన పధ్ధతి:*

               ➖➖➖✍️

   

```

ఆయుర్వేద చరిత్రలో వాగ్బాటాచార్యుల వారికి చాలా గొప్పస్థానం ఉన్నది. ఆయన రాసినటువంటి “అష్టాంగహృదయం” అనే గ్రంథం చాలా ప్రాచుర్యం పొందింది. 


వారు తెలియచేసిన భోజనపద్ధతి గురించి మీకు వివరిస్తాను..

       

మనం తీసుకునే ఏ పదార్థం అయినా మోతాదుగా భుజించవలెను. 

ఈ మోతాదు జఠరాగ్నిని దీపనం చెందించును. 


తినగలిగినతలో గట్టిగా ఉండు పదార్దాలను సగమే తినవలెను. లఘుపదార్థాలను కడుపునిండా ఇక తినలేము అన్నంత అధికంగా తినకూడదు. 

అనగా మూడు వంతులు తిని కడుపులో ఒక వంతు ఖాళీగా ఉంచవలెను. 


మోతాదుకు తక్కువుగా భుజించకూడదు. దానివల్ల శరీరం యొక్క బలము, ఓజస్సు, పుష్టి నశించును. సకల వాతవ్యాధులు సంభవించును.

             

మన శరీరానికి అవసరం అయిన దానికంటే అతి తక్కువ మోతాదులో ఆహారాన్ని భుజించుచున్న వాత, పిత్తాలను ప్రకోపింపచేయును. 


దీనివలన త్వరగా అలిసిపోయి నీరసం వచ్చుట, బలహీనత వంటి సమస్యలు వచ్చును. ఒక్కోసారి అవి ప్రాణాంతకం కావోచ్చు. 


పదార్ధాలను అధికంగా భుజించటం ఒక్కటే దోషం కాదు. ఇష్టం లేని పదార్దాలు భుజించటం, కడుపుబ్బరం కలిగించునవి, సరిగ్గా పక్వము కానివి, గట్టిగా ఉండి అరుగుటకు బాగా సమయం తీసుకొనునవి, బాగా కారంగా ఉండునవి, చల్లబడిపోయినవి, అశుచిగా ఉండునవి, దాహాన్ని అధికము చేయునవి, ఆరిపోయి గట్టిగా అయినవి, నీళ్లలో ఉన్నవి, మొదలయిన పదార్దాలు కూడా జీర్ణం కావు. 


శోకం, కోపం, భయం చెంది ఉన్నప్పుడు తినిన ఆ పదార్దాలు కూడా జీర్ణం అవ్వవు.

              

భోజనం తరువాత అది పూర్తిగా అరగక పూర్వం మరలా భుజించకూడదు. 


సమయం కాని సమయంలో కొంచం కాని ఎక్కువ కాని భుజించరాదు. 


మలమూత్రములు సంపూర్ణంగా బయటకి వెడలిన తరువాత హృదయం నిర్మలమైనప్పుడు, 

వాత, పిత్త, కఫాలు స్వస్థానం నందు ఉన్నప్పుడు, త్రేన్పులు లేనప్పుడు, బాగుగా ఆకలి అవ్వుచున్నప్పుడు, జఠరాగ్ని పదార్దాలను జీర్ణం చేయు సమర్ధం అయి ఉన్నప్పుడు, శరీరం తేలికగా ఉన్నప్పుడు మాత్రమే భుజించవలెను.

                  భోజనకాలమున స్నానం చేసి శుచి అయ్యి, ఏకాంతంగా కూర్చుని పితృదేవతలు, బాలురు, అతిధులు వీరిని తృప్తులు కావించి తాను పెంచుతున్న పశుపక్ష్యాదులకు ఆహారం అందించి మనఃశుద్ధి కలిగి, ఎవరిని నిందించకుండా, మాట్లాడకుండా తనకు హితమైనది, తనయందు భక్తి కలిగినవారు పెట్టినది అయిన ఆహారంను భుజించవలెను.

          

ఉదరమును నాలుగు భాగాలుగా విభజించి రెండు భాగములను ఆహారపదార్థాల చేత, ఒక భాగం ఉదకాది ద్రవపదార్థాల చేత నిండింపవలెను. 

నాలుగో భాగం వాయుప్రసారానికి అనువుగా ఖాళీగా ఉంచవలెను. 


భోజనం అయిన వెంటనే చదువుట, నడుచుట, పడుకోవడం, ఎండలో ఉండటం, అగ్నికి సమీపాన ఉండటం, వాహనములు ఎక్కుట, ఈదుట, ఎగిరి దాటుట మున్నగునవి చేయకూడదు.       

    

పైన చెప్పిన నియమాలు ప్రతి ఒక్కరు పాటించినచో మంచి ఆరోగ్యవంతులు అవుతారు.


ఆయుర్వేదం నందు ఒక సామెత ఉంది. “ఏకకాల భోజనే మహాయోగి, ద్వికాల భోజనే మహాభోగి, త్రికాల భోజనే మహా రోగి” అని. 


దీనినిబట్టి చూడవచ్చు ఆయుర్వేదం మనం తీసుకునే ఆహారానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో. 


ప్రతిఒక్కరు నియమిత సమయంలో నియమిత ఆహారాన్ని తీసుకోవడం వలన సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండవచ్చు.✍️```

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                    🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.

          ➖▪️➖

కామెంట్‌లు లేవు: