🔥🔥🔥💥💥👑👑🥲🥲👩🦰👩🦰👳♀️👳♀️💐
రావు ఒక వాట్సాప్ గ్రూపులో సభ్యుడు. ఆ గ్రూపులో ఎవరు మెసేజస్ పెట్టినా ఖచ్చితంగా చదివి చక్కగా స్పందించి మంచి రిప్లై కామెంట్స్ పెడుతూంటారు. అలాంటి ---రావు గారు ఒకరోజు హఠాత్తుగా గ్రూపు నుండి లెఫ్ట్ అయ్యారు. అంతేగాక స్నేహితులతో అప్పుడప్పడూ సరదాగా కలవడానికి కూడా రావటం లేదు..
కొన్ని వారాలయ్యాక ఒకరోజు సాయంత్రం గ్రూప్ అడ్మిన్ .. లెఫ్ట్ అయిన రావు గారి ఇంటికి వెళ్ళేసరికి, ....
బాగా చలిగా ఉండటం వలన కొన్ని కర్ర దుంగలను కాల్చి ఆ మంట పక్కన చలి కాగుతూ ఒంటరిగా కూర్చున్నాడు రావు గారు.
అడ్మిన్ ను చూసి విష్ చేసి, మరేమీ మాట్లాడకుండా మిన్నకుండి పోయాడు...
ఇద్దరి మధ్య మౌనం రాజ్యమేలింది.. కాలుతూ
నాట్యం చేస్తున్న జ్వాలను చూస్తున్నారు... ఇద్దరూ..
మధ్యలో అడ్మిన్ లేచి బాగా కాలుతున్న కర్ర దుంగను పక్కకు లాగేసి మరల కుర్చీలో కూర్చున్నాడు..
జరిగే దానినంతా నిశితంగా చూస్తున్నాడు ---రావు
అలా బాగా కాలుతున్నప్పుడు పక్కకు లాగిన ఆ ఒంటరి దుంగ, క్రమేపీ మంట ఆరి చల్లబడి నల్లని బొగ్గుగా మారింది...
తిరిగి చచ్చుబడి, చల్లబడిన దుంగను కాలుతున్న మంటల్లో వేసాడు అడ్మిన్.
అది తిరిగి కాలుతున్న దుంగలతో కలసి మండి వేడిని కాంతిని ఇచ్చింది.
*అడ్మిన్ తిరిగి వెళ్ళడానికి కుర్చీలోంచి లేచాడు... అప్పుడు ---రావు అతని దగ్గరకు వెళ్ళి, "ఇంటికి వచ్చి నందుకు, మనసుకు హత్తుకునే పాఠం చెప్పినందుకు ధాంక్యూ.రేపటి నుండి మన మీటింగులకు వస్తాను. తిరిగి మన వాట్సాప్ గ్రూపులో నన్ను ఏడ్ చెయ్ అన్నాడు..*
అసలు వాట్సాప్ గ్రూపు ఎందుకంటే ప్రతి మెంబరు మిగిలినవారి నుండి జ్వాల, వేడిని ( fire & heat ) పొంది ఉత్తేజాన్ని పొందటానికి.. గ్రూపులోని వారందరూ వేడి తగ్గకుండా ఏక్టివ్ గా ఉండాలి.. గ్రూపనేది ఒక కుటుంబం. ఏదో ఒక సమయంలో కొన్ని msgs, మాటల యుద్ధాలు, అపార్థాలు గ్రూపు సభ్యుల్ని బాధ పెట్టొచ్చు... గ్రూపనేది మనం కలవడానికి, ఆలోచనలు పంచుకోడానికి, మనం ఒంటరివాళ్ళం కాదని చెప్పడానికి...
*జీవితం నిజంగా ఎప్పుడు అందమైందని అనిపిస్తుందో తెలుసా! కుటుంబ సభ్యులు, మరియు స్నేహితులతో ఆత్మీయతతో కలిసి ఉన్నప్పుడు... ఇంకా మనలో హుషారు జ్వాలలు రగిలిస్తూ... స్నేహితులు, బంధువులూ.. అందరూ ఒకే కుటుంబంలా కలసి ఒకే గ్రూపులో అందరూ తమతమ అనుభవాలు, అభిప్రాయాలు పంచుకుంటూ ఉన్నప్పుడే!.... అందుకే అలాంటి గ్రూపు క్రియేటర్ కు, గ్రూపు సభ్యులకు థ్యాంక్స్ చెబుదాం!*
*(సేకరణ :Face Book నుండి)*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి