18, ఆగస్టు 2022, గురువారం

స్మ్రతి

 స్మ్రతి అనేది దేశకాల పరిస్థితులను బట్టి స్థానిక ప్రజలు ఏర్పాటుచేసుకొన్న ఆచారము కావచ్చు లేదా సాంప్రదాయం కావచ్చు. దీనినే ధర్మము అంటారు. మనకు అనేక స్మ్రతులున్నాయి, వీటినే ఆ ప్రాంతపు ధర్మ శాస్త్రమంటారు.


ఉదా॥ పరాశరస్మ్రతి, నారదస్మ్రతి, బృహస్పతిస్మృతి, దక్షస్మృతి, గౌతమస్మృతి, యమస్మృతి, అంగీరసస్మృతి, యాజ్ఞవల్క్యస్మృతి, ప్రచేతస్స్మృతి, శాతాతపస్మృతి, సంవర్తస్మృతి, ఔశనసస్మృతి, శంఖస్మృతి, లిఖితస్మృతి, ఆత్రేయస్స్మృతి, విష్ణుస్మృతి, ఆపస్తంబస్మృతి, హరీతస్మృతులు. 


ఇవన్ని  సమాజజీవితానికి నిర్దేశించబడినవే. ఇందులో వున్నదంతా ఉన్నది వున్నట్లుగా పాటించిన దాఖలాలు కాని, ఖచ్చితంగా పాటించాలన్న నియమ నిబంధనలు ఏమిలేవు. ఇష్టముంటే అనుకరించవచ్చు లేదంటే లేదు. ఒకే సమాజములో కొన్ని వర్గాలు తెగలు పాటించాయి, మరికొన్ని పాటించలేదని మనం గుర్తు చేసుకోవాలి.


ప్రయాణంలో ఓ ఎర్రచొక్కా సోదరుడు శూద్రులు వేదం వింటే సీసం కరిగించి చెవిలో పోయాలని వుంది కదా! దీనికేమంటావు నాతో అన్నాడు, నేనన్నాను అదే ధర్మశాస్త్రం జీవహింస చేయరాదు, అబద్దాలాడరాదు, దొంగతనం చేయరాదు, పరస్త్రీని గౌరవించాలని కూడా చెప్పింది కదా! నువ్వెపుడు కూడా అబద్దాలాడ లేదా, దొంగతనం చేయలేదా గుండెలమీద చేయి వేసుకొని చెప్పమన్నా అతగాడి సమాధానం నిశ్శబ్దము.


ఇంకొమాట అడిగా "అలా చెవులలో సీసం పోసినట్లుగా ఆధారాలు ఎక్కడన్నా వున్నాయా ? అని అతని దగ్గర

సమాధానం లేదు, నేనే చెప్పా మనసాహిత్యంలో, శాసనాలలో స్వదేశీవిదేశీ యాత్రికుల రచనలలో ఫలానా చోట ఫలానా వారికి జరిగిందని పేర్కొనలేదు, ఎక్కడా ఈ సంఘటన జరిగినట్లు రికార్డు కాలేదు, అలా ఎవరో ఎక్కడో ఎపుడో వ్రాసినంత మాత్రాన అమలైనాయని ఇపుడు ఏ ఆధారాలు లేకుండా మాట్లాడం భావ్యము కాదని తెలియచేశా !


 /సేకరణ/

.............................................. జి.బి.విశ్వనాథ.9441245857. అనంతపురము.

కామెంట్‌లు లేవు: