2, జనవరి 2021, శనివారం

ఋభుగీత" (226)*_

 _*"ఋభుగీత" (226)*_

🕉🌞🌎🌙🌟🚩


_*బ్రహ్మానందము"*_

_*16వ అధ్యాయము*_ 


_*ప్రవర్తన మారకపోతే నిజమైన ప్రయోజనం అందదు !*_


_*అశాంతికి కారణం సమాజ పోకడ. సమాజం అంటే వ్యక్తుల ప్రవర్తన. శాంతి కావాలంటే ప్రవర్తన మారాలి. అది మన నుండే మొదలవ్వాలి. భక్తి, పూజలు, పుణ్యకార్యాలు మనం భౌతికంగా బాగుంటానికి మాత్రమేకాదు, మానసికంగా బాగుపడటానికి కూడా. దేవుళ్ళు, గురువుల చుట్టూ తిరిగితే తనకు కలిసి వస్తుందనుకున్నంత కాలం గురువు, దైవంల నుండి రావాల్సింది రాదు. ధనం, సుఖం, కీర్తి, హోదా వంటి బయటదొరికే ప్రయోజనాలు, లాభాలకోసం గురువులను ఆశ్రయించడం అల్పత్వం అవుతుంది. తనపబ్బం గడుపుకోడానికి ఒక గుర్తింపుకోసం కోతిని వెంటేసుకొని ఆడించినట్లే మనిషి దైవాన్ని, మతాన్ని, గురువును మెడలో వేసుకున్నంతకాలం వాటి నిజమైన ప్రయోజనం అందదు !*_


🕉🌞🌎🌙🌟🚩

కామెంట్‌లు లేవు: