29, డిసెంబర్ 2020, మంగళవారం

ధార్మికగీత - 124*

 🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲  


                            *ధార్మికగీత  -  124*

                                      *****  

            *శ్లో:- దుర్లభం త్రయ మే వై తత్ ౹*

                   *దేవానుగ్రహ హేతుకమ్ ౹*

                   *మనుష్యత్వం ముముక్షత్వం ౹*

                   *మహాపురుష సంశ్రయమ్ ౹౹*

                                    *****

*భా:- దేవుని యొక్క అను గ్రహానికి పాత్రుడు అవ్వాలంటే లోకంలో మూడే మూడుకారణ మవు తున్నాయి.* *1. "మనుష్యత్వం":-  ప్రతి  మనిషిలో కామ,క్రోధ,లోభ, మోహ, మద, మాత్సర్యాలు, ఆష్టవిధ మదాలు*, *తాపత్రయాల మాలిన్యము  పశుత్వ లక్షణాలతో ప్రస్ఫుట మౌతుంది. దానిని పూర్తిగా*  *నిర్మూలనము చేసికొని, మానవత్వ* *పరిమళాలను గుబాళింప జేసుకోవాలి.  అదే మనుష్యత్వము*. *2."ముముక్షత్వము":- మోక్షము కావాలనే కోరిక ప్రబలంగా ఉన్నవారు మానవతా విలువలతో నడుచుకుంటూ, దేహాభిమానాన్ని, అహంకార మమకారాలను , విషయ- వాసనలను వదిలి, ఇంద్రియ నిగ్రహంతో, వైరాగ్య భావంతో ఆత్మ సాక్షాత్కారానికై  చేసే నిరంతర కఠోర సాధనా ప్రక్రియ ముముక్షత్వము. 3. "మహా పురుష సంశ్రయము":- పైన చెప్పబడిన మానవత్వ, మోక్షాపేక్షల సాధనకై జ్ఞాన సంపన్నులైన మహాత్ములను గాని, సద్గురువులను గాని ఆశ్రయించి, వారిని దీక్షా దక్షతలు, శ్రద్ధా సక్తులు, భక్తి ప్రపత్తులతో వివిధ  శుశ్రూషలు చేసి,  ఆత్మజ్ఞాన సముపార్జనము చేయాలి. ఈ మూడింటిని శ్రద్ధాళువై, చిత్తశుద్ధితో, ఏకా గ్రతతతో, నిష్ఠతో  సాధించిన నాడు దైవ సాక్షాత్కారం తప్పక లభించ గలదని సారాంశము*.

                                  *****

                   *సమర్పణ  :   పీసపాటి*

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

కామెంట్‌లు లేవు: