5, అక్టోబర్ 2020, సోమవారం

“శ్రీ” కారం

 శ్రీ 🌹🌹


ఏదైనా రాసేటప్పుడు పేపరుపైన “శ్రీ” కారం రాస్తారెందుకు?

“శ్రీ” లక్ష్మీ ప్రదమైనది. మంగళకరమైనది మరియు మోక్ష దాయకమైనది. “శ్రీ” కారమున “శవర్ణ”, “రేఫ”, “ఈ” కారములు చేరి, “శ్రీ” అయినది. అందు “శవర్ణ” , “ఈ” కారములకు, “లక్ష్మీ దేవి” ఆధిదేవత, “రేపము” నకు, అగ్ని దేవుడు దేవత.


“శ్రియ మిచ్దేద్దు తాశనాత్!” అను పురాణ వచనానుసారముగా “అగ్నీ లక్ష్మీ ప్రదుడే, శుభకరుడే. ఈ ఇధంగా “శ్రీ” లోగ మూడు వర్ణములకు శుభదేవతలే కారకులు.


మరియు, “శ” వర్ణమునకు గ్రహము “గురుడు”, “రేఫ “ఈ” కరములకు గ్రహములు “గురుడు”, “శుక్రుడు” గురు, శుక్ర గ్రహములు రెండూ శుభకరులే కావున “శ్రీ” శుభాన్ని సూచిస్తుంది. శుభాన్ని కోరుతుంది.


నిఘంటువులో, “కమలా శ్రీర్హరి ప్రియా” అని ఉండటంతో, లక్ష్మీ నామలలో “శ్రీ” ఒకటి అని తెలియుచున్నది. కావున శుభకరమైంది.


ఇన్ని విధాలుగా “శ్రీ” సర్వశ్రేష్టవాచకమైనది. ప్రతి శుభకార్యానికి, “శ్రీ” కారం తలమానికమై వెలుగొందుచున్నది. “శ్రీ” శుభసూచికయేకాదు, గౌరవప్రదమైనది కూడా. ఏ ప్రాంతమందైననూ, ఏ భాషయందైననూ, “శ్రీ” అను పదము గౌరవ సూచకముగా, శుభసూచకముగా వాడుతుంటారు.

🙏🙏

కామెంట్‌లు లేవు: