*శ్లో :- యత్ర నార్యస్తు పూజ్యంతే ౹*
*రమంతే తత్ర దేవతాః ౹*
*య త్రైతా స్తు న పూజ్యంతే ౹*
*సర్వా తత్రా౽ఫలాః క్రియా: ౹౹*
*****
*భా:- ఎక్కడైతే స్త్రీలు సముచితముగా, సాదరముగా గౌరవింప బడతారో, అక్కడ దేవతలు ఆనందంతో పరవశించి పోతారు. అనుగ్రహిస్తారు. ఎక్కడైతే స్త్రీలు అడు గడుగునా అమర్యాదకు గురియై, నిరాదరణకు గురి అవుతుంటారో, అక్కడ తలపెట్టిన పనులు ఫలవంతము కాజాలవు అని స్థూలార్థము. పూజా సమయాలలో లక్ష్మీ నారాయణులకు, సీతా రాములకు, ఉమా మహేశ్వరులకు ఆహ్వానం పలికి, ఆతిధ్య స్థానమిచ్చి, గౌరవించడం సాంప్రదాయం. "బ్రహ్మ"- లోకాల సృష్టికి, ఆందునను "స్త్రీమూర్తి"- మానవ సృజనకు కారకులు కావడం విశేషం. నేడు విద్యా, వైద్య, ఆర్థిక, వైజ్ఞానిక, శాస్త్రీయ,అంతరిక్ష, రక్షణ, రాజకీయ రంగాలలో స్త్రీలు ముందంజలో పురోగమించడం మనం గమనిస్తున్నాము. స్త్రీలకు అనుకూలమైతే ప్రతికూలత అనేది లేకుండా సంసారమైనా, సమాజమైనా సజావుగా ముందుకు సాగుతుంది. స్త్రీని చెరబట్టి రావణుడు; అవమానించి సుయోధనుడు; బలాత్కరించి కీచకుడు సాధించిందేమిటి? కలకంఠి కన్నీరు పెడితే సిరులు నిలబడవు. భార్య తోడు లేనిదే యే శుభకార్యం చేయడానికి అర్హత లేదు. స్త్రీలను గారవిస్తే తథాస్తు దేవతలు కూడా మనలను ఆశీర్వదిస్తారు. సర్వ శుభాలు జరుగుతాయి. "ముదితల్ నేర్వగ రాని విద్య కలదే ? ముద్దార నేర్పించినన్ " అని కవిజగద్గురువు - జగన్మాత
గ్రీసు దేశం రాజమాత(మహారాణి) కుమార్తె ఇపుడు స్పెయిన్ దేశపు మహారాణి. ఆమె పేరు సోఫియా. ఆమె తల్లికి మల్లే ఈమెకు కూడా కంచి పరమాచార్య స్వామివారిపై అపరిమిత భక్తి. మన మహాస్వామి వారిని వారి గురువుగా భావించి మొత్తం రాజకుటుంబం స్వామివారికి శరణాగతులు అయ్యారు. స్వామివారు సతారాలోని ఉత్తర చిదంబరంలో కొన్ని నెలలు మకాం చేసినప్పుడు మహారాణి సోఫియా స్వామివారి దర్శనార్థం నాలుగు రోజులు అక్కడే ఉండిపోయింది. కొన్ని సంవత్సరాల తరువాత ఒక నాట్యప్రదర్శన కోసం మేము స్పెయిన్ వెళ్లినప్పుడు మహారాణి సోఫియా మమ్మల్ని తన రాజభవనానికి పిలిపించింది. ఎంతో ప్రేమతో, మర్యాదతో మమ్మల్ని ఆదరించిన తీరు అబ్బురపరచింది
“ఒక దేశపు మహారాణి, కనీసం జతగా స్నానాల గది కూడా లేని ఒక చిన్న హోటలు గదిలో ఎలా ఉండగలిగింది?” అని నేను ఆమెను అడిగా
“కాంచి మహాస్వామి వారి దర్శనం కోసం మేము ఒక చిన్న గుడిసెలోనైనా ఆనందంగా ఉండగలం. వీధుల్లో నడవగలను. స్వామివారి దర్శనం దొరికిన రోజే మేము జీవించిన రోజుగా లెక్క. ఇతర సమయాలలో ఏదో అలా ఊపిరి తీసుకుంటాను అంతే. ఈ వైభవం అంతా శాశ్వతం కాదు. వారి దర్శనం చేసుకోగలుగుతున్న ఆనందం మాత్రమే నిజమైనది మరియు నిత్యమైనది” అని ఎంతో భక్తితో చెప్పారు
ఆ క్షణం స్వామివారిని జగద్గురువు అనడం కంటే జగన్మాత అనడం సబబేమో అనిపించింది నా
--- డా. పద్మా సుబ్రమణ్యం, “నృత్యోదయ” చెన్నై. మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్
అపారకరుణా సింధుం జ్ఞానదం శాంత రూపిణ
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం।మ్ 2కు..ను.. ప్రశంస. మానవజాతి అభివృద్ధికి, అభ్యున్నతికి, పురోగతికి, పురోభివృద్ధికి నారీమణియే కారకమని గుర్తించి వర్తించాలని సారాంశము.*
*****
*సమర్పణ : పీసపాటి*
🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి