*****
*శ్లో:- జీర్యంతే జీర్యతః కేశా: ౹*
*దంతాః జీర్యంతి జీర్యతః ౹*
*జీర్యతః చక్షుషీ శ్రోత్రే ౹*
*తృష్ణా ఏకా తరుణాయతే౹౹*
ఎల్ల శరీరముల్ శిథిల
మేర్పడి జీర్ణమునొంద , నంతటన్
తెల్లగమారు కేశములు ,
తీక్షణదృష్టియు సన్నగిల్లెడున్ ,
మెల్లగ తగ్గు విన్కిడియు ,
మేలిమి దంతము లెల్ల రాలెడున్ ,
చల్లగ జేరి రుగ్మతలు
సత్వము తగ్గును , నివ్విధంబు ని
వ్వెల్లయు గూడినన్ , నరుని
వీడదు తృష్ణయు పెంపు పొందుచున్
✍️ గోపాలుని మధుసూదన రావు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి