📚📚📚📚📚📚📚📚📚
మనదేశ వ్యాప్తంగా ప్రతి ఏటా సెప్టెంబర్ 5 వ తేదీన మన దేశంలో ఉపాధ్యాయుల దినోత్సవాన్ని జరుపుకుంటారు.
ఆ రోజున ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానిస్తారు. అలాగే మనకు చదువు చెప్పిన గురువులను కూడా గుర్తు చేసుకుంటారు.
*ప్రపంచ వ్యాప్తంగా ఉపాధ్యాయుల దినోత్సవాన్ని అక్టోబర్ 5వ తేదీన జరుపుకుంటారు.* మొదటి సారిగా దీన్ని 1994లో ప్రారంభించారు. యునెస్కోతోపాటు ఎడ్యుకేషన్ ఇంటర్నేషనల్ అనే సంస్థతో కలిసి వరల్డ్ టీచర్స్ డేను నిర్వహిస్తున్నాయి. సమాజంలో టీచర్ల పాత్రను ప్రజలకు తెలియజేసేందుకు , టీచర్లు విద్యార్థులకు నాణ్యమైన విద్యను బోధించేలా వారిలో అవగాహన కల్పించేందుకు గాను ప్రతి ఏటా *అంతర్జాతీయంగా అక్టోబర్ 5 వ తేదీన ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు.*
*చరిత్ర:*
భారత రత్న , భారతదేశ తొలి ఉప రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. ఆయన పుట్టిన రోజైన సెప్టెంబర్ 5 ను ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం. రాధాకృష్ణన్1888లో తిరుత్తనిలో జన్మించారు. కేంద్ర ప్రభుత్వం రాధాకృష్ణన్‌పుట్టిన రోజును 1962 నుంచి ఉపాధ్యాయ దినోత్సవంగా పరిగణించి గౌరవిస్తోంది.
ఎంఎన్‌రాయ్‌మాటల్లో చెబితే భారతదేశంలో ఆనాడు ఉన్న మత , ఆధ్యాత్మిక పునరుద్ధరణ వాదాన్ని అకడమిక్‌తాత్విక స్థాయికి తీసుకువెళ్లిన గొప్ప పండితుడు సర్వేపల్లి. ఆయన 15 సార్లు నోబెల్‌సాహిత్య బహుమతికి , 11 సార్లు నోబెల్‌శాంతి బహుమతికి నామినేట్‌అయ్యారు.
మహాభారత కాలం నుంచి శ్రీకృష్ణ పరమాత్మ , అర్జునుడిని సిసలైన గురుశిష్య సంబంధానికి ప్రతీకలుగా కొలుస్తున్నాం. సర్వేపల్లి తనకు కృష్ణుడితో సమానమని జాతిపిత మహాత్మా గాంధీ కీర్తించారు. ‘మీరు నా కృష్ణుడు , నేను అర్జునుడిని’ అన్నారు గాంధీజీ. ‘మీరు నా ఉపాధ్యాయుడు’ అని కీర్తించారు పండిట్‌నెహ్రూ. బహుశా ఈ వ్యాఖ్యల నేపథ్యం నుంచే ఆయన పుట్టిన రోజును టీచర్స్ డేగా నిర్వహించాలనే ఆలోచన వచ్చిందేమో !
*‘యుగపురుషుల గురించి ఉపన్యాసం ఇవ్వండని పిలిస్తే , యుగపురుషుడే వచ్చి ఉపన్యసించారు’* అని కొనియాడారు హోవెల్. *‘నాలో మామూలు మనిషిని దర్శించిన మహర్షి’* అని కీర్తించారు సోవియట్ అధినేత స్టాలిన్. అలాంటి గీతాచార్యుడు , ప్రబోధకుడు , యుగపురుషుడు , జ్ఞాన మహర్షి మన సర్వేపల్లి రాధాకృష్ణన్. గురువులకే గురువు ఆయన. అందుకే ఆయన పుట్టిన రోజు *‘ఉపాధ్యాయ దినోత్సవం’* అయింది.
అయితే భారత్‌లో సెప్టెంబర్ 5వ తేదీన టీచర్స్ డే జరిగితే అందుకు సరిగ్గా నెలరోజుల్లోనే ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం జరగడం విశేషం. ఇక ప్రతి ఏడాది యునెస్కో ఓ కొత్త కాన్సెప్టుతో వరల్డ్ టీచర్స్ డేను నిర్వహిస్తూ వస్తోంది. అందులో భాగంగానే గత ఏడాది ”The right to education means the right to a qualified teacher” అనే థీమ్‌తో యునెస్కో వరల్డ్ టీచర్స్ డే ను నిర్వహించింది. ఇక ఈ డేను ఆ రోజున ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సుమారుగా 100 కు పైగా దేశాల్లో జరుపుకుంటారు. కానీ *ఇండియాలో మాత్రం సెప్టెంబర్ 5 వ తేదీనే ఈ దినోత్సవం జరుగుతుంది.*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి