శ్లోకం:☝️
*యావన్నాశ్రయతే దుఃఖం*
*యావన్నాయాంతి చాపదః*
*యావన్నేంద్రియవైకల్యం*
*తవచ్ఛ్రేయస్సమభ్యసేత్ |*
*యావత్తిష్ఠతిదేహోఽయం*
*తావత్తత్వం సమభ్యసేత్*
*సందీప్తేకోణభవనే*
*కూపం ఖనతి దుర్మతిః ||*
భావం: మానవునికి ఎంతవరకు దుఃఖం ప్రాప్తించదో, ఎంతవరకు ఆపద దాపురించదో, ఎంతవరకు అంగవైకల్యం రాదో, ఎంతదాక వృద్ధాప్యం చేరువ కాదో అంతవరకు మాత్రమే తన శ్రేయస్సు తాను చూసుకోగలడు. యవ్వనమంతా కండ్లకు పొరలు కమ్మినట్లు బ్రతికి వ్యర్థం చేసుకొని, చివరి క్షణంలో శ్రీహరిని తలుచుకుంటే మోక్షం వస్తుందిలే అనుకుంటే పొరపాటే. అట్లా జరుగదు. ఇల్లు కాలిపోతుంటే ఆర్పటానికి నీళ్లకోసం బావి తవ్వుతాననే తెలివితక్కువ వాడిని ఏమి అనగలం?
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి