15, సెప్టెంబర్ 2022, గురువారం

నేనుస్మార్ట్ ఫోన్ అవ్వాలని

 రాత్రి భోజనాల తర్వాత ఒకటీచర్ ఆమె విద్యార్థులు రాసిన వ్యాసరచన పేపర్లను దిద్దడం ప్రారంభించింది. 


ఆమె పిల్లలు పడుకున్నారు!


భర్త కుర్చీలో కూర్చొని తన స్మార్ట్ ఫోన్లో 'క్యాండీ క్రష్'లో లీనమైయున్నాడు.


చివరి పేపర్ దిద్దాడానికి తీసి చదివిన ఆ టీచర్ నిశ్శబ్దంగా ఏడుస్తూ ఉంది.


ఆ  ఏడుపు వెక్కిళ్ళ శబ్దానికి భర్త తలతిప్పి చూసి ఆశ్చర్యపోయాడు!


"ఏమైంది? ఎందుకు  ఏడుస్తున్నావు? ఏం జరిగింది?" అడిగాడతను టెన్షన్తో.


 నిన్న నా సెకండ్ క్లాస్  విద్యార్థులకు హోంవర్క్ ఇచ్చాను. "మీరు ఏం కావాలనుకుంటున్నారు" అనే అంశంపై ఏదైనా రాసుకుని రమ్మని.


"అయితే...?"


"ఇదిగో! ఈ చివరి  పేపర్ దిద్దుదామని చదువుతుంటే ఏడుపును ఆపుకోవడం నా తరం కావడంలేదు!!"


భర్త ఆసక్తిగా...."అంత ఏడిపించే విధంగా ఏం రాశాడు?"


హెడ్డింగ్ ఇలా పెట్టాడు


💥నేనుస్మార్ట్ ఫోన్ అవ్వాలని నా కోరిక.💥


అమ్మానాన్నలు  స్మార్ట్ ఫోన్ ను చాలా ప్రేమిస్తారు!


వాళ్ళు స్మార్ట్ ఫోనును చాలా కేర్ గా... శ్రద్ధగా... ఇష్టంగా చూసుకుంటారు. నాకన్నా ఎక్కువగా...!!


నాన్న ఆఫీసు నుండి అలసటతో వచ్చినప్పుడు, అతనికి స్మార్ట్ ఫోన్ రిలాక్స్ ను ఇస్తుంది. నాన్నకి స్మార్ట్ ఫోన్ కోసం సమయముంది. కానీ, నా కోసం లేదు! ఎందుకంటే నాతో ఆడుకోవడం మా నాన్నకు రిలాక్స్ ను ఇవ్వడంలేదు!


అమ్మానాన్నలు ముఖ్యమైన పనుల్లో ఉన్నప్పుడు కూడా స్మార్ట్ ఫోన్ రింగౌతుంటే... ఒకటి రెండు రింగులు వచ్చేలోపే వాళ్ళు.. ఫోన్  చేతిలోకి తీసుకుని  జవాబిస్తారు!


కానీ... నేను ఎన్నిసార్లు పిలిచినా దానికిచ్చే ప్రిఫరెన్స్ నాకివ్వరు!!  ...

నేను  ఏడుస్తూ వుంటే కూడా వాళ్ళు నాతో కాకుండా స్మార్ట్ ఫోన్లతో గడుపుతుంటారు!


వాళ్ళు నాతో కన్నా స్మార్ట్ ఫోన్లతో ఆడు కోవడానికే ఎక్కువ ఇష్టపడుతారు!


వాళ్ళు తమ స్మార్ట్ ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు నేనేం చెప్పినా వినిపించుకోరు! 

అది నాకు ముఖ్యమైన విషయమైనా సరే!


అదే ఒకవేళ నాతో  మాట్లాడుతున్నప్పుడు రింగ్ వస్తే మాత్రం వెంటనే  ఫోన్ కి జవాబిస్తారు!


అమ్మానాన్నలు

స్మార్ట్ ఫోన్ని కేర్ గా చూసుకుంటారు!

ఎప్పుడూ తనతోనే ఉంచుకుంటారు!

దానికి చాలా ప్రాధాన్యతనిస్తారు!

దాన్ని చాలా ఇష్టపడుతారు!!

దానితో రిలాక్స్ అవుతుంటారు!!

దానికి తమ ఖాళీ సమయాన్ని కేటాయిస్తారు!!


దానిని ఎపుడు పనివాళ్ళకి అప్పగించరు


నేను ఒకరోజు మాట్లాడకపోయినా బాధపడరు కానీ స్మార్ట్ ఫోన్ ఒక్కగంట పనిచేయకపోతే చాలా కంగారుపడతారు హడావిడి చేస్తారు 


రాత్రి పడుకున్నప్పుడు కూడా ప్రక్కనే ఉంచుకుంటారు!!

ఉదయం లేవగానే దాన్నే  చేతిలోకి తీసుకుంటారు!!


కాబట్టి! నా కోరిక ఏమిటంటే... నేను అమ్మానాన్న  చేతిలో ఉండే స్మార్ట్ ఫోన్ కావాలనుకుంటున్నాను!! 


భార్య చదువుతుంటే... విన్న  భర్తకు మనసంతా పిండేసినట్లైంది!! అతని కళ్ళలో కూడా కొంచెం తడి వస్తుండగా...

"ఎవరు రాశారది? " అడిగాడు భార్యని.


"మన కొడుకు" అంది భార్య కన్నీరు కారుతుండగా!


వస్తువులను ఉపయోగించుకోవాలి!

బంధాలను ప్రేమించాలి!!


అన్ని బంధాలకన్నా ఎక్కువగా వస్తువులపై బంధాన్ని ఏర్పరచుకుని ప్రేమించడం మొదలుపెడుతూవుంటే... క్రమంగా అసలైన బంధాలు వెనక్కి నెట్టివేయబడతాయి!......


ఇది నిజంగా జరిగిన కథ.. 


కాబట్టి ఇలాంటి కథలో తల్లిదండ్రులు మీరు కాకండి ..🙏


🙏దయచేసి ప్రతిఒక్కరూ ఆలోచించండి 🙏


 *మీ గుండెను తాకితే ... మరికొన్ని గుండెలకు చేర్చండి ,,, కొంతమందైనా మారే అవకాశం కల్పించండి*

కామెంట్‌లు లేవు: