ఆజ్ఞ యొనె ర్చెడి వృత్తుల
లో జ్ఞానము కలిగి మెలగు లోకులు మెచ్చన్
బ్రాజ్ఞతను కలిగి యున్నన్
బ్రాజ్ఞులలో బ్రాజ్ఞుడవుగ ప్రభలు కుమారా!
తా:-- ఆజ్ఞాపించు పెద్ద పదవిలో వున్నప్పుడు జ్ఞానము కలిగి లోకము మెచ్చుకొనునట్లుల
మెలగుము. ప్రాజ్ఞతను కలిగి, ప్రాజ్ఞులలో ప్రాజ్ఞుడవై ఖ్యాతి పొందుము కుమారా!
తాలిమి తోడుతఁ0 దగవు దప్పక నేర్పరి యొప్పుదప్పులం
బాలన సేయగాకట నుపాయ విహీనుడు సేయనేర్చునే?
పాలను నీరు వేఱు పరుపంగ మరాళమెఱుంగు గాని మా
ర్జాల మెఱుంగునే తదురు చారురసజ్ఞత బూన భాస్కరా!
తా:-- పాలను నీటిని విడదీయుటకు రాయంచ సమర్థ మగునుగాని పిల్లి సమర్థ మైనది కాదు. అట్లే తప్పొప్పులను గమనించి మెలుగుటకు నేర్పుగలవాడే శక్తుడగును గాని నేర్పులేని వాడికి చేతకాదు.
ముష్టి వేప జెట్టు మొదలుగా బ్రజలకు
పరగ మూలికలకు పనికి వచ్చు
నిర్దయుండు ఖలుడు నీచుడెందుల కగు?
విశ్వదాభిరామవినురా వేమ!
తా: వేపచెట్టు మూలికలకు పనికి వస్తుంది, నిర్దయుడు,దుర్మార్గుడు, నీచుడైన వాడు
దేనికీ పనికి రాడు.
అప్రగల్భస్య యా విద్యా, కృపణస్య చ యత్ ధనం
యత్- చ బాహుబలం భీరో వ్యర్థ మేతత్ త్రయం భువి:
అర్థము:--బుద్ధి వికసించని, పరిణతి లేని వాడి , ఔదార్యం లేనివాడి ధనము, పిరికి వాడి యొక్క భుజబలము లోకం లో ఈ మూడూ వ్యర్థమైనవి. ఒకనాటికి మృత్యువు అందరినీ కబలిస్తుంది. మృత్యువు కు రాజు,పేద పండితులు, అపండితులు బలవంతులూ, బలహీనులూ అందరూ సమానమే. అందువలన మన వద్దనున్న ధనమును దానం చేసి సద్వినియోగము చేసుకోవాలని కవి భావన. ,
వృధా వృష్టి సముద్రేచ వృధా తృప్తే చ భోజనం
వృధా ధనపతౌ దానం లోభినాం యాచనే వృధా
అర్థము:-- సముద్రములో ఎంత వాన కరిసినను వృధా నే కదా! అలాగుననే కడుపు నిండిన వాడికి భోజనం పెట్టుట, ధనవంతులకు దాన మిచ్చుట, లోభిని యాచించుట వృధా. (నిష్ప్రయోజనము).కానీ లోకములో
ఉన్నవాడూ ఉన్నవాడికే యిస్తాడు, లేనివాడూ ఉన్నవాడికే యిస్తాడు.
ధీరో దార గుణంబులు
కారణ జన్మునకు వేరె గరుపగా వలెనా
ధారుణిలో టెంకాయకు
నీరేవ్వరు పోసిరయ్య నిట్టల హరియా
అర్థము:-- ధైర్యము, ఉదారత్వము (ఔదార్యము)ఉత్తమునకు నేర్ప వలిసిన పని లేదు. కొబ్బరికాయలో
నీరెంత సహజముగా పుట్టుకు వస్తుందో ధైర్య, ఔదార్య గుణాలు కూడా పుట్టుకతోనే వస్తాయి. నేర్చుకుంటే వచ్చేవి కావు.
మాతా పిత్రో ర్నిత్యం ప్రియం కుర్యాత్
ఆచార్యస్య చ సర్వదా
తేషు హి త్రిషు తృప్తేషు
తపస్సర్వ సమాప్యతే
అర్థము:-- తల్లి తండ్రులతో, గురువులతో ఎప్పుడూ ప్రియముగా మాట్లాడ వలయును. వారు చెప్పినట్టు నడుచుకొని వారికి సంతోషము కలుగ జేయ వలయును. ఈ ముగ్గురు తృప్తి చెందినచో సర్వ తపములు ఫలించి నట్లే.
*సేకరణ :*

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి