15, నవంబర్ 2020, ఆదివారం

మేమే పిల్లలం..!!*

 🌹 *మేమే పిల్లలం..!!* 🌹

బాలల దినోత్సవ శుభాకాంక్షలు


కల్మషం లేని పిల్లలం

స్వచ్ఛమైన మల్లెలం

భావితరాలకు గుర్తులం

మేమే పిల్లలం..!!


తరగతి గదిలో మొలకలం

చదువులతో సామర్థ్యం

భవిష్యత్తులో వృక్షలం

మేమే పిల్లలం...!!


ఆటలే ఆరోగ్యం

పాటలే పరమానందం

జీవితానికే యోగ్యకరం

మేమే పిల్లలం..!!


కాలంతో పరుగులం

పెరగాలనే కుతూహలం

సాధించాలనే లక్ష్యం

మేమే పిల్లలం..!!


తెల్లని మనసులం

భేదాలతో సతమతం

అర్థం కాక గందరగోళం

మేమే పిల్లలం..!!


తల్లిచాటు బిడ్డలం

తండ్రి యొక్క భక్తులం

కుటుంబంలోని ముద్దులం

మేమే పిల్లలం..!!


గురువులే ఆదర్శం

స్నేహితులే  బలం

పుస్తకాలే  ధనం

మేమే పిల్లలం..!


తరగతి గదిలో నిర్మాతలం

నవ భారతానికి మార్గదర్శకులం

నూతన ఆవిష్కరణలకు పునాదులం

మేమే పిల్లలం..!!

✍కొప్పుల ప్రసాద్

కామెంట్‌లు లేవు: