15, నవంబర్ 2020, ఆదివారం

కథ

*✍🏼 నేటి కథ ✍🏼*



*బ్రహ్మరాక్షసుడి సంగీతం*



మూలం: ఎ.కె.రామానుజన్, ఫోక్ టేల్స్ ఫ్రం ఇండియా 


తెలుగు అనువాదం: నారాయణ


పేదబ్రాహ్మణుడొకడు తన పేదరికానికి తట్టుకోలేక కాశీయాత్రకని బయలుదేరాడు. ఎండలో చాలాదూరం నడిచీ నడిచీ అలసిపోయిన అతనికి, చక్కని తోట ఒకటి కనిపించింది. ఆ తోటలోని మహావృక్షాల నీడన విశ్రాంతిగా కూర్చొని, వెంట తెచ్చుకున్న అటుకులు భోంచేద్దామనుకున్నాడు అతను. ముందుగా కాలకృత్యాలు తీర్చుకొనేందుకని అతను ఓ పొద మాటున కూర్చోగానే గంభీరమైన స్వరం ఒకటి 'వద్దు' అన్నది.

అతను గబుక్కున లేచి అది 'ఎవరి గొంతు' అని అన్ని వైపులా చూశాడు; కానీ ఎవ్వరూ కనిపించలేదు. ఆ తర్వాత అతను నోరు కడుక్కునేందుకుగానూ అక్కడే ఉన్న కుంట దగ్గరకు పోగానే మళ్లీ అదే స్వరం వినబడింది: 'వద్దు' అని! అయితే ఈసారి అతను ధైర్యంగా తన పని కానిచ్చాడు, ఆ హెచ్చరికను పట్టించుకోకుండా.

అయితే అతను తన వెంట తెచ్చుకున్న అటుకుల మూటను విప్పినప్పుడు, మళ్లీ ఆ గొంతు "వద్దు" అన్నది. అతను దాన్నీ పట్టించుకోకుండా, తను తినగలిగినన్నింటినీ తిని, మిగిలిన వాటిని తిరిగి మూటగట్టుకొని, ముందుకు బయలుదేరాడు. అంతలో అదే స్వరం "వద్దు,వెళ్లకు" అన్నది.

బ్రాహ్మణుడు ఆగి, నలుదిక్కులా చూశాడు. ఎవ్వరూ కనబడలేదు. అందుకని అతను "ఎవరునువ్వు? ఎందుకిలా శబ్దం చేస్తున్నావు?" అని అరిచాడు.


"పైకి చూడు, నేనిక్కడున్నాను" అన్నది గొంతు. అతను పైకి చూసేసరికి, ఆ చెట్టు కొమ్మల్లో ఇరుక్కుని ఒక రాక్షసుడు కనబడ్డాడు.


ఆ రాక్షసుడు తన దీనగాథను బ్రాహ్మణునితో ఇలా మొరపెట్టుకున్నాడు. "గత జన్మలో నేనూ నీలాగానే ఒక బ్రాహ్మణ వంశంలో పుట్టి, గాన కళలో ఆరితేరాను. నా జీవితకాలమంతా నేను సంగీత రహస్యాల్ని సేకరించటంలోనే వెచ్చించాను తప్పిస్తే, వాటిని ఎవ్వరితోటీ పంచుకోలేదు; ఏ ఒక్కరికీ నేర్పలేదు. అందుకనే ఈ జన్మలో నేను రాక్షసుడినవ్వాల్సి వచ్చింది. భగవంతుడు నాకిచ్చిన శిక్ష ఇది. నువ్వలా వెనక్కి తిరిగిచూస్తే అక్కడో చిన్న గుడి కనబడుతుంది. ఆ గుడిలో ఒక సంగీతకారుడు సన్నాయి వాయిస్తూంటాడు- రోజంతా! అతను వాయించినంత ఘోరంగా సన్నాయిని ఎవ్వరూ వాయించలేరు- అన్నీ అపశృతులే. ఆ శబ్దం నాకు కలిగించే వేదన అంతా ఇంత అని చెప్పలేను - నా చెవుల్లో కరిగిన సీసం పోసినంత బాధగా ఉంటుంది. నేను దాన్ని అస్సలు భరించలేకపోతున్నాను. అతను వాయించే స్వరాల్లో తప్పుగా ఉన్న స్వరం ప్రతి ఒక్కటీ నాలోంచి బాణం మాదిరి దూసుకుపోతున్నది. ఆ శబ్దాలకు నా శరీరం తూట్లుపడి జల్లెడ అయిపోయినంత బాధ కలుగుతున్నది. ఒళ్లంతా నొప్పులే నొప్పులు. ఇదిగనక ఇలాగే కొనసాగితే నాకు పిచ్చెక్కి నేను ఏవేవో చేయటం తథ్యం. రాక్షసుడిని గనుక నన్నునేను చంపుకోలేను కూడాను. మరి ఈ చెట్టును విడిచి పోనూ పోలేను - నన్ను ఈ చెట్టుకు కట్టేశారు. కనుక ఓ బ్రాహ్మణుడా, నువ్వు చాలా మంచివాడివి. నీకు పుణ్యం ఉంటుంది. నామీద దయ తలుచు. తీసుకెళ్లి దూరంగా కనబడే ఆ తోటలోకి చేర్చు. అక్కడ నేను కనీసం కొంచెం ప్రశాంతంగా గాలి పీల్చుకోగలుగుతాను. అలా చేస్తే నా శక్తులు కూడా కొన్ని నాకు తిరిగి వస్తాయి. ఒకప్పుడు నీలాగే బ్రాహ్మణుడై, ఇప్పుడు నాలాగా రాక్షసుడైనవాడిని ఉద్దరించినందుకుగాను, నీకు బహు పుణ్యం లభిస్తుంది." అన్నాడు.



పేద బ్రాహ్మణుడు కరిగిపోయాడు. కానీ పేదరికం అతన్ని రాటుదేల్చింది. అతనన్నాడు -"సరే, నేను నీ కోరిక తీరుస్తాను. నిన్ను వేరే తోటకు చేరుస్తాను - అయితే దానివల్ల నాకేం ప్రయోజనం? నువ్వు బదులుగా నాకోసం ఏం చేస్తావు?" అని.


"నీ ఋణం ఉంచుకోను. నీకు మేలు చేస్తాను. నాకీ ఒక్క సాయం చెయ్యి చాలు" అని ప్రాధేయపడ్డాడు బ్రహ్మరాక్షసుడు.

'సరే'నని బ్రాహ్మణుడు వాడిని భుజాలమీద ఎక్కించుకొని, గుడికి దూరంగా ఉన్న వేరే తోటలోకి తీసుకుపోయి వదిలాడు.

బ్రహ్మరాక్షసుడి కష్టాలు తీరాయి. సంతోషం వేసింది. దానితోపాటు, పోయిన కొన్ని శక్తులు కూడా తిరిగివచ్చాయి వాడికి. వాడు బ్రాహ్మణుడిని ఆశీర్వదించి, అన్నాడు -"నువ్వు పేదరికంతో బాధపడుతున్నావని నాకు తెలుసు. నేను చెప్పినట్లు చేయి - ఇక జన్మలో పేదరికం నిన్ను పీడించదు. ఇప్పుడు నేను స్వతంత్రుడిని- కనుక నేను పోయి, మైసూరు రాజ్యపు యువరాణిని ఆవహిస్తాను. నన్ను వదిలించటం కోసం రాజుగారు రకరకాల మాంత్రికుల్ని రప్పిస్తారు. కానీ నేను మాత్రం వాళ్లెవరికీ లొంగను. నువ్వు వచ్చాకగానీ నేను ఆమెను వదలను. తన కుమార్తెను పట్టిన భూతాన్ని వదిలించినందుకుగాను సంతోషించి మహారాజుగారు, జీవితాంతం నిల్చేంత సంపదను నీపైన కురిపిస్తారు. అయితే ఒక్క షరతు - ఆ తర్వాత నేను వెళ్లి వేరే ఎవరినైనా ఆవహించినప్పుడు, నువ్వు ఇక ఎన్నడూ అడ్డురాకూడదు. దీనికి విరుద్ధంగా ఏనాడైనా జరిగిందంటే నేను నిన్ను తినేస్తాను మరి, ఆలోచించుకో" అని.


బ్రాహ్మణుడు ఒప్పుకున్నాడు. ఆపైన అతను కాశీకి పోయి, గంగలో స్నానం చేసి, వెనక్కి తిరిగివస్తూండగా బ్రహ్మరాక్షసుడి మాటలు గుర్తుకొచ్చాయి. దాంతో అతను అష్టకష్టాలూ పడి, చివరికి మైసూరు రాజ్యం చేరుకున్నాడు. అక్కడొక పూటకూళ్లమ్మ ఇంట్లో బసచేసి ఆ రాజ్య విశేషాలేంటని అడిగితే ఆమె అన్నది - "ఏం చెప్పను. మా యువరాణి చక్కని చుక్క. ఆమెనేదో భూతం ఆవహించింది, దాన్ని ఎవ్వరూ వదిలించలేకపోయారు. తన కుమార్తెను భూతం బారి నుండి కాపాడినవారికి నిలువెత్తు ధనం ఇస్తానని రాజుగారు చాటించారుకూడాను" అని.


ఈ సంగతి వినగానే'మంచిరోజులొచ్చాయని' బ్రాహ్మణుడికి అర్థమైపోయింది. అతను వెంటనే రాజభవనానికి వెళ్లి, "ఆ భూతాన్ని వదిలించే శక్తి తనకున్నదని లోనికి కబురంపాడు. ఈ పేదవాడికి అంతటి శక్తి ఉంటుందని ఎవ్వరూ నమ్మలేదు; కానీ 'ప్రయత్నిస్తే తప్పేంట'ని రాజుగారు బ్రాహ్మణుడికి ప్రవేశం కల్పించారు.

అంత:పురాన్ని చేరుకోగానే, బ్రాహ్మణుడు తననక్కడ యువరాణితో వదిలి అందరినీ వెళ్లిపొమ్మన్నాడు. అందరూ గది బయట నిలబడ్డాక, బ్రాహ్మణుడు గది తలుపులు మూశాడు. ఆ వెంటనే బ్రహ్మరాక్షసుడు యువరాణి ద్వారా మాట్లాడటం మొదలుపెట్టాడు: "నీకోసమే ఇన్నాళ్లుగా ఎదురు చూస్తున్నాను. నీకిచ్చిన మాట ప్రకారం ఈ క్షణమే ఈమెను వదిలి వెళ్లిపోతాను. కానీ- నేను నీకు గతంలో చెప్పిన సంగతిని గుర్తుంచుకో- నేను ఇప్పుడు వెళ్లే చోటుకుగనక -తప్పిజారైనా సరే- వచ్చావంటే మాత్రం, నేను నిన్ను తినకుండా వదిలిపెట్టను." అన్నాడు.


ఆపైన, పెద్దగా శబ్దం చేస్తూ బ్రహ్మరాక్షసుడు యువరాణి శరీరాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయాడు. యువరాణిగారు మామూలుగా అయిపోవటం చూసిన పురజనులంతా ఎంతో సంతోషించారు. రాజుగారు బ్రాహ్మణుడికి అనేక బహుమానాలు - బంగారం, భూములు అనేకమిచ్చి గౌరవించారు. బ్రాహ్మణుడు కూడా అక్కడే ఒక చక్కని యువతిని పెండ్లాడి, పట్టణంలోనే ఇల్లు కట్టుకొని, పిల్లాపాపలతో హాయిగా జీవించసాగాడు.


ఇక మైసూరు యువరాణిని వదిలిన బ్రహ్మరాక్షసుడు, నేరుగా కేరళ రాజ్యానికి పోయి, ట్రావన్ కూర్ యువరాణిని ఆవహించాడు. ట్రావన్ కూర్ రాజుగారు కూడా, పాపం తన బిడ్డను భూతం బారినుండి కాపాడుకునేందుకు అన్ని ప్రయత్నాలూ చేశారు. కానీ ఏదీ ఫలించలేదు. ఒక రోజున ఆయనకెవరో చెప్పారు - మైసూరు యువరాణిని సరిగ్గా ఇదేలాంటి భూతం పూనినప్పుడు, ఒక బ్రాహ్మణుడు ఆమెను చిటికెలో ఎలా స్వస్థపరిచాడో. వెంటనే ఆయన తన మిత్రుడైన మైసూరు రాజుకు ఒక ఉత్తరం రాశారు- తన బిడ్డనుకూడా ఆ భూతం బారినుండి తప్పిస్తే బ్రాహ్మణుడిని తగిన విధంగా సన్మానిస్తామని.


మైసూరురాజుగారు బ్రాహ్మణుడిని పిలిపించి, ట్రావన్ కూర్ రాజుగారి ఆస్థానానికి వెళ్లి, ఆ యువరాణికి సాయం చేసి రమ్మని అభ్యర్థించాడు. ఆ బ్రహ్మరాక్షసుడిని మరోసారి ఎదుర్కోవటం అనగానే బ్రాహ్మణుడికి ఒళ్లు చల్లబడింది. వణుకు మొదలైంది. అయినప్పటికీ, రాజుగారి ఆజ్ఞాయె! అతిక్రమించే వీలు లేదాయె! చాలాసేపు ఆలోచించీ, ఆలోచించీ అతను ఒక నిర్ణయానికి వచ్చాడు: తనకేమన్నా అయితే తన భార్యా బిడ్డల పోషణ సరిగా జరిగేటట్లు ఏర్పాట్లు చేసి, తను ట్రావన్ కూర్ కు బయలుదేరివెళ్లాడు.


అయితే ఒకసారి అక్కడకు చేరుకున్నాక కూడా, బ్రహ్మరాక్షసుడిని ఎదుర్కొనేందుకు అతనికి ధైర్యం చాలలేదు. తనకు ఆరోగ్యం బాగా లేనట్లు నటిస్తూ అతను మూర్ఛపోయాడు. అలా దాదాపు రెండు నెలలపాటు తన గదిలోంచి కాలు బయట పెట్టలేదు. అయినా రెండు నెలల తర్వాత ఇక దాటవేసేందుకు వీలులేకపోయింది. యువరాణిని పీడిస్తున్న రాక్షసుడిని తరిమివేయాల్సిందేనని ఉత్తర్వులు వెలువడ్డాయి!


ఇక అతను ప్రాణాలు అరచేతబట్టుకొని, యువరాణీవారిని చూడటం కోసం బయలుదేరాడు. తనను ఈ గండం నుండి తప్పించమని భగవంతుడిని వెయ్యి రకాలుగా ప్రార్థిస్తూ, అతను రాజుగారి ప్రాసాదానికి చేరుకుని, అక్కడినుండి అంత:పురంలో యువరాణీవారి మందిరంలో ప్రవేశపెట్టబడ్డాడు. అతణ్ని చూసిన మరుక్షణం బ్రహ్మరాక్షసుడు గర్జించాడు - "నిన్ను చంపేస్తాను! ముక్కలు ముక్కలుగా చేసి తినేస్తాను. నీకు ఇక్కడికి రావాల్సిన పనేముంది? నిన్ను వదిలేది లేదు" అని అరుస్తూ వాడు ఒక పెద్ద ఇనుప రోకలిని చేతబట్టుకొని బ్రాహ్మణుని మీదకు ఉరికాడు. బ్రాహ్మణుడి పైప్రాణాలు పైనే పోతున్నాయి. అయినా ప్రాణాలకు తెగించి వచ్చి ఉన్నాడు గనుక ఆ తెగింపు నుండి వచ్చిన ధైర్యంతో నిటారుగా నిలబడి, లేని గాంభీర్యాన్ని గొంతులోకి తెచ్చుకొని గట్టిగా అన్నాడు- "చూడు, నువ్వు నేను చెప్పిన మాట విని మర్యాదగా ఈ యువరాణిని విడిచిపెట్టి వెళ్తావా?, లేకపోతే ఆ గుడిలోని సంగీతకారుడిని ఓసారి పిలిపించమంటావా? అతనైతే ఈ అంత:పురంలో కూర్చొని రాత్రింబవళ్లూ చక్కగా తనశైలిలో సంగీత సాధన చేస్తాడు మరి, నీకు అభ్యంతరం లేకపోతే!" అని.


'సంగీతకారుడు' అనే మాట వినగానే ఆ బ్రహ్మరాక్షసుడికి ఆ సంగీతమూ, దాని కారణంగా తను పడ్డ బాధా ఒకేసారి గుర్తుకొచ్చాయి. ఆ బాధను తలుచుకొని వాడు భయంతో వణికిపోయాడు- "వద్దు! వద్దు! అతన్ని మాత్రం పిలువకు! నేను వెళ్లిపోతున్నాను" అని అరుస్తూ వాడు యువరాణిని వదిలిపెట్టి ఒక్కసారిగా మాయమయిపోయాడు.


అటుపైన ట్రావన్ కూర్ యువరాణి ఆరోగ్యం త్వరితంగా కుదురుకున్నది. రాజుగారికి బ్రాహ్మణుడు చేసిన సహాయం ఎక్కడలేని ఆనందాన్ని ఇచ్చింది. ఆయన బ్రాహ్మణుడికి ఎన్ని బంగారు నాణేలు ఇచ్చాడంటే, ఆ మొత్తాన్నీ బండ్లల్లో నింపుకొని, మైసూరు చేరుకొన్న బ్రాహ్మణుడు, తన భార్యాపిల్లలతో కలిసి ఇంకా ఆ డబ్బును లెక్కపెడుతూనే ఉన్నాడు!

[15/11, 12:01 pm] +91 93913 24915: 🌼🌿*శ్రీ లలితా సహస్ర నామముల నుండి రోజుకు ఒక శ్లోకం నేర్చుకుందాం*🌼🌿


శ్లోకం 102


*మణిపూరాబ్జనిలయా,  వదనత్రయ సంయుతా !


వజ్రాదికాయుధోపేతా, డామర్యాదిభిరావృతా *!! 102


మణిపూరాబ్జనిలయా - మణిపూర పద్మములో (నాభి స్థానం)నందు వసించునది.


వదనత్రయ సంయుతా - మూడు ముఖములతో కూడి యుండునది.


వజ్రాదికాయుధోపేతా - వజ్రం మొదలైన ఆయుధములను ధరించి ఉండునది.


డామర్యాదిభిరావృతా - డామరము, ఆదిభి మొదలైన శక్తి దేవతలచే పరివేష్టింపబడి యుండునది.


          🌼🌿 శ్రీ మాత్రే నమః🌼🌿

[15/11, 12:01 pm] +91 93913 24915: _*రేపు ఆకాశదీపం ప్రారంభం*_




🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉




*ఆకాశదీప మహాత్మ్యం*




☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️




కార్తికమాసం ఆకాశదీపంతో ప్రారంభమవుతుంది. నిజానికి ఏవి ఆకాశదీపాలు. మీరు నేను పెట్టక్కరలేదు. ఆకాశదీపాలు వెలిగించినవాడు పరమేశ్వరుడు. సూర్యుడు , చంద్రుడు , నక్షత్రాలు ఇవీ ఆకాశదీపాలు. *మరి కార్తికమాసం ప్రారంభం దేనితో మొదలు ?* ఆకాశదీపంతో ప్రారంభం. *ఆకాశదీపం ఎక్కడ వెలిగిస్తారు ?* దేవాలయంలో వెలిగిస్తారు. దేవాలయంలో ధ్వజ స్తంభానికి తాడుకట్టి ఒక చిన్న పాత్రలో దీపం వెలిగించి , గాలికి నిధనం కాకుండా రంధ్రములతో ఏర్పాటు చేసి దాన్ని జాగ్రత్తగా శమంతకంగా భగవంతుని నామాలు చెపుతూ , భక్తులందరూ చుట్టూ నిలబడి ఉండగా , ఆ దీపాన్ని పైకెత్తుతారు. ఎవరి శక్తి కొలదీ వాళ్లు తగినట్లుగా వారు కార్తిక మాసంలో భక్తులు ఆకాశదీపానికి చమురో , వత్తులో ఇస్తూ ఉంటారు. *ఆ దీపాన్ని పైకెత్తుతారు ఎందుకని ?*  ఆ దీపం ధ్వజస్తభంం మీద ఉండి అంతటా వెలుతురు చిమ్ముతుంది. ధ్వజస్తంభం మీదకి ఏదైనా లాగారు అంటే , పతాకాన్ని ఆరోహణ చేశారు అంటే ఈశ్వరునికి ఉత్సవం అవుతుందని గుర్తు. ఇంకా కార్తికమాసంలో మనమే ఉత్సవం చేస్తున్నాం. మనకి మనం ఉత్సవం. ఉత్‌ అంటే తలపైకెత్తడం , తల పైకెత్తి చూశాడు కాబట్టి ఉత్సవం. ఏమిటి తల పైకెత్తి చూడ్డం ? నాకు ఉన్న గౌరవం ఏమిటి ? ఈ శరీరంలో ఉంటూ నేను చేయగలిగిన అధికారం ఏమిటి ? సమస్త భూతాలకు నేను మహోపకారం చేయగలను కార్తికపౌర్ణమి నాడు. ఇతర ప్రాణులు చేయలేవు. నేనే చేయగలను.   ఏమిటి చేయగలను ? దీపం తీసుకెళ్లి ఓ గదిలో పెట్టాననుకోండి కొంత ఫలితం. వీధిలోకి తీసుకువచ్చి దీపం పెట్టాననుకోండి విశేషఫలితం. అందుకే గుత్తు దీపాలని పెడతారు. ఇంతంత వత్తులు వేసి కట్టకట్టి దీపం వెలిగిస్తారు ఆ రోజున. యథార్థానికి శాస్త్రంలో ఏమి చెప్పారంటే ఆ రోజున చెత్త కూడా వెలిగించాలి. వీధులలో ఉన్న చెత్త కూడా వెలిగించేసేయమన్నారు. కానీ లౌకికాగ్నితో వెలిగించకూడదు. మీ ఇంట దీపం వెలిగించి కార్తిక పౌర్ణమి నాటి ప్రదోషవేళ , దామోదరమావాహయామి అనిగాని , త్రయంబకమావాహయామ అనిగాని అని , ఆ దీపంతో వెలిగించాలి. ఈ దీపం పెట్టి ఒక్కసారి ఆకాశం వంక చూసి ఒక శ్లోకం చెప్పాలి.

*కీటాఃపతంగాః మశకా శ్చ వృక్షాః*

*జలేస్థలే… ఫలే ఏ నివసంతి*

*జీవా దృష్ట్యా ప్రదీపం నచ జన్మ భాగినః*

*భవతింత్వ స్వపచాహి విప్రాః*

ఈ శ్లోకం చెప్పి నమస్కారం చేయాలి. ఇప్పుడు నువ్వు నమస్కారం చేస్తే పరమేశ్వరుడు ఎంతో ఆనందాన్ని పొందుతాడు. ఒరేయ్‌ వీడికి నేను మనుష్య శరీరాన్నిస్తే వీడు ఇన్ని భూతాలలో ఉన్న విభూతులను వాడుకున్నాడు. ఇన్నిటిని వాడుకున్నందుకు ఇవాళ వీడు ప్రత్యుపకారం చేశాడు. ఈ ఉపకార బుద్ధి , కృతజ్ఞత ఉన్నవాడు కాబట్టి నా మాట నమ్మి ఉపకారం చేశాడు. కాబట్టి వీడికి నేను మళ్లీ మనుష్యు శరీరం ఇవ్వవచ్చు. ఈ మాట చెప్పినపుడు *‘కీటాఃపతంగాః మశకాశ్చ వృక్షాః’* కీటకములుంటాయి. చిన్నచిన్న పురుగులు. అవి ఎందుకు పుడతాయంటే దీపంలో పడి చచ్చిపోవటానికి పుడతాయి. వాటివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా అంటే నాకేం ఉండదు. బల్లులకుంటుంది. పురుగులను పట్టి తింటాయి. ఇతర భూతములకు ఆహారమై పోతాయి. అధవా వాటి ఆయుర్ధాయం దేనివల్ల నశించిపోతుంది. ఆ దీపం యొక్క జ్యోతి మీద కొంచెంగా పడిపోతాయి. కింద పడిపోయి వాటి రెక్కలు వూడిపోతాయి.

అటువంటి దీపపు పురుగులు దీపం మీద పడి కాలిపోవడం చచ్చిపోవడమే తప్ప అభ్యున్నతి పొందినది లేదు. ఆ దీపం వల్లనే అని తెలిస్తే కదూ ! పైగా దీపంలో ఎక్కువగా పడిపోతే దీపం నిధనమైన పాపం వస్తుంది వాటికి తప్ప , దీపం వల్ల ప్రయోజనం పొందలేదు. అని ఇవాళ ఈశ్వరా నేను ఒక సంకల్పం చెప్తున్నాను , ఈ దీపం దీపం కాదు , ఇది త్రయంబకుడు , ఇది దామోదరుడు , కాబట్టి దీనివల్ల మొదటి ఫలితమెవరికి వెళ్లాలంటే *కీటాఃపతంగాః మశకాశ్చ , కీటకములు: పురుగులు , పతంగాలు , మశకాశ్చ: దోమలు , వృక్షాః* అవి యెంతో ఉపకారం చేస్తాయి. కాయలిస్తాయి , పళ్లు ఇస్తాయి. ఆకులిస్తాయి , కొమ్మలిస్తాయి , రెమ్మలిస్తాయి , కలపనిస్తాయి , ఇళ్లు కట్టుకుంటాం. ఇన్ని చేస్తాం. కానీ ఎండలో అది నిలబడి మనకు నీడనిస్తుంది తప్ప దాని జన్మాంతరంలో అది మాత్రం ఎక్కడికీ వెళ్లలేదు. అలాగే ఉండాలి. ఒక ఆవు వచ్చి దాని కొమ్మలు కొరుక్కు తినేస్తున్నా , ఒక ధూర్తుడు వచ్చి కొమ్మ విరిచేస్తున్నా , ఏవో ప్రాణులొచ్చి దాని మీద కెక్కి అలజడి చేసేసి కొమ్మలన్నీ వొంచేస్తున్నా , గొడ్డలి పెట్టి తనను నరికేస్తున్నా , ఒక్క అడుగు ఇలా తీసి , అలా వేయలేని దైన్యం చెట్టుది. అదలాగే నిలబడుతుంది. ఆ చెట్టు ఎలా అభ్యున్నతిని పొందుతుంది. కదలలేనపుడు , కర్మ లేనపుడు , దానికి కర్మాధికారం ఏది ?  అది సంపాదించుకోలేదు. కాబట్టి ఈశ్వరా ! నీ దీపపు వెలుతురు ఆ చెట్టుమీద పడుతోంది. కాబట్టి దామోదరుడి చేయి దానిమీద పడినట్టే ! త్రయంబకుని చేయి దానిమీద పడినట్టే ! అది అభ్యున్నతిని పొందాలి.

నీటిలో ఉండే చేపలుంటాయి , కప్పలుంటాయి , తాబేళ్లుంటాయి. ఈ దీపపు వెలుతురు నీటిమీద పడినపుడు , నీటి లోపల ఉన్నటువంటి ప్రాణులన్నీ కూడా నీ అనుగ్రహాన్ని పొందాలి. అక్కడితో సరిపోతుందా ? 

ఇది కాదు. *జలేస్థలే నివసంతి జీవాః దృష్ట్వా ప్రదీపం నచజన్మ భాగినః* వాటికేం తెలియదు. అవేం పుణ్యం చేయలేదు , కానీ ఈ వెలుతురు వాటిమీద పడిన కారణం చేత ఇక వాటికి జన్మ లేకుండుగాక ! అక్కడితో వాటికున్నటువంటి పాప పుణ్యాలన్నీ కూడా నశించిపోవుగాక ! అని *భవతింత్వ శపచాపవిప్రాః* అసలు వేదం మీద నమ్మకం లేకుండా కేవలం ప్రాపంచిక కర్మాచరణము మాత్రమే చేస్తూ ఈ లోకంలో తిరుగుతూ కేవలం ఉదర పోషణార్థమే బతుకుతున్న భయంకరమైన స్థితిలో ఉండిపోయిన వాడిమీద ఈ దీపం యొక్క కాంతి ప్రసరించిన కారణం చేత వాడుకూడా వచ్చే జన్మలో వేదము యొక్క ప్రమాణం తెలుసుకున్న వాడై స్వరంతో వేదాన్ని చదువుకొని వేదాన్ని ప్రచారం చేసి వేదానికి చేతులడ్డుపెట్టి లోకోద్ధరణ చేయగలిగిన నిస్వార్థతపూరితమైన లోకోపకారియైన బ్రాహ్మణుడిగా జన్మించి అభ్యున్నతిని పొందుగాక ! కాబట్టి *భవంతిత్వం స్వపచాహివిప్రా:*  ఈ దీపపు కాంతి అంత గొప్పది. కాబట్టి ఈశ్వరా , నీ యందు త్రయంబకుణ్ణి , దామోదరుణ్ణి అవాహన చేసి ఈ దీపపు వెలుతురు నీయందు ప్రసరించేటట్లు చేస్తున్నాను.

అందుకే కార్తిక పౌర్ణమి నాడు అన్ని చోట్లా దీపాలెత్తుతారు. ఇక దీపమెత్తని ప్రదేశముండదు. కార్తిక పౌర్ణమి నాడు సాయంకాలం ఉపన్యాసం చెప్తే ఎవరూ ఉండరు. చెప్పకూడదు. ఎందుకంటే కార్తికపౌర్ణమి అంటే ప్రతీ వాళ్లూ ఇళ్లలో చేసుకోవాలి.

[15/11, 12:01 pm] +91 93913 24915: _*🚩కార్తీక పురాణం - 30 అధ్యాయాలు🚩*_


🕉️☘🕉☘🕉☘🕉☘🕉☘🕉


*1 . వ అధ్యాయం -  కార్తీక మాసం మహత్యం*



*2 . వ అధ్యాయం - సోమవార వ్రత మహిమ*



*3 . వ అధ్యాయం - కార్తీక మాస  స్నాన మహిమ*



*4 . వ అధ్యాయం - దీపారాధన మహిమ*



*5 . వ అధ్యాయం - వనభోజన మహిమ*



*6 . వ అధ్యాయం - దీపదానవిధి - మహత్యం*



*7 . వ అధ్యాయం - శివకేశవార్చన విధులు*



*8 . వ అధ్యాయం - శ్రీహరి నామస్మరణా ధన్యోపాయం*



_*9 . వ అధ్యాయం - విష్ణు పార్శద , యమ దూతల  వివాదము*_



*10 . వ అధ్యాయం - అజామీళుని పూర్వజన్మ వృత్తాంతము*



*11 . వ అధ్యాయం - మంథరుడు - పురాణ మహిమ*



*12 . వ అధ్యాయం - ద్వాదశి ప్రశంస*



*13 . వ అధ్యాయం - కన్యాదాన ఫలము*



*14 . వ అధ్యాయం - ఆబోతును అచ్చుబోసి వదలుట (వృషోత్సర్గము)*



*15 . వ అధ్యాయం - దీప ప్రజ్వలనముచే ఎలుక పూర్వజన్మస్మృతితో నరరూపమందుట*



*16 . వ అధ్యాయం - స్తంభ దీప ప్రశంస*



*17 . వ అధ్యాయం - అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్త్వోపదేశము*



*18 . వ అధ్యాయం - సత్కర్మానుష్టాన ఫల ప్రభావము*



*19 . వ అధ్యాయము - చతుర్మాస్య వ్రత ప్రభావనిరూపణ*



*20 . వ అధ్యాయము - పురంజయుడు దురాచారుడగుట*



*21 . వ అధ్యాయము - పురంజయుడు కార్తీక ప్రభావము నెరుంగుట*



*22 . వ అధ్యాయము - పురంజయుడు కార్తీక పౌర్ణమీ వ్రతము చేయుట*



*23 . వ అధ్యాయము - శ్రీ రంగక్షేత్రమున పురంజయుడు ముక్తినొందుట*



*24 . వ అధ్యాయము - అంబరీషుని ద్వాదశీవ్రతము*



*25 . వ అధ్యాయము - దూర్వాసుడు అంబరీషుని శపించుట*



*26 . వ అధ్యాయము - దూర్వాసుడు శ్రీహరిని శరణువేడుట - శ్రీహరి హితబోధ*



*27 . వ అధ్యాయము - దూర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట*



*28 . వ  అధ్యాయం - విష్ణు సుదర్శన చక్ర మహిమ*



*29 . వ అధ్యాయం -  అంబరీషుడు దుర్వాసుని పూజించుట - ద్వాదశి పారణము*



*30 . వ అధ్యాయం - కార్తీకవ్రత మహిమ్నా ఫలశ్రుతి*

🙏🙏🌷🙏🙏🌷🙏🙏🌷🙏🙏

[15/11, 12:01 pm] +91 93913 24915: *🚩కార్తీకపురాణం - 1 వ అధ్యాయం🚩*_


🕉☘️🕉️☘️🕉️☘️🕉️☘️🕉️☘️🕉️


*కార్తీక మాసం మహత్యం*


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


ఒకరోజు నైమిశారణ్యంలో శౌనకాది మహామునులు కలిసి గురుతుల్యులైన సూతమహర్షితో ఇలా కోరారు… *”ఓ మహాత్మా… మీ ద్వారా ఎన్నో పురాణేతిహాసాలను , వేదవేదాంగాల రహస్యాలను గ్రహించాము. కార్తీక మాసం మహత్యాన్ని కూడా వివరించండి. ఆ మాసం పవిత్రత , కార్తీకపురాణ ఫలితాలను కూడా వివరించండి..”* అని కోరారు.


శౌనకాది మహామునుల కోరికను మన్నించిన సూతమహర్షి ఇలా అంటున్నాడు… *”ఓ మునిపుంగవులారా… ఒకప్పుడు ఇదే కోరికను త్రిలోకసంచారి అయిన నారదమహాముని బ్రహ్మదేవుడిని కోరాడు. అప్పుడు బ్రహ్మదేవుడు అతనికి ఈ పురాణ విశేషాలను వివరించారు. అదే సమయంలో లక్ష్మీదేవికి శ్రీ మహావిష్ణువు , పార్వతీదేవికి పరమశివుడు ఈ పురాణాన్ని వివరించారు. అలాంటి పరమ పవిత్రమైన పురాణాన్ని మీకు వివరిస్తాను. ఈ కథను వినడం వల్ల మానవులకు ధర్మార్థాలు ప్రాప్తిస్తాయి. ఈ పురాణగాథను విన్నంతనే ఇహలోకంలో , పరలోకంలో సకలైశ్వర్యములు పొందగలరు. కాబట్టి శ్రద్ధగా వినండి”* అని చెప్పసాగాడు.



పూర్వం ఒకరోజు పార్వతి పరమేశ్వరులు ఆకాశమార్గంలో విహరిస్తుండగా… పార్వతి దేవి పరమశివుడితో *”ప్రాణేశ్వరా… సకల ఐశ్వర్యాలను కలుగజేసి , మానవులంతా కులమత తారతమ్యం లేకుండా , వర్ణభేదాలు లేకుండా ఆచరించే వ్రతమేదైనా ఉంటే వివరించండి”* అని కోరింది.


అంతట పరమశివుడు ఆమె వైపు చిరునవ్వుతో చూసి ఇలా చెబుతున్నాడు *”దేవీ ! నీవు అడిగే వ్రతమొక్కటి ఉంది. అది స్కంధపురాణంలో ఉప పురాణంగా విరాజిల్లుతోంది. దానిని వశిష్ట మహాముని మిథిలాపురాధీశుడైన జనక మహారాజుకు వివరించారు. అటు మిథిలానగరం వైపు చూడు….”* అని ఆ దిశగా చూపించాడు.


మిథిలానగరంలో వశిష్టుడి రాకకు జనకమహారాజు హర్షం వ్యక్తం చేస్తూ అర్ఘ్యపాద్యాలతో సత్కరించారు. ఆపై కాళ్లు కడిగి , ఆ నీటిని తన తలపై జల్లుకుని ఇలా అడుగుతున్నాడు *”ఓ మహామునివర్యా… మీ రాకవల్ల నేను , నా శరీరం , నా దేశం , ప్రజలు పవిత్రులమయ్యాము. మీ పాద ధూళితో నా దేశం పవిత్రమైంది. మీరు ఇక్కడకు రావడానికి కారణమేమిటి ?”* అని కోరగా…. వశిష్ట మహాముని ఇలా చెబుతున్నాడు *”జనక మహారాజ ! నేనొక మహాయజ్ఞము చేయాలని నిర్ణయించాను. అందుకు కావాల్సిన ధన , సైన్య సహాయానికి నిన్ను కోరాలని వచ్చాను”* అని తాను వచ్చిన కార్యాన్ని వివరించారు.


దీనికి జనకుడు *”మునిపుంగవా… అలాగే ఇస్తాను. స్వీకరించండి. కానీ , ఎంతో కాలంగా నాకొక సందేహమున్నది. మీలాంటి దైవజ్ఞులైనవారిని అడిగి సంశంయం తీర్చుకోవాలని అనుకునేవాడిని. నా అదృష్టం కొద్ది ఈ అవకాశం దొరికింది. ఏడాదిలోని మాసాలన్నింట్లో కార్తీక మాసమే ఎందుకు పరమ పవిత్రమైనది ? ఈ నెల గొప్పదనమేమిటి ? కార్తీక మహత్యాన్ని నాకు వివరిస్తారా ?”* అని ప్రార్థించారు.


వశిష్ట మహాముని చిరునవ్వు నవ్వి *”రాజ ! తప్పక నీ సందేహాన్ని తీర్చగలను. నేను చెప్పబోయే వ్రతకథ సకలమానవాళి ఆచరించదగినది. సకల పాపాలను హరించేది. ఈ కార్తీకమాసం హరిహర స్వరూపం. ఈ నెలలో ఆచరించే వ్రత ఫలితం ఇదీ… అని చెప్పలేం. వినడానికి కూడా ఆనందదాయకమైనది. అంతేకాదు.. ఈ కార్తీక మాస కథను విన్నవారు కూడా నరక బాధలు లేకుండా ఈ లోకంలోనూ , పరలోకంలోనూ సౌఖ్యంగా ఉంటారు. నీలాంటి సర్వజ్ఞులు ఈ కథను గురించి అడిగి తెలుసుకోవడం శుభప్రదం. శ్రద్ధగా ఆలకించు….”* అని చెప్పసాగాడు.


*కార్తీక వ్రతవిధానం*


*”ఓ జనక మహారాజా ! ఎవరైనా , ఏ వయసువారైనా పేద - ధనిక , తరతమ తారతమ్యాలు లేకుండా కార్తీక మాస వ్రతం ఆచరించవచ్చు. సూర్యభగవానుడు తులారాశిలో ఉండగా…. వేకువ జామున లేచి , కాలకృత్యాలు తీర్చుకుని , స్నానమాచరించి , దానధర్మాలు , దేవతాపూజలు చేసినట్లయితే… దానివల్ల అనన్యమైన పుణ్యఫలితాన్ని పొందగలరు. కార్తీకమాసం ప్రారంభం నుంచి ఇలా చేస్తూ… విష్ణుసహస్రనామార్చన , శివలింగార్చన ఆచరిస్తూ ఉండాలి. ముందుగా కార్తీక మాసానికి అధిదేవత అయిన దామోదరుడికి నమస్కారం చేయాలి. ‘ఓ దామోదర నేను చేసే కార్తీక మాస వ్రతానికి ఎలాంటి ఆటంకం రానీయక నన్ను కాపాడు’ అని ధ్యానించి ప్రారంభించాలి”* అని వివరించారు.


వ్రతవిధానం గురించి చెబుతూ… *”ఓ రాజా ! ఈ వ్రతాన్ని ఆచరించే రోజుల్లో సూర్యోదయానికి ముందే నిద్రలేచి , కాలకృత్యాలు తీర్చుకుని , నదికిపోయి , స్నానమాచరించి గంగకు , శ్రీమన్నారయణ , పరమేశ్వరులకు , బైరవుడికి నమస్కరించి సంకల్పం చేసుకోవాలి. ఆ తర్వాత నీటిలో మునిగి , సూర్యభగవానుడికి అర్ఘ్యపాదాలను సమర్పించి , పితృదేవతలకు క్రమప్రకారం తర్పణలు చేయాలి. గట్టుపై మూడు దోసిళ్ల నీరు పోయాలి. ఈ కార్తీక మాసంలో పుణ్య నదులైన గంగా , గోదావరి , కృష్ణ , కావేరీ , తుంగభద్ర , యుమన తదితర నదుల్లో ఏ ఒక్కనదిలోనైనా స్నానం చేసినట్లయితే… గొప్ప ఫలితం లభిస్తుంది. తడి బట్టలు వీడి మడి బట్టలు కట్టుకొని , శ్రీ మహావిష్ణువుకు ఇష్టమైన పూలను తానే స్వయంగా కోసి తీసుకొచ్చి , నిత్యధూప , దీప , నైవేద్యాలతో భగవంతుని పూజచేయాలి. గంధము తీసి , భగవంతునికి సమర్పించి , తానూ బొట్టు పెట్టుకోవాలి. ఆ తర్వాత అతిథిని పూజించి , వారికి ప్రసాదం పెట్టి , తన ఇంటివద్దగానీ , దేవాలయంలోగానీ , రావిచెట్టు మొదటగానీ కూర్చొని కార్తీకపురాణం చదవాలి. ఆ సాయంకాలం సంధ్యావందనం చేసి , శివాలయంలోగానీ , విష్ణు ఆలయంలోగానీ , తులసికోట వద్దగానీ , దీపారాధన చేసి , శక్తిని బట్టి నైవేద్యం తయారు చేసి , స్వామికి నివేదించాలి. అందరికీ పంచి , తానూ భుజించాలి. తర్వాతిరోజు మృష్టాన్నంతో భూతతృప్తిచేయాలి. ఈ విధంగా వ్రతం చేసిన మహిళలు , మగవారు గతంలో , గతజన్మలో చేసిన పాపాలు , ప్రస్తుత జన్మలో చేసిన పాపాలను పోగొట్టుకుని మోక్షాన్ని పొందుతారు. ఈ వ్రతం చేయడానికి అవకాశం లేనివారు , వీలు పడనివారు వ్రతాన్ని చూసినా , వ్రతం చేసినవారికి నమస్కరించినా… వారికి కూడా సమాన ఫలితం వస్తుంది.



*ఇది స్కాంద పురాణంలోని వశిష్టమహాముని చెప్పిన కార్తీక మహత్యంలోని మొదటి అధ్యాయం సమాప్తం.*

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

[15/11, 12:01 pm] +91 93913 24915: *వీరయ్య దయ్యం -- చందమామ కథలు*


*ఒక ఊళ్ళో వీరయ్య అనే రైతు ఉండేవాడు. అతని భార్య పేరు మంగమ్మ. కష్టజీవులైన వాళ్ళకు రాజయ్య అనే కొడుకు ఉండేవాడు. రాజయ్య ముమ్మూర్తులా తండ్రి పోలికే. నాట్ల తరుణంలో ఒకనాడు వీరయ్య ముఖ్యమైన పనులున్నాయని, చీకటితో ఇంటి నుంచి బయలుదేరి పొలానికి వెళ్ళాడు. వెళ్ళిన కొంతసేపటికి నలుగురు మనుషులు వీరయ్య శవాన్ని ఇంటికి చేర్చారు. చీకట్లో అతన్ని పాముకరిచింది.*


*ఇంటి దగ్గిర ఏడ్చి, ఏడ్చి, ఏడ్చి, సొమ్మసిల్లి పడిపోయిన మంగమ్మకు మగతనిద్రలో ఒక కల వచ్చింది. తన భర్త దయ్యమై, వికృతంగా నవ్వుతూ, గుడ్లగూబలా అరుస్తూ, శ్మశానం దగ్గిర ఉన్న మర్రిచెట్టు మీదికి ఎగిరిపోయినట్టు ఆమె కలగని, కెవ్వున అరిచి, లేచి కూర్చున్నది. ఆమెను కనిపెట్టుకుని ఉన్న ఇరుగు పొరుగు అమ్మలక్కలు, ‘‘ఏమయింది, మంగమ్మా? పీడ కలగానీ వచ్చిందా?'' అని అడిగారు. ‘‘నా మొగుడు దయ్యం అయ్యాడు!''*


*అంటూ మంగమ్మ తనకు వచ్చిన కల వివరంగా వాళ్ళకు చెప్పింది. వీరయ్య పోయిన మూడో రోజున, శ్మశానం దగ్గిర మర్రిచెట్టు కింద మూర్ఛపోయి పడి ఉన్న ఒక వ్యాపారిని ఊరి వాళ్ళు తీసుకువచ్చి, ఉపచారాలు చేసి, తెలివి తెప్పించారు. వ్యాపారి మొదట పిచ్చిచూపులు చూసి, తరవాత తేరుకుని, క్రితం రాత్రి తనకు జరిగినది చెప్పాడు. ఆ వ్యాపారిది సమీపంలో ఉన్న మరొక గ్రామం.*


*అతను తన దుకాణానికి కావలిసిన సరుకులన్నీ ఎప్పుడూ ఈ వూరినుంచే పట్టుకుపోయేవాడు. ఆ ప్రకారమే అతను మూడో ఝామున లేచి, ఈ ఊరికి సరుకుల కోసం బయలుదేరాడు. దారి అతనికి అలవాటైనదే. తను శ్మశానం దగ్గిరికి వచ్చేసరికి నక్కలూ, గుడ్లగూబలూ అరవటం వినిపించి భయం పుట్టింది.*


*మర్రి ఆకులు గలగల మన్నాయి. లాల్చీవేసుకుని ఎవరో ఊగుతున్నట్టు అతనికి లీలగా కనిపించింది. అసలే ఆ వ్యాపారికి దయ్యాల భయం! దానికి తగ్గట్టుగా ఆ దయ్యం, ‘‘ఒరే వ్యాపారీ, నీ దగ్గిర ఉన్న డబ్బు ఇలా ఇచ్చిపో! నా పెళ్ళాంబిడ్డలకు జరుగుబాటు కావద్దా? నేనెవరో తెలుసా? వీరయ్యను! ఇవ్వక పోతే చంపేస్తా,'' అన్నది. వెంటనే వ్యాపారికి స్పృహ తప్పింది.*


*వ్యాపారి మాటలలో నమ్మకం కుదిరి ఊరివాళ్ళు, వ్యాపారి పోగొట్టుకున్న డబ్బు కోసం మంగమ్మ ఇల్లంతా గాలించారు. కాని వాళ్ళకు అక్కడ చిల్లిగవ్వ కూడా దొరకలేదు. మంగమ్మ వెక్కి, వెక్కి ఏడ్చింది. అకాలమరణం పాలైన గంగిగోవు లాటి తన భర్త దయ్యం కావటమేగాక, బాటసారులను బాధించి దోచుకోవటం ఆమెకు చాలా బాధ కలిగించింది. మంగమ్మ పట్ల ఊళ్ళోవాళ్ల ప్రవర్తన కూడా మారిపోయింది.*


*వాళ్ళు ఆమెను పలకరించటం మానేశారు. ఆమె కనబడితే మొహం తిప్పుకోసాగారు. మర్నాడు అర్ధరాత్రి పొద్దుపోయి పొరుగూరు నుంచి వస్తున్న ఆడమనిషి నగలు దయ్యం దోచేసి, ‘‘ఈ నగలు నా పెళ్ళాం పెట్టుకుంటే మరింత అందంగా ఉంటుంది!'' అన్నది. మర్నాడు ఊరి వాళ్ళంతా ఏకమై వచ్చి, మంగమ్మ ఇంటిని సోదాచేసి, ఏమీ దొరక్కపోయినా, ‘‘నీ మొగుడు ఈ ఊరికి పెద్ద పీడ అయి కూర్చున్నాడు. వాణ్ణి మర్యాదగా ఊరువదిలి వెళ్ళమను. లేకపోతే నీ మర్యాద దక్కదు!''*


*అని గట్టిగా బెదిరించి వెళ్ళిపోయారు. మంగమ్మకు ఏమీ పాలుపోలేదు. తనకూ, చచ్చిపోయిన తన భర్తకూ ఇంకా సంబంధం ఉన్నదనే ఊరివాళ్ళు అనుకుంటున్నారు! వరసగా మరి ముగ్గురికి దయ్యం కనిపించింది. చీకటి పడితే ఎవరూ శ్మశానం చాయలకు పోవటం లేదు, అటు నుంచి రావటమూ లేదు.*


*ఊళ్ళోవాళ్ళు మాత్రం తమలో తాము సుదీర్ఘంగా చర్చించుకుని, మంగమ్మతో, ‘‘నువ్వూ, నీ కొడుకూ ఈ ఊరు విడిచిపోతే గాని మాకు వీరయ్య దయ్యం బెడద వదలదు. రేపు లోపల మీరు వెళ్ళిపోకపోతే, మేమే మిమ్మల్ని సాగనంపగలం!'' అని హెచ్చరిక చేశారు.*


*ఇల్లూ, వాకిలీ వదిలేసి ఎక్కడికి వెళ్ళేట్టు? మంగమ్మ తన భర్తతోనే మంచిగా వెళ్ళి పొమ్మని చెప్పటానికి గుండె రాయిచేసుకుని, చీకటి పడ్డాక శ్మశానం కేసి వెళ్ళింది. ఆమెకు నక్కల కూతలు వినిపిస్తున్నాయి. ఆమె మర్రి చెట్టు ప్రాంతానికి రాగానే, చెట్టు కొమ్మల్లో నుంచి, ‘‘ఆగవే, ఆగు! నా పెళ్ళాం బిడ్డలకు జరుగుబాటు కావద్దా? నీ దగ్గిర ఉన్నదంతా అక్కడ పెట్టు! నే నెవరనుకున్నావు? వీరయ్యని!'' అన్నమాటలు వినిపించాయి.*


*మంగమ్మ నిర్ఘాంతపోయింది. ఆ గొంతు వీరయ్యది కాదు. ఆమె వెనక్కు తిరిగి ఊరివైపు వచ్చేసింది. ఆమె ఇల్లు చేరి, జరిగినదంతా రాజయ్యకు చెప్పి, ‘‘ఎవడో వెధవ నాన్న పేరు పాడు చేస్తున్నాడు. వాణ్ణి నలుగురికీ పట్టియ్యాలి,'' అన్నది. అందుకు రాజయ్య ఉపాయం ఒకటి ఆలోచించి, దాన్ని తల్లికి చెప్పాడు. అందుకు మంగమ్మ సమ్మతించింది. మర్నాడు మంగమ్మ ఊరివాళ్ళతో, ‘‘రేపు ఊరు విడిచి పోతున్నాం,'' అని చెప్పేసింది.*


*ఆ రాత్రి తల్లీ కొడుకు లిద్దరూ భోజనం చేశారు. జుట్టుకు తెల్లరంగు పూసుకుంటే రాజయ్య అచ్చగా వీరయ్య లాగే ఉన్నాడు. ఇద్దరూ శ్మశానం చేరారు. రాజయ్య తెల్లధోవతీ, తెల్లలాల్చీ తొడుక్కుని మర్రిచెట్టు తొరల్రో దాక్కున్నాడు. మంగమ్మ సమీపంలోనే ఒక పొద వెనక నక్కింది. కొంచెం సేపటికి ఊరివైపు నుంచి ఒక మనిషి తెల్లపంచే, తెల్లలాల్చీ ధరించి వచ్చి, మర్రిచెట్టు ఎక్కి కొమ్మల మధ్య కూర్చున్నాడు.*


*తరవాత వాడు గుడ్లగూబలు కూసినట్టు కూశాడు. రాజయ్య ఎప్పుడు బయటికి వస్తాడా అని మంగమ్మ తొరక్రేసే చూస్తున్నది. ఇంతలో అతను రానే వచ్చాడు. వచ్చి, చెట్టు మీద ఉన్న మనిషితో, ‘‘దొంగ వెధవా! నా పేరు పాడు చేస్తావా? చూడు, నిన్నేం చేస్తానో! నే నెవరనుకున్నావు? వీరయ్యని!'' అన్నాడు. ఆ మాటలకు చెట్టు మీది మనిషి కిందపడ్డాడు. వాడు భయంతో వణికి పోతూ, ‘‘తప్పయిపోయింది! క్షమించు, వీరయ్యా!'' అని బతిమాలుకున్నాడు.*


*‘‘నిన్నేమీ చెయ్యను. ఇన్నాళ్లూ దోచిన డబ్బు ఎక్కడ దాచావో చూపించు!'' అని వీరయ్య అనేసరికి ఆ మనిషి గజగజలాడుతూ చెట్టు మొదట్లో తవ్వసాగాడు. ఈలోపల మంగమ్మ ఊళ్ళోకి వెళ్ళి, ‘‘నా మొగుడి పేరు పాడుచేస్తున్న దొంగవెధవని చూద్దురు గాని రండి!'' అని నలుగురినీ వెంట బెట్టుకుని శ్మశానానికి వచ్చింది. నకిలీదయ్యం మనిషి, దీపాలతో వచ్చే, మనుషులను చూసి బిత్తరపోయాడు. వాడు తాను దాచిన దొంగ సొమ్మంతా అప్పటికే ఒక్కొక్కటిగా పైకి తీశాడు.*


*‘‘దొంగ వెధవా! ఇదా నువ్వు చేసే పని?'' అంటూ ఊరివాళ్ళు వాడి మీద పడి చితకతన్నారు. అప్పుడు చెట్టు తొరల్రోనుంచి రాజయ్య తొంగి చూసి, ‘‘ఏమిటీ గొడవ? ఏం జరిగింది? నాకు కాస్త కునుకు పట్టిందిలే!'' అన్నాడు. మంగమ్మ నిర్ఘాంత పోయింది. ఈ నాటకం ఆడినది రాజయ్య కాకపోతే మరెవరు? ఆమె తనకు తెలిసినదంతా చెప్పిన మీదట, వీరయ్య దయ్యమే నకిలీదయ్యాన్ని పట్టి ఇచ్చినట్టు ఊళ్ళోవాళ్ళకు అర్థమయింది.*


*పోయిన సొత్తంతా తిరిగి దొరికింది కూడానూ. ఊళ్ళోవాళ్ళు మంగమ్మకు క్షమాపణ చెప్పుకుని, ఊళ్ళోనే ఉండమని బతిమాలారు. దయ్యంలాగా నటించినవాడు మాత్రం ఎవరూ చెప్పకుండానే, తెల్లవారే లోపల ఊరు విడిచి వెళ్ళిపోయాడు. అటుతరవాత వీరయ్య దయ్యాన్ని చూసినవాళ్ళు లేరు.*

[15/11, 2:02 pm] +91 93913 24915: భగినీ హస్త భోజనం అంటే ఏమిటి? ఏరోజున చేయాలి ?

కార్తీక శుద్ధ విదియ అంటే దీపావళి వెళ్ళిన రెండవ నాడు భగినీ హస్త భోజనం అనే వేడుకను జరుపుకుంటారు. సోదరీ సోదరుల ఆప్యాయతానుబంధాలకు అద్దంపట్టే ఒక సంప్రదాయం ఈ భగినీ హస్త భోజనం. భగిని అంటే అక్క లేక చెల్లెలు. ఆమె పెట్టే భోజనం కనుక భగినీ హస్త భోజనం అంటారు. సోదరీ సోదరుల ప్రేమకి అద్దం పట్టే పండుగల్లో రాఖీ పండుగ తర్వాత చెప్పుకోదగినది ఇది. ఈనాడు అన్నదమ్ములు తమతమ అక్కాచెల్లెళ్ళ ఇళ్ళకు బహుమానాలు తీసుకెళ్ళి, వారి చేతి వంట తిని వారిచేత తిలకం దిద్దించుకుంటారు.


“భయ్యా ధూజీ” అనే పేరుతొ ఉత్తరదేశంలో బాగా ప్రాచూర్యం పొందిన భగినీ హస్తభోజనం సోదరుని క్షేమానికి సంబంధించినది.


భగినీహస్త భోజనం పురాణగాధ

మన పురాణాల ప్రకారం యమధర్మరాజు సోదరి యమున  వివాహమై వెళ్ళాక తన సోదరుని తన ఇంటికి ఎన్నోసార్లు ఆహ్వానించింది. కానీ యమధర్మరాజు వెళ్ళలేకపోయాడు. చివరికి ఒకసారి ఈ కార్తీక మాస విదియ రోజున యమున ఇంటికి వెళ్తాడు. సోదరుడు వచ్చాడని యమున సంతోషంగా పిండివంటలతో భోజనం పెట్టింది. చాలా రోజుల తర్వాత సోదరీ సోదరులు కలుసుకోవటంతో ఇరువురూ సంతోషించారు.


ఆ సంతోషంతో యమధర్మరాజు యమునని ఏదైనా వరం కోరుకోమన్నాడు. వాళ్ళు దేవతలు కనుక వారు కోరే వరాలు కూడా జన ప్రయోజనాలుగా వుంటాయి. ఆమె ఈ కార్తీకశుధ్ధ విదియనాడు లోకంలో ఎక్కడైనా సరే, తన సోదరి ఇంటికి వెళ్ళి భోజనం చేసిన సోదరులకి ఆయురారోగ్యాలు ప్రసాదించమని అడిగింది. ఈ కోరికకి యమధర్మరాజు సంతోషించి, అలా వేడుక జరుపుకున్న వారికి అపమృత్యు దోషం (అకాల మరణం) లేకుండా వుంటుంది, ఆ సోదరి సౌభాగ్యవతిగా వుంటుంది అని వరాలిచ్చాడట. అందువల్లనే ఈ ఆచారం ఆచరణలోకి వచ్చింది. సోదరీ సోదరుల మధ్య అనుబంధాలు పటిష్టంగా ఉండాలంటే  మన పెద్దలు సూచించిన ఇలాంటి సాంప్రదాయాలను మీరూ పాటించండి.

[15/11, 2:05 pm] +91 93913 24915: *స్త్రీ*👑👑👑👑👑👑👑👑👑👑👑

-----


మగాడితోసహా సర్వ జీవులను పుట్టించేసిన దేవుడు చివరగా ఒక స్త్రీని సృష్టించడం మొదలుపెట్టాడు. ఒక రోజూ రెండు రోజులూ కాదు. ఏకంగా వారంరోజులు తీసుకున్నాడు స్త్రీ సృష్టికోసం. మిగిలిన పనులన్నీ మానుకుని తన నాథుడు స్త్రీ సృష్టికోసం ఇంతగా తలమునకలైపోవడం చూసిన దేవత అడిగింది...


*"స్త్రీని సృష్టించడానికి ఎందుకింత సమయం తీసుకున్నారని ?"*


ఆప్పుడు దేవుడు "ఏం చెయ్యను మరి...ఈ స్త్రీ హృదయంలో ఎన్ని విషయాలు పొదగాల్సి వచ్చిందో తెలుసా...ఇష్టాయీష్టాలకతీతంగా ఉండాలీ సృష్టి. వివక్ష తగదు. మొండికేసే పిల్లాడిని క్షణాల్లో దారికి తెచ్చుకోవాలి. చిన్న చిన్న గాయాలు మొదలుకుని ముక్కలయ్యే మనసులవరకూ ఎన్నెన్ని సంఘటనలను ఈ జీవి ఎదుర్కోవాలో తెలుసా...ఆమె ఎంతమందికి ఓ ఔషధంగా పని చేయాలో తెలుసా...ఆమెకు ఆరోగ్యం బాగులేకున్నా సరే తనకు తానే సర్దుకుపోవాలి. అడిగేవారు ఉండరూ ఉండకపోవచ్చు...రోజుకు పద్దెనిమిది గంటలు పని చేయాలి. ఇన్ని రకాల పనులు చెయ్యాల్సి వచ్చినా ఆమెకు ఉన్నవి రెండు చేతులే...." అన్నాడు.


"ఏంటీ ? ఇన్ని పనులు చేయడానికి ఆమెకు రెండు చేతులేనా?" అని ఆశ్చర్యపోతూ దేవత ఆమెను మెల్లగా తాకింది. "ఇదేంటీ ఇంత మృదువుగా ఉందే ఈమె దేహం" అని ప్రశ్నించింది. 


ఆప్పుడు దేవుడు "ఆమె శారీరకంగా మృదువుగా మెత్తగా నాజూకుగా ఉండొచ్చు. కానీ మానసికంగా ఆమె ఎంతో బలవంతురాలు. అందుకే ఆమె ఎన్నో సమస్యలను ఎదుర్కోగలదు. అంతేకాదు, ఆమె అన్ని భారాలనూ తట్టుకోగలదు. ఇష్టం,  కష్టం, ప్రేమ, కోపం, తాపం, అంటూ అన్ని భావోద్వేగాలనూ ఆమె చవిచూడాలి. అవసరమైతే దిగమింగాలి. కోపమొస్తే నవ్వుతూ వెల్లడించే శక్తి ఆమెకుండాలి. తనకు న్యాయం అనిపించినప్పుడు అందుకోసం పట్టుపట్టడమూ తెలుసు. ఇతరుల దగ్గర ఆశించేది ప్రేమానురాగాలను...." అన్నాడు.


"ఓహో. ఈమె ఆలోచించగలదా" అని దేవత అడిగింది.


అప్పుడు దేవుడు "ఎందుకాలోచించదు? అన్ని విషయాలూ ఆలోచించడమే కాకుండా సమస్యలు ఎదురైతే పరిష్కారాలు చెప్పగలదు..." అన్నాడు.


దేవత ఆమె చెక్కిళ్ళను తాకి "ఈ చెక్కిళ్ళు తడిగా ఉన్నాయేంటీ? కన్నీరు కారుస్తోందిగా....ఏంటిది? " అని అడిగింది.


అప్పుడు దేవుడు "అదా...కన్నీరది. ఆ కన్నీటిలో ఆనందమూ ఆవేదనా దుఃఖమూ దిగులూ ఆశ్చర్యమూ భయమూ అంటూ అన్ని రకాల ఉద్వేగానుభూతులూ ఉంటాయి. ఆ కన్నీటికున్న  శక్తి అనంతం....పైగా మరో జీవీకి ప్రాణంపోసి పది నెలలూ పొట్టలో మోసే నేర్పు ఆమెకు ఉంది" చెప్పాడు. 


దేవత ఆశ్చర్యపోతూ "మీ సృష్టిలో విశిష్టమైనది ఇదే. .." అని చెప్పింది. 


అయితే దేవుడు "అంతా బాగానే ఉన్నా ఆమెకు తన విలువా శక్తీ తెలిసినా వాటిని అవసరమైతే తప్ప ప్రయోగించదు. అప్పటివరకూ తెలియనట్టే ఉంటుంది..." అని చెప్పి భూమ్మీదకు పంపాడు స్త్రీని.....


*ఎచ్చట స్త్రీ గౌరవించబడుతుందో - 

ఆ ఇంట సర్వదేవతలు కొలువై ఉంటారు. 

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏


     🙏🏻లోకాసమస్తాః సుఖినోభవంతు.🙏❤️❤️❤️


సేకరణ...

Dedicated to “daughters and daughter in laws of Nuthakki’s

[15/11, 2:05 pm] +91 93913 24915: శివుడు సైనికుడు అయిన క్షేత్రం-జ్వాలాపహారేశ్వరస్వామి 


🌷 సాగర మథనంలో ఎగజిమ్మిన గరళాన్ని మింగి గరళకంఠుడయ్యాడు. భూలోకవాసుల దాహార్తిని తీర్చేందుకు గంగమ్మను తలమీద ధరించి గంగాధరుడని పిలిపించుకున్నాడు. సకల జనులకు ముక్తినొసగుతూ ముక్తేశ్వరుడయ్యాడు… ఇలా ఒకటా రెండా భక్తుల పాలిట కొంగుబంగారంగా భాసిల్లుతున్న బోళా శంకరుడికి నామాలు అనేకం. మహిమలు అనంతం. అంతటి మహిమకల స్వామి భక్తుడి ప్రాణాలు రక్షించడానికి స్వయంగా పహారా కాసిన క్షేత్రం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో కొలువైన జ్వాలాపహరేశ్వరస్వామి ఆలయం. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడిమీదకు అనేకసార్లు దండెత్తిన జరాసంధుడు ఒకానొక యుద్ధంలో కిట్టయ్యచేతిలో మరణాన్ని తప్పించుకుని పారిపోయి హేలాపురి చేరుకుంటాడు. 


🌷 అక్కడే ఒక శివలింగాన్ని ఏర్పాటు చేసుకుని శివుడి కోసం తపస్సు చేస్తాడు. అతడి తపస్సుకు మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటాడు. అప్పుడు జరాసంధుడు తనకి శ్రీకృష్ణుడి చేతిలో మరణం సంభవించకుండా ఎప్పుడూ తన దగ్గరే ఉండి తనను రక్షించమని వేడుకుంటాడు. దీంతో శివుడు లింగరూపంలోనే ఉంటూ జరాసంధుడికి పహారా కాయడం వల్ల ఈ క్షేత్రానికి జ్వాలాపహరేశ్వర ఆలయం అనే పేరు వచ్చింది. కాలక్రమంలో హేలాపురి ఏలూరుగా స్థిరపడిపోయింది. 


చరిత్రకు దర్పణం

🌷 జ్వాలాపహరేశ్వరస్వామి ఆలయాన్ని పదో శతాబ్దంలో వేంగి చాళుక్యులు నిర్మించారని ఆలయ శాసనాలు తెలియజేస్తున్నాయి. వేంగీ రాజుల కాలంలో నిర్మించిన నూట ఎనిమిది శివాలయాల్లో జ్వాలాపహరేశ్వర ఆలయం ఒకటి. నాటి నుంచి నేటి వరకూ స్వామి భక్తుల పాలిట కొంగుబంగారంగా పూజలందుకోవడం విశేషం. ఈ క్షేత్రంలో కొలువైన జ్వాలాపహరేశ్వరస్వామిని జరా పహరేశ్వరస్వామి, జలా పహరేశ్వరస్వామి అని కూడా పిలుస్తారు. అంతరాలయంలోని శరభసాళ్వం అనే కుడ్యశిల్పం విశేష ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. 


🌷 శరభ సాళ్వం దర్శనంతో కాలసర్పదోషాలు తొలగిపోతాయని ప్రతీతి. కాకతీయుల కాలంలో శివాచార్యులు అనే శివభక్తుడు స్వామిని సేవించారని చెబుతారు. ప్రముఖ చరిత్రకారులు ఇంగువ కార్తికేయశర్మ, మల్లంపల్లి సోమశేఖరశర్మ ఆలయాన్ని సందర్శించి, ఇది వేంగి చాళుక్యుల కాలం నాటి ఆలయమని నిర్ధరించారు. 


సోదరభావానికి ప్రతీక

🌷 ఈ ఆలయాన్ని ఆనుకుని ముస్లింల దర్గా ఉంది. శివాలయంలోని రాజనంది కాలికి హజ్రత్‌పాషా షహీద్‌ పంచలోహ కడియాన్ని సమర్పించారని ప్రతీతి. దీనికి నిదర్శనంగానే ముస్లిం సోదరులు జ్వాలాపహరేశ్వరస్వామి ఆలయానికి వచ్చి నందిని దర్శించుకుంటారు. అలాగే దర్గాలో జరిగే ఉరుసు ఉత్సవాల్లో ఆలయ అర్చకులూ, హిందూ సోదరులూ పాల్గొంటారు. 


🌷 ఈ ఆచారం ఇప్పటికీ కొనసాగుతోంది. ఆలయంలోని నందిని వేంగి చాళుక్య రాజనందిగా పిలుస్తారు. సంతానంలేని వారు నంది మెడలో శనగల మూట కడితే తప్పక సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఏ శివాలయంలోనైనా నంది తలమీద నుంచి శివయ్యను దర్శించుకోవడం ఆచారం. కానీ ఈ ఆలయంలో మాత్రం ఆలయం వెనక గర్భాలయం గోడకు ఉన్న రంధ్రం నుంచి శివుడినీ, ఆ తర్వాత రాజనందినీ దర్శించుకోవడం విశేషం. 


ఇతర ఆలయాలు

🌷 ఆలయ ప్రాంగణంలోనే వందల ఏళ్ల చరిత్రగల మహిషాసురమర్దని అమ్మవారి ఆలయం ఉంది. అమ్మవారు ఇక్కడ పెద్దమ్మగా పూజలందుకుంటోంది. అమ్మవారి విగ్రహాన్ని జగద్గురు ఆదిశంకరాచార్యులు ప్రతిష్ఠించారని చెబుతారు. 


🌷 శరన్నవరాత్రులు, కల్యాణోత్సవం, కార్తికమాసం, మహాశివరాత్రి పర్వదినాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుంటారు. పెద్దమ్మ ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేస్తే కోరిన కోర్కెలు తప్పక నెరవేరతాయని భక్తుల నమ్మకం. ఈ ప్రాంగణంలోనే సీతారామస్వామి ఆలయం కూడా ఉంది. ఆలయ ప్రదక్షిణ మార్గంలో ప్రతిష్ఠించిన గణపతిని సకల కార్యసిద్ధికి ప్రతీకగా కొలుస్తారు. 


ఎలా చేరుకోవాలి

🌷 ఏలూరులో కొలువైన జ్వాలాపహరేశ్వరస్వామిని దర్శించుకోవడానికి రైలు, రోడ్డు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లా కేంద్రమైన ఏలూరు నగరంలో కొత్త బస్‌స్టేషన్‌కి మూడు కి.మీ. దూరంలో ఉందీ ఆలయం. 


🌷 రాష్ట్రం నలుమూలల నుంచీ ఏలూరుకు బస్సు సౌకర్యం ఉంది. బస్టాండు నుంచి ఆటోరిక్షాల్లో ప్రయాణించి ఆలయానికి చేరుకోవచ్చు. రైల్లో వచ్చే భక్తులు… ఏలూరు రైల్వేస్టేషన్‌లో దిగి, రోడ్డు మార్గంలో ప్రయాణించి స్వామిని చేరుకోవచ్చు. 


 శ్రీ మణికంఠ  పుష్కరాల అన్నదాన సేవా సమితి


సర్వదా ఈశ్వరుని సేవలో 

మీ రుద్రాక్ష స్వామి

[15/11, 2:09 pm] +91 93913 24915: కార్తీక దీపారాధన శ్లోకము


 శ్లోకం ||

      కీటా: పతంగా: మశకాశ్చ  వృక్షా:

         జలే స్థలే యే నివసన్తి జీవా:

      దృష్ట్వా ప్రదీపం నచజన్మ భాగిన:

       భవంతి త్వం శ్వపచాహి విప్రా:||


దీప దాన శ్లోకము

 సర్వజ్ఞానప్రదం దీపం సర్వ సంపత్ శుభావహం!

దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదామమ !!!🕉️🔥

కామెంట్‌లు లేవు: