15, నవంబర్ 2020, ఆదివారం

శని దేవుడు

 ,,, 

 ప్రపంచ గతిని మార్చగలిగే వాళ్ళు శని దేవుడు ఒక్కడే, శని 3oసంవత్సరముల తర్వాత. తన స్వక్షేత్రం అయిన మకర రాశిలో సంచారం చేస్తున్నాడు, ఇది ముమ్మాటికీ, మానవజాతి యొక్క కర్మ ఫలం అందించుటకు అనేది వాస్తవం, ప్రపంచ గతిని మార్చిన కలిగినవాడు శని ఒక్కడే,, మానవుడి యొక్క కర్మలను అనుసరించి, ప్రకృతి పట్ల మానవుడు చేసిన మంచి లేదా చెడు అనుసరించి, మానవుడు తన జీవితంలో చేసిన మంచిచెడులు అనుసరించి, పూర్వజన్మ కర్మలను అనుసరించి, ఫలితాలు ఇచ్చే ఒకే ఒక్కరు న్యాయాధిపతి శనిదేవుడు, దీనికి సంబంధించిన ఆధారాలు, జ్యోతిష్య శాస్త్ర సంబంధమైన అనేక విషయాలు మీకు వివరించాను సుమారు ఒక సంవత్సర కాలం, 

 ప్రస్తుతం ప్రజాస్వామిక వ్యవస్థలో. మానవ జీవన మనుగడకు, ఆదార భూతం శని ఒక్కడే.. శనిని నమ్మి పూజించేవారికి. పూర్వ జన్మ కర్మ దోషాలు కాక, ప్రస్తుత జన్మలో తెలిసీ తెలియక చేసిన కర్మల కూడా తొలగిపోతాయి అనుటలో సందేహం లేదు, శనిని నమ్మినవారికి. మంద గ మనుడు కనక ఫలితాలు కాస్త ఆలస్యంగా ఉండే మాట వాస్తవం, నిన్ను పరీక్షించి పరీక్షించి,యోగాలు ఇస్తాడు, 

 శని దశ కంటే ముందు వచ్చే గురుగ్రహ దశలో, ఒకవేళ మన జాతకంలో అనేక రాజయోగాలు ఏర్పడి ధన యోగాలు ఏర్పడితే, శని మన జాతకంలో వ్యతిరేకంగా ఉంటే, గురుగ్రహం ఇచ్చినటువంటి అన్ని యో గాలను తొలగించి, బికారిని చేయగల సమర్ధుడు శని దేవుడు, అదే శని దేవుడు ఇచ్చినటువంటి యోగాలను, ధన యోగాలను రాజు యోగాలను, ఇటువంటి శుభ యోగాలు అయినా సరే కూడా, తదుపరి వచ్చే బుధ మహర్దశ లో, బుధుడువ్యతిరేకంగా ఉన్నప్పటికీ బుధుడు వ్యతిరేక ఫలితాలు ఇవ్వగలరు ఏమోకానీ. శని గ్రహం ఇచ్చిన ఏ విధమైనటువంటి శుభ యోగాలు తీసుకోలేరు

 అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, 

 శని దేవుడు ఒక్కడే సుపీరియర్, 

 శని నమ్మిన వాడికి ఆరాధించే వాడికి

 ఏ విధమైన ఆటంకాలు ఉండవు, 

 జీవితం మహోజ్వ లంగా గా ఉంటుంది అనడంలో సందేహం లేదు.

 చెప్పటం నా ధర్మం ఆచరించడం మీ వంతు

 సర్వేజనా సుఖినోభవంతు

 సమస్త సన్మంగళాని భవంతు,

కామెంట్‌లు లేవు: