"విస్సన్న చెప్పిందే వేదం" అని మన పండిత వరులందరు వినియే వుంటారు...ఈ విస్సన్న ఎవరంటే....ఇంద్రగంటి విశ్వపతి శాస్త్రి గారు.. కోన సీమలోని "అయినపల్లి" గ్రామంలో కొన్నేళ్ల క్రితం వుంటూ వుండిన " బులుసు అచ్చయ్య శాస్త్రి" గారనే పండితుని కి శిష్యుడు.. విస్సన్న గారిది కోటిపల్లి నివాసి. గోపాలకృష్ణ శాస్త్రి గారి అబ్బాయి. ఫ్రెంచి,"యానాం" కవులలో ఎందరో విద్వాంసులు,పండితులు వున్నారు.వీరి గురువైన అచ్చయ్య శాస్త్రి గారు జగద్విఖ్యాత పండితులు..గురువు గారి లాగానే విస్సన్న a/s విశ్వపతి శాస్త్రి కూడా శ్రౌతంలో అథారిటీ గురువు గా పేరు గాంచి "విస్సన్న చెప్పిందే వేదం"గా నానుడి పుట్టింది..ఈ విషయాన్ని చెళ్లపిళ్ల వెంకటశేష శాస్త్రి గారు ఒకానొక సందర్భంలో తెలియజేశారు.. విస్సన్న చెప్పిన ఓ శ్లోకం చూడండి...ఇది ఇప్పటికీ ప్రమాణంగా వుంది...
"విస్సన్న చెప్పిందే వేదం"
శ్లో. " ఘృత పక్వం తైల పక్వం పక్వం కేవలం వహ్నినా
శూద్రాదపి సమశ్నీయా దేవ మాహ పితామహః "
(శ్రీ విస్సన్న గారు మన్యం వారి దివాణంలో ఇతర పండితులందరితో వ్యతిరేకిస్తూ పై శ్లోకం చదివి కోమట్ల ఇళ్ళల్లో ఆబ్దికాలప్పుడు బ్రాహ్మణులు నూనెలో నేతిలో వేయించిన గారెలూ అరిసెలూ ఇంకా అటువంటివే ఇతరాలూ తిన వచ్చనీ తప్పు లేదనీ తీర్మానం చేసేరట. మరి '' విస్సన్న చెప్పినదే వేదం '' కదా? ... ఈ విధంగా '' నూనె వస్తువులకీ, నిప్పుమీద కాల్చిన వాటికీ అంటులేదనీ ఎప్పుడైనా తినవచ్చుననీ '' అంగీకరించబడింది. అందువల్ల రొట్టెలు తినడానికి రేవు వచ్చేవరకూ వేచి ఉండక్కర్లేదనే సామెత పుట్టిందన్నమాట. బాగుందా? (కీ.శే. చెళ్ళపిళ్ళ కవి గారికి కృతజ్ఞతలతో)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి