4, అక్టోబర్ 2023, బుధవారం

శ్రీ దేవీ భాగవతం

 శ్రీ దేవీ భాగవతం

.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః

శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|

నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||

శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|

దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||


శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ

సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |

పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా

సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||


శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |

సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||

బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|

మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||



మగ్నాహం నాదసింధౌ వై నక్రహీనే రసాత్మకే

అక్షారే సుఖసంపూర్ణే తిమింగిల వివర్జితే |

(26-57)

ధాత్రి చెప్పిన మాటలతో దమయంతి అభిప్రాయాన్ని గ్రహించిన సంజయుడు తన పట్టమహిషి

కైకేయితో సంప్రదించాడు. కైకేయీ! ధాత్రిమాటలు విన్నావుగదా! మన అమ్మాయి నారదుణ్ణి వరించిందిట.

అతడు ముని. ఇప్పుడు కోతిముఖం. ఎంత అందంగా ఉందో చూడు. దమయంతికి బుద్ధి

ఉందంటావా ? ఈ కురూపికి ఈ భిక్షువుకి ఇచ్చి వివాహం చెయ్యనా? అసంభవం. నువ్వు అమ్మాయితో

మాట్లాడు. బుద్ధిమరల్చు - అని ఆజ్ఞాపించి వెళ్ళాడు.

కైకేయి దమయంతిని తన మందిరానికి పిలిపించుకుంది. ఏకాంతంలో ప్రబోధించింది.

అమ్మాయీ! నీ అందానికి ఈ వానరాస్యుడా భర్త? చూసేవాళ్ళు ఏమనుకుంటారు? పరిహసించరూ. పైగా

అతడు నిర్ధనుడు. భిక్షుజీవనం. వారిపంచనూ వీరిపంచనూ జీవితం గడుపుతున్నాడు. నువ్వేదో చాలా

తెలివైనదానివి అనుకున్నాను. చదువుకున్నావుకదా అనుకున్నాను. చివరికి ఇదా నీ నిర్ణయం? ఒక

భిక్షుకుడిని చూసి మోహపడ్డావా? నువ్వేమో పూలతీగెలా సుకుమారివి. అతడేమో వంటినిండా బూడిద

పులుముకునే మొరటు మనిషి. సుగంధద్రవ్యాలు అస్సలు వాడనేకూడని మునివృత్తి. మీ ఇద్దరికీ ఎలా

కుదురుతుంది చెప్పు? ఆ కురూపితో సంసారం ఎలా చేస్తావు, ప్రేమ ఎలా పుడుతుంది? అనవసరంగా

మొండితవానికి పోవద్దు. చక్కని రాకుమారుణ్ణి చూసి వివాహం జరిపిస్తాం. చేసుకో. ఇప్పటికే మీ నాన్న

చాలా బాధపడుతున్నారు. బాధపడరుమరీ. కోమలమైన మాలతీలత తుమ్మచెట్టుకి (బుబూలవృక్షం)

అల్లుకుంటే చూసినవాళ్ళ మనస్సు చివుక్కుమనదూ? ఎంతమూర్ఖుడైనా తాంబూలాన్ని దాసేరకుడికి

ఇంద-తిను అని అందిస్తాడా? (దాసేరకుడు = దాసీపుత్రుడు. దాశేరకుడు - పల్లెవాడు). చెయ్యిపట్టుకుని

ఆ వావరముఖుడి పక్కన నువ్వు నిలబడితే అబ్బా! అసలు ఆ దృశ్యాన్ని ఊహించుకోలేకపోతున్నాను

-ఎంత అసహ్యంగా ఉంటుందో! కన్నవాళ్ళ గుండెలు మండిపోవూ? పోనీ అంటే ఇదేదో ఒక పూటతోనో

ఒక రోజుతోనో తీరిపోయేది కాదాయె. వివాహమంటే నూరేళ్ళ బంధం. ప్రాణాలు గుటుక్కుమనేంతవరకూ

కట్టుకున్నవాడితో కాలం గడపాల్సిందే. ఎలా గడుపుతావ్? ఈ సంగతి ఆలోచించావా?

లగ్నాం బబూలవృక్షేణ కోమలాం మాలతీలతామ్ ·

దృష్ట్యా కస్య మనః ఖేదం చతురస్య న గచ్ఛతి

దాసేరకాయ తాంబూలీదళాని కోమలాని కః

దదాతి భక్షణార్థాయ మూర్ఖోఽపి ధరణీతలే


కుముఖేన సమం వార్తాన రుచిం జనయత్యతః ।

అమృతేస్తు కథం కాలః క్షపితవ్యస్త్వయామునా॥ (27-10, 11, 13)

కామెంట్‌లు లేవు: