*🕉️🪷 ఓం శ్రీ కృష్ణపరబ్రహ్మణే నమః 🪷🕉️*
*🪷 శ్రీ మద్భగవద్గీత🪷*
*🌸 అథ ద్వితీయోధ్యాయః 🌸*
*🌸 సాంఖ్య యోగః 🌸*
*2-అధ్యాయం,49వ శ్లోకం*
*దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాద్ధనంజయ |*
*బుద్దౌ శరణమన్విచ్ఛ కృపణాః ఫల హేతవః || 49*
*ప్రతిపదార్థం*
బుద్ధి యోగాత్ = (సమత్వ ) బుద్ధి యోగము కంటెను; కర్మ = సకామకర్మ ; దూరేణ అవరమ్ (అతః )= మిక్కిలి నిన్న శ్రేణికి చెందినదని కావున ; ధనంజయ = ఓ ధనంజయా! ; బుద్దౌ= సమత్వ బుద్ధి యందే; శరణమ్ = తరుణోపాయమును; అన్విచ్ఛ = వెదకుము ( సమత్వ బుద్ధియోగమును ఆశ్రయింపుము ) ;హి = ఏలనన ; ఫల హేతవః = ఫలములను ఆసించువారు (ఫలాసక్తి తో కర్మలను ఆచరించు వారు )i కృషణాః = అత్యంత దీనులు;
*తాత్పర్యము*
ఈ సమత్వ బుద్ధి యోగము కంటెను సకామ కర్మ మిక్కిలి నిమ్నశ్రేణికి చెందినది. కావున ఓ ధనంజయా! నీవు సమత్వ బుద్ధియోగమునే ఆశ్రయింపుము - ఏలననా ఫలాసక్తితో కర్మలు చేయువారు అత్యంత దీనులు కృపణులు.
*సర్వేజనాః సుఖినోభవంతు*
*హరిః ఓం 🙏🙏*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి