4, అక్టోబర్ 2023, బుధవారం

బృందావనార్చన సేవ :*

 *బృందావనార్చన సేవ :*


మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారు చివరి దశ సాధన కోసం, ఇప్పుడు మొగిలిచెర్ల కి దగ్గరలో ఉన్న మన దత్తక్షేత్రాన్ని నిర్దేశించుకున్నారన్న విషయం మన దత్తబంధువులందరికీ విదితమే. శ్రీ స్వామి వారు సాధన చేసుకునేందుకు వీలుగా ఆశ్రమ నిర్మాణం తామే ప్రత్యక్షంగా ఉండి మరీ పర్యవేక్షించుకున్నారు, ఎందుకంటే వారి మోక్షప్రాప్తిని నిర్ధారించే ఈ ఆవాసంలో ఎటువంటి పొరపాట్లు జరగకూడదు అని. అయితే, ఆశ్రమ నిర్మాణ కర్త అయిన మీరాశెట్టి గారికి కానీ, స్థలం ఇచ్చిన పవని కుటుంబీకులకు కానీ, శ్రీ స్వామి వారు ఇచ్చిన ఆశ్రమ ప్రధమ ప్రణాళికలో మనం ఇప్పుడు బృందావనం గా వ్యవహరిస్తున్న నేల మాళిగ గురించి ఎటువంటి ప్రస్తావన లేదు. కేవలం ఆశ్రమ నిర్మాణం జరుగుతున్న సమయంలో మాత్రమే, అక్కడ ఉన్న నిర్మాణ కార్మికులకు చెప్పి ఈ నేలమాళిగను స్వయంగా శ్రీ స్వామి వారే నిర్మింప చేయించుకున్నారు. అటుపైన శ్రీ స్వామి వారి తీక్షమైన తపోసాధనకు ఈ నేలమాళిగ ఆవాసంగా మారింది. అంతే కాదు, శ్రీ స్వామి వారు కాపాలమోక్షం పొందిన తరువాత, శ్రీ స్వామి వారు సాధన చేసుకున్న కొన్ని విశేష వస్తువులతో పాటు, శ్రీ స్వామి వారి పార్థివ దేహాన్ని సైతం మనం బృందావనంగా వ్యవహరిస్తున్న నెలమాళిగలో నిక్షిప్తం చెయ్యడం అయ్యింది. అంతటి మహా తపస్సుకు, తపస్వికి నిలయం అయ్యింది కనుకనే, ఇప్పటికీ కొంత మంది భక్తులకి, బృందావన దర్శనం చేసే సమయంలో ఒకరకమైన ప్రకంపనలకు లోనవుతారు. 


ఇక అంతటి మహిమాన్విత, తపఃశక్తి నిలయమైన బృందావనాన్ని అర్చించే భాగ్యన్ని శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం, మొగిలిచెర్ల వారు ఈ శుక్రవారం అనగా *తేదీ : 06-10-2023 నాడు భక్తులకి కల్పిస్తున్నారు. ఈ సేవ, పైన చెప్పిన తేదీలో ఉదయం 9.30 గంటలకు ప్రారంభమయ్యి మధ్యాహ్నం 12.30 గంటలకు ముగుస్తుంది*. శ్రీ స్వామి వారు నైష్ఠిక బ్రహ్మచారి కనుక, ఈ సేవకు పురుషులు మాత్రమే అర్హులు. ఆ సమయంలో స్త్రీలు శ్రీ స్వామి వారి అనేక కైంకర్యాలకు వాడే వస్తువులని శుభ్రం చెయ్యవొచ్చు. ఎలా అయితే పల్లకిని మోసి మనకి శ్రీ స్వామి వారి పైన మన భక్తిని చాటుకొని మన విన్నపాలని విన్నవించుకుంటామో, అలానే *బృందావనార్చన సేవ కూడా శ్రీ స్వామి వారి కరుణకి పాత్రులు కావడానికి ఒక దివ్య మార్గం.* ఇంతటి మహాకార్యంలో పాల్గొనడానికి మరిన్ని వివరాల కోసం, క్రింద ఇచ్చిన నంబర్లను సంప్రదించగలరు.


నెంబర్ :  *85559 52927*

               *82475 77991*


ఇట్లు,

శ్రీ దత్తాత్రేయ స్వామి మందిర సిబ్బంది, మొగిలిచెర్ల


సర్వం,

శ్రీ దత్తకృప

కామెంట్‌లు లేవు: