29, ఏప్రిల్ 2021, గురువారం

*మనో దైర్యం

 *చావు వార్తలు ఆపండి*

*మనో దైర్యం నింపండి*


ఒక రైతు పొలం పని చేసుకొని చీకటి పడ్డంక ఇంటికి వెళ్తున్నాడు. దారిలో కాళ్ల మీద ఎదో పడ్డట్లు అనిపించింది. మసక చీకట్ల తెల్ల తెల్లగ కన్పించిన దాన్ని చూసి.. పాము అనుకొని చేతికర్రతో నాలుగైదు దెబ్బలేసి పాము సచ్చింది అనుకున్నాడు. ఇంటికి పోయి కుటుంబ సభ్యులకు విషయం చెప్పాడు. పాము కరవలేదు కానీ దానిని చంపిన అని వివరించాడు. కుటుంబ సభ్యులు దైర్యం చెప్పి పడుకోమంటే ఆ రైతు భయం భయంగనే ఆ రాత్రి నిద్రపోయాడు. ఉదయం చూస్తే చనిపోయి ఉన్నాడు.

కుటుంబ సబ్యులు ఏడ్చి ఏడ్చి.. పాము కరిచిందేమో చూద్దామని రాత్రి రైతు నడిచిన దారిలో వెతికారు. చచ్చిన పాము కనపపడలేదు. కానీ చనిపోయిన రైతు నడుముకు ఉండాల్సిన వెండి మొలతాడు వాళ్లకు దొరికింది. తన వెండి నడుము గొలుసు జారి తన కాళ్లమీద పడ్డట్టుంది. ఆ రైతు పాము అనుకొని భయంతో ఆలోచించి ఆలోచించి నిద్రలోనే చనిపోయాడు‌. భయం ఎంత చెడ్డదో ఈ కథ స్పష్టంగా చెప్పింది. 


ఇప్పుడు సేమ్ ఇదే పరిస్థితి కరోనా విషయంలోనూ జరుగుతుంది. ఈ మధ్య గాలి ద్వార కరోన వ్యాప్తి చెందుతుందని ప్రచారం చేస్తున్నరు అది నిజమో.. అబద్దమో.. తెలువదు. కానీ కరోనా గాలి ద్వారా వ్యాపిస్తే ఈ భూమి మీద మనుషులు అంతం అయినట్టే.


99% రికవరీ రేటును వదిలి కరోనాను భూతద్దంలో చూపెడితే ఎట్ల?? కరోనా చావులల్ల 90% భయం, ఇతర శరీర రుగ్మతల వల్లనే అన్నది 100% వాస్తవం.

 

*అన్ని తెలిసినోడు అమావాస్య నాడు చనిపోతే.. ఏమీ తెల్వనోడూ ఏకాశినాడు సచ్చిండంట*

కరోనా గురించి ఎక్కువ జాగ్రత్తలు తీసూకుంటూ తనకు తెలవకుండ భయానికి గురైతున్నరు చాలా మంది. కరోనా గురించి పెద్దగా అవగాహన లేనోళ్లు.. కరోనా వార్తలు అసలే పట్టించుకోనోళ్లు.. హాయిగా పని చేసుకొని ఏదైతే అదే అయితది అని మొండిగ ఉన్నోళ్లకు ఏమైతలేదు. తలలో భయాన్ని నింపితే అది గెలుకుతనే  ఉంటది.

దయచేసి కరోనా (చావు) వార్తలు పోస్ట్ చేయకండి. మనో ధైర్యాన్ని ఇచ్చే విషయాలను పోస్ట్ చేయండి.

🙏🙏🙏 🙏🙏🙏 🙏🙏🙏

కామెంట్‌లు లేవు: