30, ఏప్రిల్ 2021, శుక్రవారం

_రాబోయే తరాలకు


ఎండమావులు


                                 *****


చిన్నప్పుడు

ఏ పండక్కో..పబ్బానికో

కొత్త గౌను కుట్టిస్తే..

ఎంత ఆనందమో...


ఎప్పుడు పండగ

వస్తుందా, ఎప్పుడు

వేసేసుకుందామా

అన్న ఆతృతే...


ఇంటికి చుట్టాలొచ్చి

వెళ్తో వెళ్తూ.. చేతిలో

రూపాయో... అర్ధ

రూపాయో పెడితే

ఎంత వెర్రి ఆనందమో...


చుట్టాలొచ్చి వెళ్లిపోతుంటే

దుఃఖం తన్నుకు వచ్చేది...

ఇంకా ఉంటే బాగుండు

అన్న ఆశ...

ఎంత ఆప్యాయతలో...


సినిమా వచ్చిన ఏ

పదిహేను రోజులకో

ఎంతో ప్లాన్ చేసి

ఇంట్లో ఒప్పించి

అందరం కలిసి

నడిచి వెళ్లి..

బెంచీ టికెట్

కొనుక్కుని  సినిమా

చూస్తే ఎంత ఆనందమో...


ఇంటికొచ్చాకా ఒక గంటవరకూ

ఆ సినిమా కబుర్లే...

మర్నాడు స్కూల్ లో

కూడా...

ఆ ఆనందం ఇంకో పది

రోజులుండేది...


అసలు రేడియో విచిత్రం..

అందులోకి మనుషులు

వెళ్లి మాట్లాడతారా అన్న

ఆశ్చర్యం...అమాయకత్వం..


పక్కింట్లోవాళ్లకి రేడియో

ఉంటే..ఆదివారం

మధ్యాహ్నం వాళ్ళ గుమ్మం

ముందు కూర్చుని 

రేడియోలో సంక్షిప్త

శబ్ద చిత్రం (ఒక గంటకి

కుదించిన) సినిమాని

వింటే ఎంత ఆనందం...

మనింట్లో కూడా రేడియో

ఉంటే...అన్న ఆశ...


కాలక్షేపానికి లోటే లేదు...

స్నేహితులు,

కబుర్లు, కధలు,

చందమామలు,

బాలమిత్రలు...


సెలవుల్లో మైలు దూరం

నడిచి లైబ్రరీ కి వెళ్లి

గంటలు గంటలు

కథల పుస్తకాలు

చదివి ఎగురుకుంటూ

ఇంటికి రావడం....


సర్కస్ లు, 

తోలు బొమ్మలాటలు

లక్కపిడతలాటలు...

దాగుడు మూతలు...

చింత పిక్కలు

వైకుంఠ పాళీ

పచ్చీసు..

తొక్కుడు బిళ్ళలు..

ఎన్ని ఆటలో...


మూడు గదుల రైలుపెట్టె

లాంటి ఇంట్లో అంతమంది

ఎంత సంతోషంగా ఉన్నాం...

వరుసగా కింద చాపేసుకుని

పడుకున్నా ఎంత హాయిగా

సర్వం మరిచి నిద్రపోయాం...


అన్నంలో కందిపొడి..

ఉల్లిపాయ పులుసు

వేసుకుని తింటే

ఏమి రుచి...

కూర అవసరమే లేదు..


రెండు రూపాయలు తీసుకెళ్లి

నాలుగు కిలోల 

బియ్యం తెచ్చేది...

ఇంట్లో,  చిన్నా చితకా

షాపింగ్ అంతా నేనే...

అన్నీ కొన్నాకా షాప్

అతను చేతిలో గుప్పెడు

పుట్నాల పప్పో, పటికబెల్లం

ముక్కో పెడితే ఎంత

సంతోషం...

ఎంత బరువైనా

మోసేసేవాని..


ఎగురుతున్న విమానం

కింద నుండి 

కళ్ళకు చెయ్యి అడ్డం

పెట్టి చూస్తే ఆనందం...


తీర్థంలో ముప్పావలా

పెట్టి కొన్న ముత్యాల దండ 

చూసుకుని మురిసి

ముక్కలైన రోజులు...


కొత్త పుస్తకం కొంటే

ఆనందం...వాసన

చూసి మురిపెం..

కొత్త పెన్సిల్ కొంటే

ఆనందం...

రిక్షా ఎక్కితే...

రెండు పైసల

ఇసుఫ్రూట్ తింటే

ఎంత ఆనందం..?


రిక్షా ఎక్కినంత తేలికగా... 

ఇప్పుడు విమానాల్లో 

తిరుగుతున్నాం...

మల్టీప్లెక్స్ లో ఐమాక్స్

లో సినిమా చూస్తున్నాం.

ఇంటర్వెల్ లో

ఐస్ క్రీం తింటున్నాం..


బీరువా తెరిస్తే మీద పడి

పోయేటన్ని బట్టలు...

చేతినిండా డబ్బు...

మెడలో ఆరు తులాల

నగ....

పెద్ద పెద్ద ఇళ్ళు, కార్లు...

ఇంట్లో పెద్ద పెద్ద టీవీలు...

హోమ్ థియేటర్లు...

సౌండ్ సిస్టమ్స్, అరచేతిలో

ఫోన్లు...అరచేతిలో

స్వర్గాలు...

అనుకోవాలే గానీ క్షణంలో

మన ముందు ఉండే 

తిను బండారాలు.. 

సౌకర్యాలు...


అయినా చిన్నప్పుడు

పొందిన  ఆ ఆనందం

పొందలేకపోతున్నాం

ఎందుకు నేస్తం...?

ఎందుకు...?ఎందుకు...?


చిన్నప్పుడు కోరుకున్నవి

అన్నీ ఇప్పుడు  

పొందాము కదా...

మరి ఆనందం లేదేం...

ఎందుకంత మృగ్యం

అయిపోయింది...?

ఎండమావి 

అయిపోయింది..?


మార్పు ఎందులో...?

మనలోనా...?

మనసుల్లోనా...?

కాలంలోనా...?

పరిసరాల్లోనా...?

ఎందులో... ఎందులో...?

ఎందులో నేస్తం...?

చెప్పవా తెలిస్తే....!!                    


👍 _*త్వరలో అంతరించబోతున్న పాత తరం తస్మాత్ జాగ్రత్త ...*_😢😢🙏


_*రాబోయే 10/15 సంవత్సరాలలో ఒక క్రమశిక్షణ కలిగిన, కష్టపడిన తరం ఈ ప్రపంచంనుండి కనుమరుగవబోతూవుంది..!


_అవును ఇది ఒక చేదు నిజం.!!_


_ఆ తరం ప్రజలు అతి సామాన్య వ్యక్తులు._


_వాళ్ళు.._


 _రాత్రి పెందరాళే పడుకునే వాళ్ళు.!_

_ఉదయం పెందరాళే లేచేవాళ్ళు.!_

_నడక అలవాటు ఉన్నవాళ్ళు.!_ 

_మార్కెట్ కి నడిచి వెళ్ళే వాళ్ళు.!_


_వాళ్ళు....._


 _ఉదయమే  వాకిట కళ్ళాపు చల్లేవాళ్ళు !_

_ముంగిట్లో ముగ్గులు పెట్టేవాళ్ళు!_

_మొక్కలకు నీళ్ళు పెట్టేవాళ్ళు!_

 _పూజకు పూలు కోసే వాళ్ళు !_

_వాళ్ళు...._


_పూజ కాకుండా ఏమీ తినని వాళ్ళు !_

_మడిగా వంట వండేవాళ్ళు!_

_దేవుడి గదిలో దీపం వెలిగించే వాళ్ళు!_

_దేవుడి గుడికి వెళ్ళే వాళ్ళు.!_

_దేముడి మీద విశ్వాసం ఉన్నవాళ్ళు !!!_

_మనిషిని మనిషిగా ప్రేమించే వాళ్ళు.!!!_


_వాళ్ళు_ 


 _అందరితో ఆప్యాయంగా మాట్లాడేవాళ్ళు.!_ 

_కుశల ప్రశ్నలు వేసేవాళ్ళు..!_

_స్నేహంగా మెలిగే వాళ్ళు...!_

_తోచిన సాయం చేసేవాళ్ళు..!_

_చేతులు జోడించి నమస్కారం చేసేవాళ్ళు...!_


_వాళ్ళు_ 


_ఉత్తరం కోసం ఎదురుచూసిన వాళ్ళు..!_

_ఉత్తరాలు తీగకు గుచ్చిన వాళ్ళు...!_

_పాత ఫోన్ లు పట్టుకు తిరిగే వాళ్ళు...!_

_ఫోన్ నెంబర్ లు డైరీలో రాసిపెట్టుకునే వాళ్ళు....!


_వాళ్ళు_ 


_పండుగలకూ, పబ్బాలకూ అందరినీ పిలిచే వాళ్ళు.!_

_కుంకుడు కాయతో తలంటుకున్నవాళ్ళు..!_

_సున్నిపిండి నలుగు పెట్టుకున్నవాళ్ళు...!_

_పిల్లలకు పాలిచ్చి పెంచినవాళ్ళు ....!_ 


_వాళ్ళు ..._


_తీర్థయాత్రలు చేసేవాళ్ళు.!_

_ఆచారాలు పాటించే వాళ్ళు..!_

_తిధి, వారం, నక్షత్రం గుర్తుపెట్టుకునే వాళ్ళు.!_

_పుట్టినరోజు దీపం వెలిగించి జరుపుకునేవాళ్ళు..!_


_వాళ్ళు ...._


_చిరిగిన బనియన్లు తొడుక్కుని ఉండేవాళ్ళు.!_

_లుంగీలు, చీరలు  కట్టుకుని ఉండేవాళ్ళు...!_

_చిరిగిన  చెప్పులు కుట్టించుకుని వాడుకునే వాళ్ళు....!_

_అతుకుల చొక్కాలు కట్టుకున్నవాళ్ళు.!_


_వాళ్ళు ...._


_తలకు నూనె రాసుకునే వాళ్ళు .!_

_జడగంటలు పెట్టుకున్నవాళ్ళు..!_

_కాళ్ళకు పసుపు రాసుకునేవాళ్ళు...!_

_చేతికి గాజులు వేసుకునే వాళ్ళు.... !_


_ఇప్పటిలా మనుష్యులను వాడుకుని వస్తువుల తో స్నేహం కాకుండా... వస్తువులను వాడుకుంటూ మనుషులతో స్నేహంగా గడిపిన తరం....._


_ఈ తరాన్ని చూసి మూగబోయిన వాళ్ళు_


_మీకు తెలుసా ?_


_వీళ్ళంతా నెమ్మది నెమ్మదిగా మనల్ని వదిలి పెట్టి వెళ్ళిపోతున్నారు._


_మన ఇళ్ళల్లో ఇలాంటి వాళ్ళు అతి తక్కువ మంది మాత్రమే ఉన్నారు._


_మీ ఇంటిలో ఇలాంటి వాళ్ళు ఉంటే దయచేసి వాళ్ళను బాగా చూసుకోండి_ 


_లేదంటే ....._

_లేదంటే ...._ 

_లేదంటే ...._


_ఇప్పటి తరం చాలా కోల్పోవలసి వస్తుంది._


_వాళ్ళ ప్రపంచం, వస్తువులతో కాకుండా, మనుషులతో, మానవత్వంతో, స్నేహంతో కూడి ఉండే తరం.._


_సంతోషకరమైన జీవనం గడిపిన తరం అది ,!_


 _స్పూర్తిదాయక జీవనం గడిపిన తరం అది !_


_కల్లాకపటం లేని జీవనం గడిపిన తరం అది!_


 _ఉన్నది ఉన్నట్టు నిర్మొహమాటంగా ధైర్యంగా మాట్లాడగలిగినతరం_


_ద్వేషం, మోసం లేని స్నేహ జీవనం గడిపిన తరం అది!_


_సాత్విక ఆహారం తిని జీవనం గడిపిన తరం అది.!_


_లోకానికి తప్పు చేయడానికి భయపడి జీవనం గడిపిన తరం అది !_🙏


_ఇరుగుపొరుగుతో కలసిమెలసి జీవనం గడిపిన తరం అది!_😊


 _తనకోసం కొంత మాత్రమే వాడుకుని, తన సంతానం వృధ్ధి కోసం పరితపించిన తరం_


_వారినుండి మనం నేర్చుకోకపోతే ముందు తరాల మనుగడ ప్రశ్నార్ధకం అవుతుంది_ 🤔


_మీ కుటుంబంలో పెద్దవారిని మీరు గౌరవించడం ద్వారా మీ పిల్లకు మంచి సంస్కారం అందివ్వండి. ._🙏


_సమాజంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలతో స్నేహంగా వుండేట్టు వారిని తయారు చేయాలి..._


_సంస్కారం లేని దేశం ... సంస్కృతి లేని దేశంగా ఈ భారతాన్ని  మార్చెయ్యకండి.!!!_


_తప్పులను సరిదిద్దగలది సంస్కారమే!_🤝

_సర్కారు చేసే చట్టాలు కాదు..._🙏


_రాబోయే తరాలకు ఆస్తులనే కాదు ... ఆప్యాయతలను, స్నేహాన్ని కూడా అందిద్దాం.. లేకుంటే రాబోయే తరాలవారిని మనుషులుగా కాక మర యంత్రాలుగా పిలుస్తారు.._🤔


_*అందరూ బాగుండాలి అందులో మనం వుండాలి* జై భారత్🌹🙏

కామెంట్‌లు లేవు: