29, జూన్ 2021, మంగళవారం

నామం జపిస్తే

 🙏🌺శ్రీ రామ నామం🌺🙏


 🌺ఏ నామం అయినా పలికితే ఆ నామం యొక్క దేవుడు మాత్రమే పలుకుతాడు. అదే శ్రీ రామ అనే నామంలో రాముడు ఒక్కడే పలుకుతాడు అనుకోవడం పొరపాటు. 🌺


🌺శ్రీ రామ అనే నామం జపిస్తే ఆరుగురు దేవతలు పలుకుతారట.అదెలాగో చూద్దాం.🌺


🌺1. రామ అంటే రాముడు పలుకుతాడు తెలిసిందే


🌺2. రామ అనే నామం ఉన్న చోట అందరికన్నా ముందర వచ్చి ఆ నామాన్ని విని ఆనందించేది నిస్సందేహంగా ఆ హనుమంతుడే


🌺3. శ్రీ అంటే లక్ష్మి


🌺4. రా అంటే  విష్ణువు  (ఓం నమో నారాయణాయ అనే నామం లో నుంచి రా అనే జీవ అక్షరం తీసుకున్నారు)


🌺5. మ అంటే  శివుడు  (ఓం నమః శివాయ అనే నామం లో నుంచి మ అనే జీవ అక్షరం తీసుకున్నారు)


🌺6. శివుడు హనుమంతుడి రూపం లో భూలోకానికి రామ సేవ కోసం వస్తున్నప్పుడు పార్వతీ దేవి నాకు ఆ అదృష్టం కావాలి అన్నారట. 🌺


🌺అపుడు శివుడు ఇలా అన్నాడు ఈ అవతారం లో హనుమంతుడు బ్రహ్మచర్యాన్ని పటిస్తాడు కనుక నిన్ను తీసుకెళ్లడం కుదరని పని. 


అపుడు పార్వతీ దేవి అయితే నేను మీ తోక రూపంలో వస్తాను అని హనుమంతుడి తోక లో ప్రవేశించింది అట. 


మరి రామ అన్నపుడు హనుమ వస్తే *పార్వతీ* కూడా వచ్చింది కదా.


రాముడు, హనుమంతుడు, లక్ష్మి, విష్ణువు, శివుడు, పార్వతీ ఒక్క నామం పలికితే ఆరుగురు దేవతలు వచ్చి ఆశీర్వదించగలరు. గమనించండి. 🌺


🌺శ్రీ రామ శ్రీ రామ* అని అంటూనే వుందాము. 

మన ఈ మానవ జన్మ తరింద్దాము.🌺


               🌺ఓం జై శ్రీరామ్ 🌺

కామెంట్‌లు లేవు: