29, జూన్ 2021, మంగళవారం

వస్తు తత్వమును తెలిసేది ఙ్ఞానం.

 వస్తు తత్వమును తెలిసేది ఙ్ఞానం. లేనియెడల ఎవరో చెప్పాలి వస్తువు గురించి. ఎవరు దానికి మూలం. తల్లి తండ్రి. అందుకే వారి పెంపకం. వారికి ఎవరు చెప్పాలి. వారి తల్లి దండ్రులు. యిది నిరంతరాయంగా దీనికి మొదలు తుది లేదు. 

కొంతవరకు వారి పరిధి ఆపై ఎవరికి వారే. మూల సూత్రములను శబ్దం ద్వారానే తెలియాలి. శబ్ద, శక్తి, పదార్ధ విచ్ఛిన్నం అనుకుంటాము, కానీ విశ్వంలో పదార్ధము లేదు శక్తి మాత్రమే యున్నది. పదార్ధ లక్షణము లేక పోయినా శక్తి అనంతమై వ్యాప్తమగుచూ లక్షణము పదార్ధం వ్యాప్తివలనతెలియుచున్నది. యిదే ప్రకృతి తత్వం. అది పదార్ధం వలన యింకా స్పష్టంగా తెలియుట. ఆంగ్లంలో దటీజ్ దీనిని ఎవరు తెలియాలి తత్ అనే ఙ్ఞానమును. తత్ పదార్ధం కాదు. అది ధాతువైన పదార్ధ రూపమే. పదార్ధ రూపం కూడా లక్షణము తెలిసిన సత్ అని యిది యని వస్తు లక్షణము తెలియుట. అదియును అనుభవం వలననే. వేద వాఙ్మయం సమస్తం శబ్ద పదార్ధముగా  రంగు, రుచి, లక్షణములను వానిని వ్యాప్తరూపంగానే తెలియుచువ్నది. వస్తువు వకటే. మూల తత్వం సూత్రము వకటే. కానీ దేని లక్షణము, రంగు, వాసన రుచి వేరు వేరు గా కనిపించు చున్నవి. యిదే తత్ దటీజ్. దటీజ్ తెలిసినది అనగా అది అనుభవపూర్వకమైనగాని స్థరంమైన౮ి యని తెలియుట లేదు. దీనిని మానవుల ద్వారానే వివేకము ద్వారానే అనగా సూక్మ పరిశీలన ద్వారానే తెలియనగును. మనకు మన పెద్దలు సమస్తం నిర్వచించి వుంచారు, అది గ్రహించుటయే ఙ్ఞానము. ఎవరికీ తెలియనప్పుడు వక విశేష సూత్రము ద్వారా  అనగా ప్రకృతి మార్పు ద్వారా తత్ సత్ యని తెలియ వచ్చును. ఎల్లప్పుడు కలిగియున్నదని తెలియవచ్చును.అనంతమైన శక్తిని ఙ్ఞానం ద్వారా తెలుసుకుంటూనే వుందాం. ఆచరిస్తూనే వుందాం.

కామెంట్‌లు లేవు: