6, జనవరి 2021, బుధవారం

శని

 శని  

సూర్యునికి ఛాయ దేవికిని  వికారి నామ సంవత్సరం మార్గశిర కృష్ణ నవమి నాడు  కలిగిన సంతానమే "శని" ఇతని వృత్తాంతంము సూర్యుని వృత్తాంతమునందు చెప్పబడెను శని మానవ జీవితాలలో అత్యంత ప్రభావము చూపువాడు త్రిమూర్తుల సైతం ముప్పుతిప్పలు పెట్టినటువంటివాడు గ్రహమండలమున స్థానం పొందెను. అధిదేవత యముడు. ప్రత్యధిదేవత ప్రజాపతి. వాహనం: కాకి, ఋతువు: శిశిరం. సజ్ఞాదేవి శపించంగా శనికి మందగమనం ప్రాప్తించింది.

విపత్తి హానిం సంపత్తి కుక్షిరోగం సుతక్షయం

లక్ష్మీకరం మహర్ధైన్యం మరణం దేహ శోషణం

బంధనం లాభ నష్టంచ క్రమేణ కురుతే శని:

తాత్పర్యము : శని పన్నెండు రాశులలో సంచారము చేయు నపుడు 1 ఆపదలను 2 హానిని 3 సంపదను 4 గర్భసంభంద రోగములను 5 సంతానమునకు కష్టములను , నాశనమును 6 మహా ఐశ్వర్యమును 7 మహా దరిద్రమును 8 మరణ సమాన ఫలితములను 9 దేహ శోషణమును 10 బంధనమును 11 లాభమును 12 అనేక విధాల నష్టములను కలిగించు చున్నాడు .శని, సూర్యుడి నుండి ఆరవ గ్రహం. సౌర వ్యవస్థలో అన్ని గ్రహాల కంటే పెద్దదైన గురు గ్రహం తరువాత, శని అతి పెద్ద గ్రహం. ఇది పూర్తిగా వాయువులతో కూడుకుని ఉంటుంది. దీని సగటు వ్యాసార్థం, భూమి వ్యాసార్థానికి ఆరు రెట్లు ఉంటుంది.  సగటు సాంద్రత భూమి సాంద్రతలో ఎనిమిదవ వంతు ఉంటుంది. కానీ, శని ఘనపరిమాణం చాలా ఎక్కువ కావడాన, దాని ద్రవ్యరాశి భూమికి 95 రెట్లు ఉంటుంది. ఈ గ్రహానికి ఈ పేరు, హిందూ దేవుడు శని పేరిట వచ్చింది. దీన్ని ఇంగ్లీషులో శాటర్న్ అని అంటారు. ఇది రోమనుల వ్యవసాయ దేవత పేరిట వచ్చింది. శని గ్రహపు సంకేతం (♄) చేతిలో ఉండే కొడవలి పేరిట వచ్చింది.శనిగ్రహ ఉపరితలంపై బలమైన గాలులు వీస్తూంటాయి. ఈ గాలుల వేగం 1,800 కి.మీ./గం వరకూ ఉంటుంది. ఇది గురుగ్రహంపై గాలుల వేగం కంటే ఎక్కువ. నెప్ట్యూన్ పై గాలుల వేగంతో సమానం.   శనిగ్రహంపై ఒక రోజుకు 10 గంటల, 33 నిముషాల, 38 సెకండ్ల సమయం (+1 ని.52సె. -1ని.19సె) పడుతుందని 2019 జనవరిలో ఖగోళవేత్తలు లెక్కించారు. ఈ గ్రహపు అత్యంత ప్రముఖమైన విశేషం, దాని చుట్టూ ఉండే వలయాల వ్యవస్థ. ఇది మంచు ముక్కల తోను, రాళ్ళ శిథిలాల తోనూ కూడుకుని ఉంటుంది. శని చుట్టూ 62 సహజ సిద్ధ ఉపగ్రహాలు తిరుగుతున్నాయి. భారతీయ జ్యోతిష శాస్త్రంలో శని ఒక గ్రహం. దీన్ని నపుంసక గ్రహంగా భావిస్తారు. వర్ణం నలుపు, నీలం సూచిస్తాడు. శని మకర రాశి, కుంభరాశులకు అధిపతి. తులారాశిలో ఉచ్ఛస్థితిని, మేషరాశిలో నీచ స్థితిని పొందుతాడు. పుష్యమి, అనూరాధ, ఉత్తరాభద్ర నక్షత్రాలకు ఆధిపత్యం వహిస్తాడు. మిత్రులు బుధుడు, శుక్రుడు, శత్రువులు రవి, చంద్ర, కుజులు, సముడు గురువు. ముసలి వారిని, సన్నని పొడగరులను సూచిస్తాడు. తత్వం వాయుతత్వం, దిక్కు పడమర, ఋతువు శిశిరం, జాతి శూద్ర, లోహము ఇనుము, ఉక్కు, రత్నములలో నీలం, గ్రహసంఖ్య ఎనిమిది, దిక్బలం సప్తమ స్థానం, గుణము తమోగుణము, ప్రదేశము హిమాలయాలలోని గంగా పరీవాహక ప్రాంతాన్ని సూచిస్తాడు. శరీర అవయవములలో ఎముకలు, క్లోమము, విసర్జకావయములను సూచిస్తాడు. క్రూర గుణం.ప్రాణుల పాపఫలితాన్ని అందించే గ్రహంగా గుర్తించబడింది.ఇది పాపగ్రహంగా కూడా వర్ణించబడింది. దశా కాలం: 19 సంవత్సరాలు. ఏలిననాటి శని జాతక చక్రంలో 12,1,2 స్థానాలలో శని సంచరించే కాలం ఏలిననాటి శని కాలం. ఇది జాతకుని అత్యంత కష్టాలపాలు చేస్తుందని విశ్వసించబడుతుంది.ఇది దాదాపు ఏడున్నర సంవత్సరముల కాలం.ఇది జాతకునికి నాలుగు సార్లు రావచ్చని భావన. పాద శని, పొంగు శని, మంగు శని 8 మరణశని. శతృవు: రవి,చంద్రుడు,కుజుడు శతృగ్రహాలుగా భావిస్తారు ఆకారణంగా రవి కారకత్వంగా కలిగిన తండ్రి చంద్రుడు కాతకత్వంగా కలిగిన తల్లి కుజుడు కారకత్వంగా కలిగిన సోదరులతో శని ఆదిపత్యం కలిగిన మకర మరియు కుంభ రాశుల వారికి పరస్పర వైరం ఉంటుందని భావిస్తారు.ఏలిన నాటి శని కాలం ఏడున్నర సంవత్సరమముల కాలం, శని మహర్దశ కాలంలో, అర్ధాష్టమి, అష్టమ స్థాన సంచార కాలంలో సమస్యలు సృష్టిస్తాడు. వీటికి ఆందోళన చెందవలసిన పని ఉండదు. పరిహారాలు ఉంటాయి. శని ఆధిపత్యంలో ఉన్న రాశులు అయిన కుంభ, మకర రాశుల వారికి, మిత్ర స్థానాలు అయిన మిధున, కన్యా, వృషభ, తులా రాశుల వారికి శని నక్షత్రాలైన పుష్యమి, అనూరాధ, ఉత్తరాభద్ర నక్షత్రాలలో జన్మింక్ష్చిన వారికి, కొంత వెసులుబాటు ఉంటుంది. కష్టాలు మనిషి అహంకారం తగ్గించి జీవిత సత్యాలను తెలియ చేయడమే కాక సుఖానికి ఉన్న విలువను గుర్తించేలా చేస్తుంది. శని జీవిత గమనానికి కావలసిన స్థిరాస్థులను ఏర్పరుచుకోవడానికి కారకుడౌతాడు కనుక కొంత మంచి జరుగుతుంది. కష్టాలను ఓర్చుకునే శక్తిని, వాటిని అధిగమించే శక్తిని ఇచ్చి మనిషిని పుటం పెట్టిన బంగారంలా మెరిసేలా చేస్తుంది. శని వైరాగ్యాన్ని, భక్తిని ప్రసాదిస్తాడు. ఆయుఃకారకుడు, ఆటంకములు, విరోధం, కష్టం, బాధలు, దుఃఖం, సేవకత్వం, దురాచారము, బంధనం, మూర్ఖత్వం, జూదము, జైలు జీవితం, మద్యపానం, అంగవైకల్యం, మూర్చ రోగం, అంగవైకల్యం, బ్లాక్ మార్కెట్, అన్యాయార్జన, జీవహింస, అవమానము, రాజదండన, బద్ధకం, క్షుద్రశక్తులు, అప్పులు, మృత్యుదేవతారాధాన, అంద విహీనత, బంధు మిత్ర తిరస్కారం సూచిస్తాడు. వంటవారు, నపుంసకులు, చండాలురు, అక్రమసంతానం, సేవకులు, నీచులను సూచిస్తాడు. పురాతన భవనాలు, పురాతన వస్తువులు, పూరావస్తు శాఖ, సొరంగాలు, గుహలు, చలివేంద్రములు, నువ్వుల నూనె, గానుగ, నూనె దుకాణములను సూచించును. నువ్వులు, ఉల్లి, వేరు శనగ, బంగాళాదుంపలు, రాగులు, జొన్నలు, మినుములు, దున్నపోతు, గాడిద, ఒంటె, కోడి, బొగ్గు, తారు, నల్లమంగోళ్ళకు సంబంధించిన సమస్యలు, అజీర్ణం, కిరోసిన్, వెండ్రుకలు, ఎముకలు, దంతములను సూచిస్తాడు. కలప, తోలు పరిశ్రమలను సూచిస్తాడు. ఆలస్యము, దురదృష్టము, సరిహద్దులు, దహనకార్యక్రమాలు, అపవాదు, పదవీ విరమణ, నిర్మాణం, శాస్త్రీయదృక్పదం, ఒంటరి తనం సూచిస్తాడు. గనులు, వంతెనలు, చర్మము, ఆనకట్టలు, పిరికి వాళ్ళు, రాళ్ళు, ఆస్తి, ఆపద, మంచు, ఆందోళన, వినయము, అనుమానము, అనుకూలత, వినయము, సెరామిక్స్, మట్టిని సూచిస్తాడు. శని వాత సంబంధ వ్యాదులను సూచిస్తాడు. కీళ్ళ వాతం, పక్షవాతం, బలహీనత, నొప్పులు, కిడ్ని లివర్ మొదలైన వాటిలో రాళ్ళు ఏర్పడుట, క్షయ, దగ్గు, ఆస్త్మా, న్యుమోనియా, ఎముకలకు సంబంధించిన వ్యాధులు, వెంట్రుకలకు సంబంధించిన సమస్యలు, అజీర్ణ వ్యాధులు, పని చేయలేని అశక్తి, డ్రగ్స్ అలవాటు మొదలైన వాటికి కారకుడు. చంద్రుడితో కలిసిన మతి భ్రమణం, పిచ్చి, వాతం, గుండె నొప్పి, కండరాల నొప్పి, తల నొప్పి, బద్దకం, నీరసం మొదలైనవి సూచిస్తాడు. గురువుతో చేరిన జీర్ణ వ్యస్థకు సంబంధించిన వ్యాధులు. బుధుడితో కలిసిన మాటలు సరిగా రాకుండుంట, నత్తి, నాలుక మొద్దుబారటం, మెదడు మొద్దుబారటం, చెవి సంబధిత వ్యాధులు సూచిస్తాడు. కుజుడితో కలిసిన కండరాల నొప్పి, కండరాల జబ్బులు సూచిస్తాడు. శుక్రుడితో కలిసిన గొంతు నొప్పి, టాన్సిల్స్, పైల్స్, విరేచనాలు మొదలైన వ్యాదులను సూచిస్తాడు. రాహువుతో కలిసిన విషప్రయోగం, వైరస్ వ్యాదులను సూచిస్తాడు.కేతువుతో కలిసిన రక్త పోటు వ్యాదులను సూచిస్తాడు.  జైలర్, ప్లంబర్, వాచ్‌మన్, పాకీపని చేయు వారు, వీధులు ఊడ్చు వారు, కూలీలు, మేస్త్రీ పని వారు, తోటమాలి, రైతులను సూచిస్తాడు. లోహాలు, తోలు, కలప వ్యాపారాలు. చంద్రుడితో కలిసిన సివిల్ ఇంజనీర్లు, బిల్డర్స్, సర్వేయర్లు, ఎక్స్‌రే టెక్నీషియన్లను సూచిస్తాడు. రవితో కలిసిన ప్రభుత్వరంగ సేవలు చేసే వారు. గురువుతో కలిసిన భూముల కొనుగోలు అమ్మకాల వ్యాపారం, గనుల యజమానులు, సైంటిఫిక్ లాబ్‌లో పని చేయు వారు. బ్యాంక్ సిబ్బంది, ప్రచారం చేయు వారిని సూచిస్తాడు. బుధుడితో కలిసిన రచయితలు, శాస్త్రవేత్తలు, కలప కోయు వారు, ఉపాధ్యాయులు, సెన్సార్ బోర్డ్, సి ఐ డి డిపార్ట్ మెంటులో పని చేయు వారిని సూచిస్తాడు. శనికి ప్రీతికరమైన జ్యేష్టశుద్ధ ద్వాదశి, మార్గశిర శుద్ధ అష్టమి నాడు పూజలు జపాలు నిర్వహించడం శ్రేష్టం. దోషనివారణకు నీలమణి, ఎర్రచందన మాల, చతుర్దశ ముఖ రుద్రాక్ష ధారణ చేయాలి. హోమముకు వాడవలసిన సమిధ జమ్మి. ప్రీతికరమైన వారం శనివారం.


లగ్నంలో శని ఉన్న జాతకుడు దు॰ఖపూరితుడు, నిస్సహాయుడు, మలినాంబరధారి, నీరసి అయి ఉంటాడు. అయినా శని స్వరాశులైన మకరం, కుంభం, ఉచ్ఛ స్థానమైన తుల రాశులు లగ్నమై వాటిలో శని ల్గ్నస్థుడై ఉంటే మాత్రం రాజతుల్యుడు, ప్రధాన పదవులు వహించే వాడు, నగరపాలకుడు ఔతాడు.

ద్వితీయస్థానమున శని ఉన్న జాతకుడు జుగుస్సు కలిగించే ముఖం కలవాడు, ధనహీనుడు, అన్యాయవర్తనుడు, కాలక్రమమున దూరప్రాంతములణందు నివసించు వాడు ధనవంతుడు ఔతాడు.

తృతీయస్థానమున శని ఉన్న జాతకుడు మిక్కిలి విజ్ఞానవంతుడు, ఉదారుడు, భార్యాసమేతంగా సుఖపడువాడు, ఉత్సాహి, దుఃఖం లేని వాడు ఔతాడు.

చతుర్ధస్థానమున శని ఉన్న జాతకుడు సుఖహీనుడు, గృహము లేని వాడు, వాహనములు లేని వాడు, బలారిష్టములు అనుభవించు వాడు, తల్లిని పీడించువాడు ఔతాడు.

పంచమస్థానమున శని ఉన్న జాతకుడు, అజ్ఞాని, పుత్రులు లేని వాడు, ధనహీనుడు, సుఖహీనుడు, దురభిమాని, దురాలోచనాపరుడు ఔతాడు.

షష్టము స్థానమున శని ఉన్న జాతకుడు ధనవంతుడు, అధికంగా ఆహారం తినువాడు, దుశ్చరిత్రుడు, అభిమానవంతుడు, శత్రువుల చేత ఓడింపబడిన వాడు ఔతాడు.

సప్తమస్థానమున శని ఉన్న జాతకుడు తిరుగాడు వాడు, కళత్రం కలిగిన వాడు, భయకంపితుడు ఔతాడు.

అష్టమ స్థానమున శని ఉన్న జాతకుడు శుభ్రం లేని వాడు, ధనం లేని వాడు, మూల వ్యాధి పీడితుడు, క్రూరమనస్కుడు, సజ్జనుల చేత అవమానించబడిన వాడు ఔతాడు.అదే శని వక్ర మార్గం లో ఉంటే ఆయుష్షు నష్టం అవుతుంది. లగ్నం లో రవి 8 అష్టమం లో శని రోగపీడితులు.

నవమస్థానమున శని ఉన్న జాతకుడు అదృష్టం లేని వాడు, సంపదలేని వాడు, సంతతి లేని వాడు, పితృధర్మం లేని వాడు, మోసకారి ఔతాడు.


దశమస్థానమున శని ఉన్న జాతకుడు రాజు కాని, మంత్రి కాని ఔతాడు. ధైర్యవంతుడు, ధనవంతుడు, ఖ్యాతి కలవాడు ఔతాడు.


ఏకాదశ స్థానమున శని ఉన్న జాతకుడు చిరంజీవి, బహుసంపాదనాపరుడు, స్థిరసంపదలు కలిగిన వాడు, రోగములు లేని వాడు ఔతాడు.

ద్వాదశ స్థానమున శని ఉన్న జాతకుడు నిర్లజ్జ కలవాడు, ధనం లేని వాడు, పుత్రులు లేని వాడు, అంగవికలుడు, మూర్ఖుడు, శత్రువులచేత తరమబడిన వాడు, పుత్రులు లేని వాడు ఔతాడు.....మీ... *చింతా గోపీ శర్మ సిద్ధాంతి** *లక్ష్మీలలితా వాస్తు జ్యోతిష నిలయం* (భువనేశ్వరిపీఠం) పెద్దాపురం, సెల్:- 9866193557

కామెంట్‌లు లేవు: