*భాగవతము*
*శ్రీగురుభ్యోనమః*
🕉🌞🌎🌙🌟🚩
*రావణుడు కంఠారావమునకు అధిపతి. అనగా ఉచ్ఛారణమున కధిపతి. వేదమునకు స్వరము ఏర్పరచమని దేవతలందరూ బ్రహ్మ దేవునితో కలిసి మహాదేవుని దగ్గరకు వెళ్లి వేడుకుంటారు. అపుడు మహాదేవుడు నా పరమ భక్తుడైన రావణుడు ఏర్పరుస్తాడు అని అంటాడు.*
*రావణుడు మొత్తము వేదానికి స్వరము కట్టినటువంటి వాడు. రావణునికి సంగీతము తెలుసు. ఆయన వీణ వాయిస్తే సృష్టి అంతా కరిగిపోయేటంతటి జ్ఞానము కలిగిన వాడు. పరమశివుడు గూడా ఆయన వీణా గానమునకు పరవశించి పోయేవాడు.*
*ఉదాత్తము, అనుదాత్తము, స్వరము మూడు చక్కగా పలుకుతూ వేదగానము చేస్తే కంఠము నుండి ధ్వని తరంగములు ఏర్పడి శరీరమంతా శుద్ధి అయిపోతుంది.*
🕉🌞🌎🌙🌟🚩
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి