తాటాకుల గ్రంథాలు తయారు చేయడం ఒక కళ. తాటి మట్టల నుంచి ఆకులు విడిపించి, సమానంగా కత్తిరించి నీడలో ఎండించేవారు. నీడలో ఎండించడానికి సంస్కృతభాషలో
'ఛాయాశుష్కం' అంటారు. నీడలో యెండిస్తే పెళుసు బారవు. తర్వాత వాటిని నీటిలోగానీ,ఆవుపంచితంలోగానీ నానబెట్టేవారు. పిదప ఉడికించేవారు.తద్వారా ఆకులు మెత్తబడతాయి. వాటిమీద శంఖంతో కానీ, గవ్వలవంటి నున్నని వస్తువులతో రుద్దేవారు.
దానితో ఆకు గరుకుదనం పోయి నునుపుదేరుతుంది.తర్వాత కొంచెం యెడం విడిచి
ఒకవైపుగానీ రెండువైపులాగానీ రంధ్రాలు చేసి దారాలతో కట్టేవారు.ఇదే గ్రంథం.
గ్రంథం అంటే చేర్చబడినది అని అర్థం.సూత్రమంటే దారం. ఈ తాటాకుల్లోని దారం
(సూత్రం)పూసల్లోని దారంలాగా ఆకులను చుట్టుకొని వుంటుంది కదా! ఇలాగే చాలా
విషయాలకు వర్తించే వాక్యం సూత్రమైంది.ఈ గ్రంథమే ప్రోతమై అంటే కూర్చబడినదై
పోదీ, పొత్త మైంది. పోస్ట్ అనే పారసీ శబ్దం నుంచి పుస్తకం అన్నమాట వచ్చిందన్నది పెద్దల మాట ('తెలుగులుగు" మాసపత్రిక సౌజన్యముతో)
-------------------------శుభరాత్రి-----------------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి