17, జులై 2020, శుక్రవారం

*గతమెంతో ఘనమైనది తెలుగోడా!*

మడి బట్ట ఆరేసుకోవటానికి దండె వుండేది, 

మడి నీళ్లు, వంటిల్లు, చల్ల గదిలో ఊరగాయ జాడీలు, అందులో చింతకాయి, నిమ్మకాయి, దబ్బకాయి, ఆవకాయ, మాగాయి, మెంతికాయి, తొక్కుడు పచ్చడి, వడియాలు, అప్పడాలు, ఊర చల్ల మిరపకాయలు, వుండేవి. 

బాదం చెట్టు, కరివేపాకు, అరటి, మందారం, పారిజాతం, తులసి మొదలైనవి. 

రెండు పెద్ద అరుగులు, ఎడమవైపు పోస్టాఫీసు గది, కుడి వైపు కరణీకం దస్త్రాల గది, మధ్యలో మండువా, అటుా, ఇటూ గదులు, పెద్ద వసారా, అందులో ఆడపిల్లలు కుార్చునేవారు.

ఇంట్లోకి  రాకూడదనేవారు, ఆచారము, అంటు అని మాట మాటకి అనేవారు. 

బయట తిరిగి వస్తే, కాళ్లు చేతులు కడుగుకొని, బట్టలు మార్చుకున్నాకే భోజనం. 
                                                                                                                                                                                                                 ఉదయం 10.30, సాయంత్రం 6 కల్లా భోజనం. మజ్జిగ అన్నంలో వేసవి కాలంలో మామిడి పళ్ళు.

ఉదయం చద్దెన్నం, చిన్న పిల్లలకు కాఫీ లేదు, మధ్యాహ్నం, జంతికలు, మిఠాయి కొమ్ములు, చేగోడీలు, పుాతరేకులు.

శీతాకాలంలో, సీతాపలాలు, జామకాయ, సపోటా, తేగలు, బుర్ర గుంజు, తాటి ముంజెలు, వేసవి కాలంలో  ఈత కాయలు, సీమ చింతకాయలు.

*భోజనములో కంది పచ్చడి, పెసరపప్పు పచ్చడి, మినపప్పు పచ్చడి, గోంగూర పచ్చడి, కొబ్బరి కాయ పచ్చడి, వంకాయ పచ్చడి, పచ్చి పులుసు, మెంతి మజ్జిగ, చల్లపులుసు, కందిపొడి, నువ్వులపొడి, పొట్లకాయపెరుగు పచ్చడి, పాలు పోసి ఆనపకాయకూర, ఆవ పెట్టి పనస, అరటి, కంద బచ్చలి, కూరలు, తెలగపిండితో కూరలు, గుత్తి వంకాయ, మామిడికాయ పప్పు, దోసకాయ పప్పు (టమోటా తక్కువ), తోటకూర, బచ్చలికూర, గోంగూర శనగ పప్పు పులుసు, పెండలం కుార, వేపుళ్ళు, బంగాళదుంప ఉప్మా కుార.*
 
*ఇంక తద్దినం భోజనము సరేసరి. ఆలస్యం అయినా అమోఘం. మధ్యాహ్నం 2 దాక వేచి చూసే వాళ్ళం.  మధ్యలో అడిగితే, బ్రాహ్మల భోజనాలు అవుతున్నాయి, అరగంట ఆగండి అనేవారు.*

*గారెలు, అప్పాలు, పరవాన్నం, నువ్వు పచ్చడి లేక పొడి, అల్లప్పచ్చడి, పులుసు వుండదు, చారు, పెసరపప్పు (ఉట్టిదే తినాలనిపించేది) తీపి కూర, ఆవపెట్టిన కూర, ఇంకో కూర. అనకూడదు కానీ, తద్దినం భోజనం తలుచుకుంటే ఎటువంటి వారికైనా నోట్లో నుంచి చొంగ కారాల్సిందే!*

ఇంక శనివారం, ఆదివారం నాడు ఫలహారం దిబ్బరొట్టి  తేనె పానకం.

*శుభకార్యాలలో, బూరెలు, బొబ్బట్లు, మైసూరు పాక్ (ఆరోజుల్లో) పూతరేకులు, బూంది లడ్డు, గుమ్మడి కాయ దప్పళం, పనస పొట్టు కూర స్పెషల్.*

*అత్తరు సాహెబ్ సెంటు, అత్తరు. వచ్చినప్పుడు కంటికి సుర్మ పెట్టే వాడు.*

తలకు రాసుకోవటానికిి టాటా, స్వస్తిక్ సువాసనగల నూనె, ఆడవాళ్ళు జుట్టు ఊడకుండ 'రీట' రాసుకునేవారు.

అప్పట్లో తిలకం పెట్టుకునే వారు, స్టిక్కర్లు లేవు. 

మగవాళ్ళం కూడ తిలకం పెట్టుకుని బడికి వెళ్ళే వాళ్ళం.  

పెద్దలు విభూది పెట్టు కొనేవారు.
                                                                                                                                                                                                                        రాత్రి పడుకునేటప్పుడు కథలు చెప్పుకునేవారం, 

కరోన వచ్చింది.

మా చిన్నతనం గుర్తొచ్చింది,

కామెంట్‌లు లేవు: