17, జులై 2020, శుక్రవారం

ముగ్గురు జగద్గురువులు



1980వ దశకంలో కంచి కామకోటి పీఠానికి చెందిన ముగ్గురు జగద్గురువులు చంద్రశేఖరేంద్ర, జయేంద్ర, శంకర విజయేంద్ర సరస్వతులు ఏకకాలంలో ఈ భూమిపై నడయాడిని సంగతి చాలామందికి తెలిసినదే. పీఠంలో ప్రతిరోజు త్రికాల పూజలు జరుగుతాయి.
ముగ్గురు పీఠాధిపతులు ఒకే పూజ చేసినా ఒకొక్కరిదీ ఒక్కోశైలి.. ఇది గమనించిన ఒక గడుసరి భక్తుడు పరమాచార్య స్వామి వారి దగ్గరకు వచ్చి.. "స్వామీ మీరూ, బాల స్వామి వారు చాలా నిదానంగా చేస్తారు పూజ, కానీ జయేంద్ర స్వాముల వారు ఎందుకని త్వరగా ముగించేస్తారు ? వారికి శ్రద్ధ లేదా ఏమి ?" అని అడిగాడు.
దానికి సమాధనంగా ఒక చిరునవ్వుతో "నేనూ, చిన్న స్వామి వారూ పూజ చేసేటప్పుడు అమ్మవారిని వేడుకోవల్సి వస్తుంది.. అమ్మా రా అమ్మా ఈ పువ్వు స్వీకరించు అని అడిగితే కాని రాదు అందుకె నెమ్మదిగా సాగుతుంది. కాని జయేంద్రుల వారు చెసేటప్పుడు ఆ బాధ లేదు, వారు 108 బిల్వాలతో చంద్రమౌళీశ్వర అర్చన చేస్తే మొత్తం శివ గణాలన్నీ వచ్చి కూర్చుంటాయి, అమ్మవారి పూజకు అవిడ సిద్ధంగా కూర్చొని ఉంటుంది అందుకే వారి పూజ త్వరగా పూర్తవుతుంది" అని వివరించారుట చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వాముల వారు.
జయ జయ శంకర.. హర హర శంకర..

కామెంట్‌లు లేవు: