17, జులై 2020, శుక్రవారం

ధర్మం.

శ్రీరాముడు అడవికి వేళ్లేముందు అనుజ్ఞకోసం కౌసల్య దగ్గరకు వెళ్ళాడు. వూరికిపోయే పిల్లవాడికి త్రోవలో తింటానికి తల్లి ఏవైనా తినుబండారాలివ్వడం ఆచారంగదా. పధ్నాల్గేండ్లు తనకు దూరంగా పోయే కొడుకుకి ఏమివ్వాలి. పాపం కౌసల్యకి ఏమి ఇవ్వాలో తెలియలేదు. కాస్సేపు లోతుగా ఆలోచించి ఆమె అన్నది.

యం పాలయసి ధర్మం త్వం
ధృత్యాచ నియమేనచ
సవై రాఘవ శార్ధూల
ధర్మస్త్వామభిరక్షతు

(అయోధ్య 15-3)

రాఘవా! నీ రక్షణకోసం నేను చేయగల్గింది ఏమీ లేదు. ధర్మం ఒక్కటే నిన్ను రక్షించేది. ఏ ధర్మమైతే ధైర్యంగా నియమముగా నీవు నిత్యమూ పాలిస్తూ వచ్చావో ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది. నేను నీకిచ్చే ఆశీర్వాదమదే అన్నది. మనం ధర్మాన్ని కాపాడితే ధర్మం మన్ని కాపాడుతుంది.

కామెంట్‌లు లేవు: